News April 5, 2025

ఉమ్మడి జిల్లాల నేతలతో KCR సమావేశం

image

TG: ఇటీవల పలు జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న BRS చీఫ్ కేసీఆర్ తాజాగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నిర్వహణలపై వారితో చర్చిస్తున్నారు. సభ నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలను తరలించడం సహా పలు అంశాలపై నేతలతో మాజీ సీఎం సమాలోచనలు చేస్తున్నారు.

News April 5, 2025

అశ్లీల వీడియోలు చూసి షేర్ చేస్తున్నారా?

image

అశ్లీల వీడియోలను చూడటం, షేర్ చేయడం నేరమని TG పోలీసులు హెచ్చరించారు. యువత పోర్నోగ్రఫీకి దూరంగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ చూడొద్దని సూచించారు. సోషల్ మీడియాను మంచికోసం వాడుకోవాలని, అశ్లీల వీడియోలను పోస్ట్ & షేర్ చేసేవారిపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు బాలల అశ్లీల సన్నివేశాలను పంపినందుకు అరెస్ట్ అయినట్లు తెలిపారు.

News April 5, 2025

అల్లు అర్జున్ సినిమాలో క్రేజీ హీరోయిన్?

image

‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ లేదా అట్లీ దర్శకత్వంలో ఆయన నటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. AAతో అట్లీ తెరకెక్కించే సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తారని సినీ వర్గాల్లో టాక్. ఇప్పటికే ఈ బ్యూటీ SSMB29లో నటిస్తున్నారు. ఈ క్రమంలో AA సినిమాలోనూ నటిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

News April 5, 2025

కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించండి: బండి సంజయ్

image

TG: TTD ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. 2023 మే 31న 10 ఎకరాల విస్తీర్ణంలో భూమి పూజ చేసినప్పటికీ పనులు జరగలేదని తెలిపారు. ఆలయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

News April 5, 2025

సన్నబియ్యం తీసుకుందాం పద మావా!

image

TG: రేషన్ దుకాణాల్లో ఫ్రీగా సన్నబియ్యం పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడంతో వాటిని తీసుకోకుండా రూ.10కి అమ్ముకునేవాళ్లమని చెబుతున్నారు. మార్కెట్లో సన్నబియ్యం ధర కనీసం రూ.50 ఉండటంతో ఇప్పుడు రేషన్ షాపుల్లో తీసుకుని వండుకుంటున్నామని తెలిపారు. ఎప్పుడూ రేషన్ దుకాణాలకు రానివారు సైతం ఇప్పుడు వస్తున్నారని చెప్పారు. మీరూ సన్నబియ్యం తీసుకుంటున్నారా? ఈ పథకంపై మీ కామెంట్?

News April 5, 2025

ఏడుగురి ప్రాణాలు తీసిన ఫేక్ డాక్టర్!

image

మధ్యప్రదేశ్ దామోహ్‌లో ఓ ఫేక్ డాక్టర్ ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాడు. నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లతో ప్రముఖ బ్రిటీష్ కార్డియాలజిస్ట్ అయిన N.జాన్ కెమ్ పేరు చెప్పుకుని ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో చేరాడు. కొంతమంది రోగులకు హార్ట్ ఆపరేషన్లు చేయగా అందులో ఏడుగురు కొన్ని రోజులకు మరణించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని పలువురు చెబుతున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

News April 5, 2025

భార్యను చంపాడని జైలు శిక్ష.. రెండేళ్ల తర్వాత ట్విస్ట్!

image

తప్పిపోయిన భార్యను హత్య చేశాడనే ఆరోపణతో ఓ భర్త రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కర్ణాటకలోని కొడగుకి చెందిన సురేశ్ 2021లో తన భార్య మల్లిగే కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది తర్వాత పక్క ఊరిలో అస్థిపంజరం కనిపించడంతో అనుమానించి భర్తను అరెస్ట్ చేశారు. ఇటీవల మల్లిగే ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో సురేశ్ నిర్దోషిగా బయటకువచ్చాడు. అమాయకుడిని జైల్లో పెట్టారంటూ పోలీసులపై కోర్టు ఫైర్ అయింది.

News April 5, 2025

ముంబైకి పొలార్డ్ లాంటి ప్లేయర్ ఇక దొరకడా?

image

IPLలో 5 టైమ్స్ ఛాంపియన్ ముంబై ప్రస్తుతం స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతోంది. పొలార్డ్ లాంటి ఫినిషర్ లేకపోవడమూ దీనికి కారణమని ఫ్యాన్స్ అంటున్నారు. 2012 నుంచి 2021 వరకు ఎన్నో మ్యాచుల్లో MIకి ఆయన విజయాలు అందించారు. టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఫామ్ కోల్పోయి రిటైర్ అయ్యారు. ఆ తర్వాతి నుంచి MIకి సరైన ఫినిషర్ దొరకట్లేదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. దీనిపై మీరేమంటారు?

News April 5, 2025

కొత్త ఆలోచనలతోనే రాష్ట్ర అభివృద్ధి: CBN

image

AP: ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. NTR జిల్లా ముప్పాళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి రోజుల్లో సెల్‌ఫోన్ అందరికీ అత్యవసర వస్తువుగా మారిందని, అనేక సేవలతో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.

News April 5, 2025

లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

image

TG: కేంద్రం చేపట్టిన ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ నేపథ్యంలో మరోసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 86 మంది ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో 20 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారు. లొంగి పోయిన మావోయిస్టులకు ఐజీ నజరానాను అందజేశారు. కాగా దేశంలో ఈ ఏడాది చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో 300 మందికి‌పైగా మావోయిస్టులు మరణించారు.