News April 8, 2025

సిట్ విచారణకు హాజరైన శ్రవణ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. HYD జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ విచారణకు A6గా ఉన్న శ్రవణ్ రావు హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ఆయనను మరింత లోతుగా విచారించి, సమాచారం సేకరించాలని సిట్ భావిస్తోంది. గతంలో ఆయన ఎంక్వైరీకి సహకరించలేదని సిట్ వెల్లడించగా, నేటి విచారణపై ఆసక్తి నెలకొంది.

News April 8, 2025

పవన్ కుమారుడికి గాయాలు.. CBN, KTR దిగ్భ్రాంతి

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై AP CM చంద్రబాబు, మంత్రి లోకేశ్, TG మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘బాలుడు త్వరగా కోలుకోవాలి. ఈ కష్ట సమయంలో పవన్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని చంద్రబాబు, లోకేశ్ ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

News April 8, 2025

సీఎం రేవంత్‌కు నటి ఊర్వశీ రిక్వెస్ట్

image

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై నటి ఊర్వశీ రౌతేలా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డిగారు కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని నేను వేడుకుంటున్నా. ఇది అభయారణ్యమే కాదు.. మన నగరానికి జీవం పోసే శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ’ అని ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చారు.

News April 8, 2025

నేడు, రేపు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

తెలంగాణలో ఇవాళ, రేపు ఉమ్మడి వరంగల్, KMM, నల్గొండ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు APలో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది.

News April 8, 2025

ఆ రూల్‌ మార్చాలి.. భారత క్రికెటర్ అసహనం

image

MI, RCB మ్యాచ్‌‌పై IND క్రికెటర్ విహారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘RCB ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కు జితేశ్‌శర్మను అంపైర్ LBWగా ప్రకటించారు. రివ్యూ తీసుకోగా నాటౌట్‌ అని తేలింది. ఆ బంతికి పరుగు తీసినా రూల్ కారణంగా కౌంట్ అవ్వలేదు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో లాస్ట్ బాల్‌‌కు 2 రన్స్ చేయాల్సిన సమయంలో ఇలా జరిగితే పరిస్థితేంటి? అంపైర్ నిర్ణయంతో ఫలితం మారేది. ఇప్పటికైనా ఈ రూల్ మార్చాలి’ అని అసహనం వ్యక్తం చేశారు.

News April 8, 2025

ముంబై పర్యటనకు కందుల దుర్గేశ్

image

AP: పర్యాటక శాఖలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేశ్ ఈ నెల 9, 10 తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. పోవై లేక్‌లో జరిగే దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు, రాయితీలు వంటివి వివరించి ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్నారు. మంత్రితో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి వెళ్లనున్నారు.

News April 8, 2025

జంట పేలుళ్ల కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

image

TG: దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో HC సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. దోషులు తహసీన్ అక్తర్, భక్తల్, అజాబ్, అసుదుల్లా అక్తర్, రెహ్మాన్‌కు గతంలో NIA కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం సరైనదేనని పేర్కొంది. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడుల ప్రధాన సూత్రధారుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

News April 8, 2025

ట్రై-సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

image

సౌతాఫ్రికా, శ్రీలంకతో ఈ నెల 27 నుంచి జరగనున్న ట్రై-నేషన్ ODI సిరీస్ కోసం భారత మహిళల జట్టును BCCI ప్రకటించింది. గాయం కారణంగా రేణుకా సింగ్, టిటాస్ సాధును సెలక్షన్స్‌కు పరిగణించలేదు.
జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(C), స్మృతి మంధాన, ప్రతిక, హర్లీన్, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, అమన్ జోత్ కౌర్, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసబ్నీస్, శ్రీ చరణి, సుచి ఉపాధ్యాయ్.

News April 8, 2025

గోల్డ్ రేట్ టుడే!

image

USA విధించిన సుంకాలతో బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇవాళ కూడా గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ₹650 తగ్గి ₹89,730కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹600 తగ్గి ₹82,250గా పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రూ.1,03,000గా ఉంది. కాగా, గత 5 రోజుల్లోనే తులం బంగారంపై రూ.3,650 తగ్గడం విశేషం.

News April 8, 2025

ఎన్డీఏ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్

image

TG: అచ్చే దిన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం(NDA) ఒక్కరోజులోనే హ్యాట్రిక్ కొట్టిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సెటైర్ వేశారు. LPG గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు, చమురు ధరలు కనిష్ఠానికి పడిపోయినా ఇంధనంపై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ వడ్డింపు, సెన్సెక్స్ రూ.19 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయని దుయ్యబట్టారు. అచ్చే దిన్‌కు ఇవి సంకేతాలా లేక భారత్‌ను గొప్పగా మార్చేందుకు ప్రారంభమా అని ప్రశ్నించారు.