India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 192 అప్రెంటిస్ ఖాళీలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 20-25 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.12వేలు స్టైఫండ్ అందుతుంది.
వెబ్‌సైట్: <
భారత్‌పై అమెరికా సుంకాలు విధించడం సరైనదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రష్యాతో డీల్ కొనసాగిస్తున్న దేశంపై టారిఫ్స్ విధించడం మంచి ఐడియానే’ అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ ముగింపునకు ఇతర దేశాలతో కలిసి కృషి చేస్తున్న భారత్‌పై జెలెన్‌స్కీ తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఆయనతో పలుమార్లు ఫోన్‌లో <<17582171>>మాట్లాడిన<<>> విషయం తెలిసిందే.
రెస్టారెంట్ ధరలు, ఫుడ్ డెలివరీ యాప్ ధరలకు భారీ వ్యత్యాసం ఉండటంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ వ్యక్తి తన ఇంటికి దగ్గర్లోని రెస్టారెంట్ నుంచి స్విగ్గీలో ఆహారాన్ని బుక్ చేయాలనుకున్నాడు. అందులో రూ.1,473 ఛార్జ్ చేయడం చూసి అతడే స్వయంగా రెస్టారెంట్‌కు వెళ్లి రూ.810కే తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని Xలో లేవనెత్తడంతో తామూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నామని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. మీకూ ఇలానే జరిగిందా?
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రకటించనున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనీశ్ గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని విమర్శించింది. అధికారిక మీటింగ్‌లో సీఎం పక్క ఛైర్‌లో ఆమె భర్త కూర్చున్న ఫొటోను Xలో షేర్ చేసింది. ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది.
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,08,380కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.99,350 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 తగ్గి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
AP: విశాఖలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై CP శంఖబ్రత బాగ్చీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే పూర్తి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. మద్యం మత్తులో యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఇద్దరు పారా మిలిటరీ జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ, J&K పోలీసులు, శ్రీనగర్ CRPF దళం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
NDA భాగస్వామ్య పార్టీల ఎంపీలతో ప్రధాని మోదీ ఈ మధ్యాహ్నం 3గంటలకు సమావేశం కానున్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆ విషయంపై ప్రధాని వారితో చర్చించనున్నారు. అలాగే, కాసేపట్లో టీడీపీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు టీడీపీ ఎంపీలతో నారా లోకేశ్ భేటీ జరగనుంది.
స్టాక్ మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 80,904 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు వృద్ధి చెంది 24,802 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, ఎటర్నల్, రిలయన్స్, HDFC, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, BEL, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, L&T, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.