India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముంబైతో జరిగిన మ్యాచులో ఎల్ఎస్‌జీ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ అద్భుత ప్రదర్శన చేశారు. 4 ఓవర్లు బౌలింగ్ వేసి 1 వికెట్ తీసుకుని 21 పరుగులే ఇచ్చారు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆయన దక్కించుకున్నారు. కాగా ముంబై స్కోర్ బోర్డ్ పరుగులు పెడుతున్న సమయంలో దూకుడుగా ఆడుతున్న నమన్ ధీర్ (46)ను దిగ్వేశ్ క్లీన్ బౌల్డ్ చేశారు. దీంతో ముంబై ఇన్నింగ్స్ దూకుడుకు కళ్లెం పడి విజయం అందుకోలేకపోయింది.
AP: ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో ఎండలు కాస్తాయని తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి నెలకొంటుందని పేర్కొంది. TGలోని ఉమ్మడి MBNR, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యం. కానీ అందరూ వర్కౌట్లు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. సర్జరీలు చేయించుకున్నవారు వర్కౌట్లు చేస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ కావచ్చు. ఎముకలు, కండరాల నొప్పులు ఉన్నవారు చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారూ వీటికి దూరంగా ఉంటే మంచిది. గుండె సమస్యలు ఉన్నవారు వ్యాయామం చేస్తే ప్రెజర్ పెరిగి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.
ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా సీఎస్కే-డీసీ తలపడనున్నాయి. ఈ మ్యాచుకు రుతురాజ్ గైర్హాజరీలో సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ వ్యవహరించే ఛాన్స్ ఉంది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ ఢీకొననున్నాయి. వరుస విజయాలతో పంజాబ్ జోరు మీద ఉండగా, వరుస ఓటములతో రాజస్థాన్ డీలా పడింది. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
AP: వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం చరిత్రాత్మకమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ బిల్లుతో దేశంలోని పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతోంది. ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూనే సభలో చర్చ జరిపిన తీరు అందరికీ ఆదర్శం. ఈ బిల్లు ఆమోదంతో ముస్లింల హక్కులకు భద్రత లభించినట్లే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
AP: CM చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు(M) ముప్పాళ్లలో జరిగే బాబు జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో CM మాట్లాడతారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
మోకాలి గాయం కారణంగా రోహిత్ శర్మ ఈరోజు మ్యాచ్ ఆడట్లేదని టాస్ సమయంలో హార్దిక్ చెప్పారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రోహిత్‌ను ముంబై డ్రాప్ చేసిందంటూ చర్చ నడుస్తోంది. ‘డ్రాప్డ్’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. జట్టుకు ఐదు కప్‌లు అందించిన ఆటగాడిని డ్రాప్ చేయడమేంటంటూ రోహిత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తుండగా.. ఫామ్‌లో లేని రోహిత్‌ను డ్రాప్ చేసినా తప్పేంలేదంటూ ముంబై జట్టు ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
ఐపీఎల్‌లో ముంబైతో విజయం అనంతరం LSG ఓనర్ సంజీవ్ గోయెంకా చిరునవ్వులు చిందించారు. కెప్టెన్ రిషభ్ పంత్, సిబ్బందితో కలిసి ఆయన స్టేడియంలో సంతోషంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు ఎన్నాళ్లకెన్నాళ్లకు గోయెంకా నవ్వారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఎల్ఎస్‌జీని రెండు వరుస ఓటములు పలకరించడంతో రిషభ్ పంత్‌పై గోయెంకా సీరియస్ అయిన విషయం తెలిసిందే.
సికిందర్ మూవీలో నటించిన సల్మాన్ ఖాన్, రష్మిక మధ్య 31 ఏళ్ల <<15866268>>ఏజ్ గ్యాప్‌పై<<>> జరుగుతున్న ట్రోల్స్‌పై హీరోయిన్ అమీషా పటేల్ స్పందించారు. సినిమాల్లో నటుల మధ్య వయసు వ్యత్యాసం సాధారణ విషయమన్నారు. గదర్ చిత్రంలో తనకు, సన్నీ డియోల్‌కు మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉందని చెప్పారు. తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో మూవీ సూపర్ హిట్టయ్యిందన్నారు. ఏదిఏమైనా సల్మాన్ లవ్లీ మ్యాన్ అని పేర్కొన్నారు.
TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయించాయి. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ రసవత్తరంగా జరగనుంది. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్‌రావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గతంగా ఎవరికి మద్దతు ఇస్తాయనేదానిపైనా ఆసక్తి నెలకొంది. కాగా ఈనెల 23న పోలింగ్ జరగనుండగా 112 మంది ఓటు వేయనున్నారు.
Sorry, no posts matched your criteria.