News April 7, 2025

టారిఫ్స్.. బ్యూటిఫుల్ థింగ్: ట్రంప్

image

టారిఫ్స్ నిర్ణయం US భవిష్యత్తుకు ఎంతో కీలకమన్న విషయం ఏదో ఒకరోజు ప్రజలు తెలుసుకుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన నిర్ణయాలపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఇలా స్పందించారు. ‘చైనా, ఈయూ సహా ఎన్నో దేశాలతో మనకు ఆర్థిక లోటు ఉంది. టారిఫ్స్ విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇదొక బ్యూటిఫుల్ థింగ్. ఈ నిర్ణయంతో $బిలియన్ల ఆదాయం వస్తుంది. జో బైడెన్ మిగిల్చిన లోటును అతిత్వరలో పూడ్చుతాం’ అని పేర్కొన్నారు.

News April 7, 2025

నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

image

AP: బకాయిలు చెల్లిస్తేనే NTR వైద్య సేవ పథకం సేవలను కొనసాగిస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రూ.3,500 కోట్లు బకాయిలు ఉండటంతో ఆర్థిక భారం పెరిగిందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన బకాయిల కంటే నెట్‌వర్క్ ఆసుపత్రులు అందించిన వైద్య సేవల విలువ ఎక్కువని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి సేవలను కొనసాగించలేమని తాజా లేఖలో పేర్కొంది.

News April 7, 2025

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్ టెస్ట్‌లకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే JEE మెయిన్ రెండో సెషన్ పూర్తికావొచ్చింది. TGEAPCET(చివరి తేదీ APR 9), APEAPCET(లాస్ట్ డేట్ APR 24) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వీటితో పాటు బిట్స్, విట్టీ, SRM, సిట్టీ వంటి ప్రైవేటు సంస్థలు దేశవ్యాప్తంగా టెస్ట్స్ నిర్వహిస్తున్నాయి. వీటిపైనా ఓ లుక్కేయండి.

News April 7, 2025

CTలో చోటు దక్కకపోవడం నిరాశపరిచింది: సిరాజ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో తనకు చోటు దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయానని GT పేసర్ మహ్మద్ సిరాజ్ చెప్పారు. ‘టీమ్ ఇండియా తరఫున కంటిన్యూగా ఆడుతుండగా ఒక్కసారిగా డ్రాప్ చేయడంపై ఎన్నో డౌట్స్ వస్తాయి. అందుకే నా బలహీనతలపై దృష్టి పెట్టాను. ఫిట్‌నెస్, ఆటను మెరుగుపర్చుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ ముందు రాణించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. నిన్న 4 వికెట్లతో సిరాజ్ SRHను దెబ్బతీశారు.

News April 7, 2025

అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు

image

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఎండలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

News April 7, 2025

ఆరు రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం

image

TG: రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్‌లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఈ ఆరు రోజుల్లోనే 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. పలు చోట్ల రవాణా, సాంకేతిక సమస్యలతో పంపిణీ నెమ్మదిగా సాగుతున్నా ఈ నెల 15వరకు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.

News April 7, 2025

VIRAL: జీనియస్‌ డైరెక్టర్‌తో యంగ్ టైగర్

image

యంగ్ టైగర్ NTR, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ తాజాగా మీట్ అయ్యారు. ఈ సందర్భంగా వారు హగ్ చేసుకున్న ఫొటోను సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘తారక్‌కి ప్రేమతో’ అన్న క్యాప్షన్ ఇచ్చారు. రీపోస్ట్ చేసిన NTR, ‘నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్’ అని రాసుకొచ్చారు. దీంతో వీరి కాంబోలో మరో మూవీ రాబోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీకి వీరు కలిసి పనిచేశారు.

News April 7, 2025

ఎకరానికి రూ.2 కోట్ల డిమాండ్.. కష్టంగా ఎయిర్‌పోర్టు భూసేకరణ!

image

TG: వరంగల్‌ జిల్లా మూమునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడి భూముల రేట్లు అమాంతం పెరిగాయి. ప్రభుత్వం రూ.40 లక్షలు ఇస్తామంటుండగా స్థానిక రైతులు ఎకరానికి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 253 ఎకరాల భూమికోసం ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించింది. కాగా.. ఎయిర్‌పోర్టు రాకతో కొత్త పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.

News April 7, 2025

ఆస్పత్రిలో SRH ప్లేయర్

image

నిన్న GTతో మ్యాచులో SRH హర్షల్ పటేల్‌ను తీసుకుంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో పేసర్ ఉనద్కత్‌ను జట్టులోకి తీసుకున్నారు. నిన్న స్లో పిచ్‌పై హర్షల్ కీ బౌలర్ అయ్యేవారని, ఆయన లేకపోవడం SRHను దెబ్బతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News April 7, 2025

నేడు భద్రాచలం శ్రీరాముడి మహాపట్టాభిషేకం

image

TG: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉ.10.30 గం. నుంచి మ.12.30 వరకు కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవం ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, చక్రాలు, కిరీటం, శంఖు ధరింపజేస్తారు. ఏటా శ్రీరామనవమి తర్వాత నిర్వహించే ఈ వేడుకకు ఈసారి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.