News April 7, 2025

ALERT: ఆ జిల్లాల వారు జాగ్రత్త!

image

AP: రాష్ట్రంలో భానుడు భగభగలు పుట్టిస్తున్నాడు. ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల మార్కును దాటింది. ఈరోజు రాయలసీమ ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు, ఉత్తరాంధ్రలో 41డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ఎండలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

News April 7, 2025

రేపు అహ్మదాబాద్‌కు సీఎం రేవంత్

image

TG: గుజరాత్‌లో రేపు, ఎల్లుండి జరిగే ఏఐసీసీ సమావేశాలకోసం సీఎం రేవంత్ రేపు అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, పలువురు కీలక నేతలు ఈరోజు సాయంత్రమే బయలుదేరనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44మంది నేతలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చకు వస్తాయని సమాచారం.

News April 7, 2025

రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

image

AP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రాత్రి అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తవుతాయి. రాత్రి 8గంటలకు రథోత్సవం, 9.30గంటలకు స్వామి కళ్యాణ మహాత్సవం జరుగుతాయి.

News April 7, 2025

అఖిల్ నెక్స్ట్ మూవీ.. రేపు గ్లింప్స్?

image

అక్కినేని అఖిల్ ఎట్టకేలకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్’ వచ్చి రెండేళ్లైనా ఆయన మరే ప్రాజెక్టునూ అనౌన్స్ చేయని సంగతి తెలిసిందే. తాజాగా ఫ్యాన్స్‌కు అఖిల్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాతోనైనా అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.

News April 7, 2025

నేటి నుంచి ‘అడవితల్లి బాట’.. ప్రారంభించనున్న పవన్

image

AP: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సర్కారు ‘అడవితల్లి బాట’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రారంభించనున్నారు. అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. గిరిజన గ్రామాల అనుసంధానం, రోడ్ల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధిపై ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.

News April 7, 2025

GOOD NEWS: రెండున్నరవేల ఖాళీలు భర్తీ

image

TG: వర్సిటీల్లో ఉద్యోగాల కోసం 15ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న రెండున్నరవేలకుపైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్‌ను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

News April 7, 2025

ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడేనా?

image

TG: ఈ నెల 24 లేదా 25న ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 10వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి, ఆ తర్వాతి 2 రోజుల పాటు మార్కుల ఎంట్రీ, మార్కుల జాబితాల ముద్రణ పూర్తి చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్ సెట్‌కంటే ముందే ఫలితాల్ని వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

News April 7, 2025

అబుదాబిలో ఘనంగా రామనవమి వేడుకలు

image

అబుదాబీలోని బాప్స్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నవమి వేడుకలతో పాటు స్వామి నారాయణ జయంతి సందర్బాన్ని ఆలయ నిర్వాహకులు అద్భుతంగా జరిపించారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న భక్తులు వందలాదిగా కార్యక్రమానికి తరలివచ్చారని వారు తెలిపారు. రామ భజనలతో జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, హైందవ విలువలకు, శాంతి-ఐక్యతకు కార్యక్రమం ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

News April 7, 2025

‘ఇండియన్ ఐడల్’ విజేత మానసి ఘోష్.. ప్రైజ్ మనీ ఎంతంటే..

image

‘ఇండియన్ ఐడల్’ 15వ సీజన్లో బెంగాల్‌కు చెందిన మానసి ఘోష్ విజేతగా నిలిచారు. ట్రోఫీతో పాటు ఆమె సరికొత్త కారును, రూ.25 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ఫినాలేలో ఆమె శుభజిత్ చక్రవర్తి, స్నేహా శంకర్‌తో పోటీ పడ్డారు. శుభజిత్ రన్నరప్‌గా, స్నేహ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కాగా స్నేహకు ఫినాలేకు ముందుగానే టీ-సిరీస్ అధినేత రికార్డింగ్ కాంట్రాక్ట్ ఇవ్వడం విశేషం.

News April 7, 2025

రజినీ ‘కూలీ’కి అంత డిమాండా?

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాకు టాలీవుడ్‌లో భారీ డిమాండ్ నెలకొంది. ఏకంగా ఆరుగురు నిర్మాతలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. దీంతో సినిమా నిర్మాతలు రూ.40 కోట్ల వరకూ రేట్ చెబుతున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ‘రజినీ’ సినిమా కావడం, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి వారు కీలక పాత్రలు చేయడం మూవీకి ఈ స్థాయిలో క్రేజ్‌ను తీసుకొచ్చిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.