News April 7, 2025

TODAY HEADLINES

image

✒ తమిళనాట పాంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన PM
✒ CPM ప్రధాన కార్యదర్శిగా MA బేబీ
✒ భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం
✒ ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. కేంద్రానికి CBN లేఖ
✒ వృద్ధి రేటులో APకి రెండో స్థానం: CM
✒ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు: సంధ్యారాణి
✒ రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన రేవంత్
✒ HCU రక్షణకు చేతులు కలపండి: KTR
✒ మంత్రులను AICC నిర్ణయించడమేంటి?: సంజయ్

News April 7, 2025

ఆ నలుగురితో మళ్లీ ఆడాలనుకుంటున్నా: ధోనీ

image

మళ్లీ అవకాశం వస్తే సెహ్వాగ్, సచిన్, గంగూలీ, యువరాజ్‌లతో కలిసి ఆడాలనుకుంటున్నట్లు ధోని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లు ఆడుతున్నప్పుడు చాలా అందంగా ఉంటుందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2007 T20WCలో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో యువరాజ్ ఆరు సిక్సర్లపై ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని, ఇండియన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

News April 7, 2025

ప్రధాని వ్యాఖ్యలకు చిదంబరం కౌంటర్

image

తమిళనాడుకు UPA ప్రభుత్వం కంటే అధిక నిధులిచ్చామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ఎకానమీ, మ్యాట్రిక్స్ గతంతో పోల్చితే ఎప్పుడూ అధికంగానే ఉంటాయని, ఈ విషయం ఫస్టియర్ ఎకానమీ, స్టూడెంట్‌ను అడిగినా చెబుతారన్నారు. ప్రతి ఏడాది జీడీపీ పెరిగినట్లే బడ్జెట్ పెరుగుతుందన్నారు. మీ వయసు గత సంవత్సరంతో పోలిస్తే ఒక ఏడాది పెరుగుతుంది కదా అని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

News April 7, 2025

BREAKING: గుజరాత్ ఘన విజయం

image

IPL2025: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన SRH 152/8 స్కోర్ చేయగా, GT 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సుదర్శన్ 5, గిల్ 61*, బట్లర్ 0, సుందర్ 49, రూథర్‌ఫర్డ్ 35* పరుగులు చేశారు. షమీ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు. అన్ని విభాగాల్లోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.

News April 7, 2025

ALERT.. రేపు, ఎల్లుండి వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు 10 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అటు రానున్న మూడ్రోజుల తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.

News April 6, 2025

కంచ భూములు కాపాడాలని విద్యార్థుల విజ్ఞప్తి

image

TG: గచ్చిబౌలి కంచ భూములను కాపాడాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను గచ్చిబౌలిలో కలిసి విద్యార్థి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. భూముల కోసం తాము నిరసనలు చేపట్టిన సందర్భంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. భూములను పరిశీలించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చేలా చొరవ చూపాలని మీనాక్షికి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై మాట్లాడి చెప్తానని విద్యార్థి నేతలకు ఆమె హామీ ఇచ్చారు.

News April 6, 2025

అగ్నివీర్‌లకు ప్రత్యేక రిజర్వేషన్లు

image

అగ్నివీర్‌లకు పోలీసు ఉద్యోగాల్లో 20శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ తెలిపారు. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వారికి ప్రత్యేక సబ్సిడీలు అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో అగ్నివీర్‌లకు రాష్ట్ర నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా హరియాణా నిలిచింది.

News April 6, 2025

సూర్య తిలకం.. PHOTO OF THE DAY

image

యూపీ అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఆలయ గర్భగుడిలో బాల రాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ వీక్షించి భక్తులు పరవశించిపోయారు. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది PHOTO OF THE DAY అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి శ్రీరామ నవమి రోజున రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడేలా బెంగళూరు IIA, CBRI సైంటిస్టులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News April 6, 2025

పశ్చిమ బెంగాల్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం

image

పశ్చిమ బెంగాల్ సిలిగుడిలో మత సామరస్యం వెల్లివిరిసింది. శ్రీరామ నవమి శోభాయాత్ర చేస్తున్న భక్తులను ముస్లిం యూత్ పూలు చల్లుతూ ఆహ్వానించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి వాటర్ బాటిల్స్ అందజేశారు. భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సిలిగుడిలో అన్ని మతాల వారు సోదర భావంతో నివసిస్తారని, మత వివక్ష ఉండదని భక్తులు తెలిపారు.

News April 6, 2025

ఘోరం: భార్య పెట్టే టార్చర్ భరించలేక..

image

భార్య వేధింపులు తాళలేక మరో భర్త తనువు చాలించాడు. వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో జరిగింది. రామచంద్ర బర్జెనాకు రెండేళ్ల కింద రూపాలితో వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె సంతానం. పెళ్లి నాటి నుంచి భార్య మానసికంగా వేధిస్తోందంటూ ఓ వీడియో రికార్డ్ చేసి అతను సూసైడ్ చేసుకున్నాడు. రామచంద్ర తల్లి ఫిర్యాదుతో రూపాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.