News May 8, 2025

మద్యంతో క్యాన్సర్ ముప్పు.. మానేస్తే బెటర్!

image

ఆల్కహాల్ తాగడం ప్రమాదకరమని తెలిసినా ఎవ్వరూ లెక్కచేయట్లేదు. దీని వల్ల ఏటా 7.5 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం వల్ల రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కాలేయం, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. భారత్‌లో ఆల్కహాల్ వల్ల 62వేలు, చైనాలో 2.8లక్షల మందికి ఈ క్యాన్సర్లు సోకుతున్నట్లు వెల్లడించారు. మద్యపానాన్ని నివారించడం ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.

News May 8, 2025

వచ్చే వన్డే WCలో ఆడుతారా? రోహిత్ ఏమన్నారంటే?

image

అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు పలికిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు 2027 వన్డే వరల్డ్‌కప్ వరకూ ఆడాలని ఉంది. అదే జరిగితే అద్భుతంగా ఉంటుంది’ అని తెలిపారు. కాగా వన్డే వరల్డ్ కప్ గెలవడం తన కల అని రోహిత్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. 2023లో ఫైనల్ వరకు వెళ్లి ట్రోఫీకి అడుగు దూరంలో ఆగిపోయారు. ఇప్పటికే ఆయన టీ20లకూ రిటైర్మెంట్ ప్రకటించారు.

News May 8, 2025

జస్టిస్‌ వర్మపై నివేదిక.. రాష్ట్రపతి, ప్రధానులకు లేఖ

image

జస్టిస్ యశ్వంత్ వర్మపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్రపతి, ప్రధానులకు, CJI సంజీవ్ ఖన్నా అందజేశారు. ఈ వ్యవహారంలో జస్టిస్ వర్మ వాదనలను జత చేస్తూ లేఖ రాశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు బయటపడింది. దీంతో విచారణకు ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది.

News May 8, 2025

మరికాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాబోయే మూడు గంటల్లో ములుగు, మహబూబ్ నగర్, సూర్యాపేట్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెంలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News May 8, 2025

PBKSvsDC: వర్షం కారణంగా టాస్ ఆలస్యం

image

ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది.

News May 8, 2025

సైనికులకు సంఘీభావంగా సీఎం ర్యాలీ

image

‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. Dy.CM భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున యువత తరలివచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకూ ప్రభుత్వం ర్యాలీ చేపడుతోంది.

News May 8, 2025

Women Wellness: మంచి భార్య అనిపించుకోవాలని..!

image

మంచి భార్య, మంచి కోడలు అనిపించుకోవడానికి మహిళలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీన్నే గుడ్‌వైఫ్ సిండ్రోం అంటారు. ప్రతి విషయంలోనూ సర్దుకుపోవడం, సంతోషాలను త్యాగం చేయడం గుడ్‌వైఫ్ సిండ్రోం లక్షణాలు. కుటుంబం కోసం తమ బాధలను తొక్కిపెట్టేస్తుంటారు. దీంతో వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ ఆనందాల్ని వదులుకోకుండానే మంచిభార్యగా ఉండొచ్చు. భాగస్వామి బాధ్యతగా ఉంటే భార్యకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

News May 8, 2025

ప్రయాణికుడిపై దాడి.. రైల్వే సిబ్బందిపై వేటు

image

రైళ్లలో అధిక ధరలకు ఫుడ్ అమ్ముతున్నారని కంప్లైంట్ చేసిన వ్యక్తిపై క్యాటరింగ్ సిబ్బంది <<16346283>>దాడి<<>> చేసిన ఘటనలో రైల్వే శాఖ చర్యలకు దిగింది. ప్రయాణికుడిపై దాడికి దిగిన సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా వారి క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

News May 8, 2025

రోహిత్ రిటెర్మెంట్‌పై కపిల్ దేవ్ రియాక్షన్

image

టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఈ ఫార్మాట్‌లో హిట్ మ్యాన్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చెప్పారు. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదని, రోహిత్ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు కెప్టెన్‌గా రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే అయినా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కాగా కొత్త కెప్టెన్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

News May 8, 2025

మిస్ వరల్డ్ పోటీలకు నగరం సిద్ధం

image

TG: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది. 72వ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు 109 దేశాల నుంచి కంటెస్టెంట్స్ నగరానికి చేరుకున్నారు. రేపటిలోగా అందరూ చేరుకునే అవకాశముంది. ఈ పోటీల్లో నందిని గుప్తా(భారత్), అథెన్నా క్రాస్బీ(అమెరికా), ఎమ్మా మోరిసన్(కెనడా) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ నెల 31న హైటెక్స్‌లో ఫినాలే జరగనుంది.