News April 6, 2025

కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

image

AP: అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. ‘ఈ సుంకాల నుంచి ఆక్వాకు మినహాయింపు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. రాష్ట్ర GDPలో మత్స్యరంగానిది కీలక పాత్ర. అమెరికా భారత్‌పై 27% సుంకం విధించింది. ఈక్వెడార్‌పై USA 10% సుంకమే విధించింది. ఇది మనకూ నష్టమే. ఏపీలో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. USAతో చర్చించండి’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.

News April 6, 2025

ఎల్లుండి ఓదెల-2 ట్రైలర్

image

తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఓదెల-2’ ట్రైలర్‌ను ఈ నెల 8న మ.3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ముంబైలోని ఐకానిక్ ఐమాక్స్ థియేటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా, సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News April 6, 2025

సన్న బియ్యం దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు?: మహేశ్ గౌడ్

image

తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వానివేనని BJP నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ‘BJP దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రమంత్రి బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి, సొంత పార్టీలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల కోసం కొందరు HCUపై మాట్లాడటం సరికాదు. మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.

News April 6, 2025

కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు

image

తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై కేసు నమోదవడంతో MAA ఆమెను సస్పెండ్ చేసింది. తర్వాత టెస్టుల్లో నెగటివ్ రిపోర్టు రావడంతో సస్పెన్షన్‌ను ఎత్తేసింది. ఇదే విషయంపై కళ్యాణి, హేమకు గతంలో చాలాసార్లు <<13300086>>వాగ్వాదాలు<<>> జరిగిన విషయం తెలిసిందే.

News April 6, 2025

APలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం

image

AP వ్యాప్తంగా క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం(07-04-25) రాయలసీమలో 40-42°C, ఉత్తరాంధ్రలో 39-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.

News April 6, 2025

గ్రేట్..అన్నదాతల కోసం 131రోజుల నిరాహార దీక్ష

image

పంటలకు సరైన మద్దతు ధర ఇవ్వాలని 131 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన రైతు కేంద్రమంత్రుల హామీతో నేడు దీక్ష విరమించారు. పంజాబ్‌కు చెందిన జగజీత్ సింగ్ దల్లేవాల్ రైతుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ గతేడాది నవంబర్ 26న దీక్ష చేపట్టారు. అతని ఆరోగ్యం విషమించడంతో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, రైల్వేశాఖ సహాయ మంత్రి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతు దీక్ష విరమించారు.

News April 6, 2025

భూసేకరణ వేగవంతం చేయండి.. సీఎంకు కేంద్రమంత్రి లేఖ

image

తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలని CM రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ‘ప్రస్తుతం TGలో ₹12,619Crతో 691KM పొడవైన రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందుకు 1,550హెక్టార్ల భూమి అవసరం కాగా 904హెక్టార్లనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. మిగతా భూమిని త్వరగా సేకరిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడి అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.

News April 6, 2025

IDBIలో 119 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

image

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లోని పలు విభాగాల్లో 119 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ చేసిన వారు అర్హులు. SC/STలు రూ.250, మిగతా వారు రూ.1,050 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://www.idbibank.in/<<>>

News April 6, 2025

విదేశీ పర్యటనకు బయలుదేరిన రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. పోర్చుగల్, స్లోవేకియా దేశాల అధ్యక్షుల ఆహ్వనం మేరకు రాష్ట్రపతి ఆ దేశాలకు వెళ్లనున్నారు. 7,8న పోర్చుగల్‌లో 9,10 తేదీలలో స్లోవేకియాలో ఆమె పర్యటించనున్నారు. ఈ దేశాలలో భారత రాష్ట్రపతి పర్యటించడం దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

News April 6, 2025

BREAKING: టాస్ గెలిచిన GT

image

IPL2025: ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో GT కెప్టెన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
GT: సాయి సుదర్శన్, గిల్, బట్లర్, తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సుందర్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్
SRH: హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసెన్, అనికేత్, కమిందు, కమిన్స్, అన్సారీ, ఉనద్కత్, షమీ