News April 8, 2025

తెల్లదొరల పాలిట సింహస్వప్నమై..

image

తొలి స్వాతంత్ర్య ఉద్యమ ప్రస్తావన రాగానే గుర్తొచ్చే పేరు మంగళ్ పాండే. భారతీయులను బానిసలుగా మార్చి పాలిస్తున్న తెల్లవారిని ఎదిరించి సిపాయిల తిరుగుబాటుకు పునాది వేశారు. బ్రిటిషర్ల దురాగతాలపై కదం తొక్కి వారి పాలిట సింహస్వప్నంలా మారారు. అదే క్రమంలో తెల్ల దొరలపై దాడి చేయగా పాండేకు ఉరిశిక్ష విధించారు. 1857లో పాండే తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటుగా మొదటి స్వాతంత్ర ఉద్యమంగా మారింది. ఇవాళ ఆయన వర్ధంతి.

News April 8, 2025

APSRTC 750 ఎలక్ట్రిక్ బస్సులు

image

APకి కేంద్రం శుభవార్త అందించింది. ‘PM ఈ-బస్ సేవా’ కింద తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. విజయవాడ, GNT, VSKP, కాకినాడ, రాజమండ్రి, NLR, తిరుపతి, కర్నూలు, అనంతపురం, మంగళగిరి, కడప నగరాల్లో వీటిని తిప్పనుంది. PPP పద్ధతిలో 10వేల బస్సులను రాష్ట్రాలకు కేంద్రం ఇస్తుండగా, ఏపీకి 750 కేటాయించింది. త్వరలోనే ఏ డిపోకు ఎన్ని కేటాయించాలనే దానిపై వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.

News April 8, 2025

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

image

నిన్న భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74,227, నిఫ్టీ 282 పాయింట్లు పొంది 22,444 వద్ద మొదలయ్యాయి. HUL, ట్రెంట్, టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం నుంచి భారత్ సహా వివిధ దేశాల స్టాక్స్ స్వల్పంగా కోలుకుంటున్నాయి.

News April 8, 2025

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ప్రీరిలీజ్‌కు NTR

image

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా 12వ తేదీన ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, ఈ చిత్రంలో విజయశాంతి తల్లి పాత్రలో నటిస్తున్నారు.

News April 8, 2025

అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు

image

AP: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో Dy.CM పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. స్కూలులో జరిగిన ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలిసి పవన్‌ను వెంటనే సింగపూర్ వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే కురిడి గ్రామానికి వస్తానని మాటిచ్చానని, ఆ తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ బదులిచ్చారు.

News April 8, 2025

TRADE WAR: ట్రంప్ వార్నింగ్‌ను లెక్కచేయని చైనా

image

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్‌కు ప్రతీకారంగా చైనా కూడా 34% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ రేపటిలోగా చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే టారిఫ్స్‌ను 50శాతానికి పెంచుతామని హెచ్చరించారు. ‘టారిఫ్స్‌తో మేమూ నష్టపోతాం. కానీ ఆకాశమేం ఊడిపడదు. తుది వరకు పోరాడుతాం’ అంటూ చైనా ఘాటుగా బదులిచ్చింది. కాగా టారిఫ్స్‌పై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

News April 8, 2025

పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్

image

TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాళ్టి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించింది. ఆస్తులు అమ్మి కాలేజీలు నడుపుతున్నామని, నాలుగేళ్లుగా బకాయిలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

News April 8, 2025

ఫ్యామిలీతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. భార్య స్నేహ, కూమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను స్నేహ ఇన్‌స్టాలో పోస్ట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు అభిమానుల నుంచి ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. HAPPY BIRTH DAY ANNA అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

News April 8, 2025

చిన్నారులపై లైంగికదాడులు.. నిందితుల అరెస్ట్

image

తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై అత్యాచార ఘటనలు కలకలం రేపాయి. ఆదిలాబాద్‌లోని మావలలో 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. APలోని ఎన్టీఆర్ జిల్లాలో ఆరేళ్ల బాలికపై 43 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో చుట్టు పక్కన వాళ్లు అప్రమత్తమై నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

News April 8, 2025

రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు

image

మరో రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైందని AICTE ఛైర్మన్ సీతారాం తెలిపారు. ఇంజినీరింగ్ డిప్లోమా, డిగ్రీ కోర్సుల మొదటి, రెండో సంవత్సరాల కోసం 600 పుస్తకాలు సిద్ధమైనట్లు తెలిపారు. 3, 4వ సంవత్సరాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ పుస్తకాలను అనువదించేందుకు ఏఐ సాంకేతికను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.