News April 4, 2025

AI వినియోగం.. భవిష్యత్‌పై బిల్‌గేట్స్ జోస్యం!

image

ఏఐ రాక నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాలెలా ఉంటాయన్నదానిపై బిల్ గేట్స్ పలు ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. అవి:
* వారానికి రెండు రోజులే పని ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఏఐ పనిచేస్తుంది.
* దాదాపు ఉద్యోగాలన్నీ ఏఐ చేతిలోకి వెళ్లిపోతాయి.
* ఏఐ వలన అన్ని రంగాల్లో మేథ అందరికీ ఉచితంగా లభిస్తుంది.
* కోడింగ్, బయాలజీ, ఇంధన రంగాల్లోకి మాత్రం ఏఐ రాలేదు.

News April 4, 2025

హసీనాను అప్పగించమన్నారు: విక్రమ్ మిస్రీ

image

మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ప్రధాని మోదీ- బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భారత్‌లోకి అక్రమ చొరబాట్లను అడ్డుకునే విషయాలు మహ్మద్ యూనస్‌తో చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

News April 4, 2025

BIG ALERT: పిడుగులతో కూడిన భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో 3 రోజులపాటు విభిన్న వాతావరణం కొనసాగుతుందని APSDMA వెల్లడించింది. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి కాకినాడలో మోస్తరు వానలు, సోమవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంది. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News April 4, 2025

అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న అన్నామలై?

image

తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాను మరోసారి అధ్యక్ష పదవి రేసులో ఉండనని స్పష్టం చేయడంతో ఏ క్షణంలోనైనా అన్నామలై రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీలో ఎంతోమంది గొప్ప నేతలు ఉన్నారని, వారి నుంచే కొత్త నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఆయన తెలిపారు.

News April 4, 2025

విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ

image

TG: పాల సేకరణ ధరల్లో విజయ డెయిరీ సవరణ చేసింది. 7% వెన్న ఉన్న గేదె పాల ధరను లీటర్‌కు రూ.56 నుంచి రూ.59.50కు, 10% వెన్న ఉంటే రూ.80 నుంచి రూ.84.60కి పెంచింది. 3% వెన్న ఉన్న ఆవు పాల ధర ఇప్పటి వరకు లీటర్‌కు రూ.40 ఉండగా రూ.36.50కు తగ్గించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. గేదె పాలు విక్రయించే రైతులకు లబ్ధి చేకూరనుండగా, ఆవు పాలు అమ్మే వారికి కాస్త నష్టం కలగనుంది.

News April 4, 2025

38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

image

AP: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకం కొనసాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, ఇవాళ మరో 38 కమిటీలకు ప్రభుత్వం నియామకాలు చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని టీడీపీ వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలున్నాయి.

News April 4, 2025

బ్లడ్‌బాత్.. రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి

image

అమెరికా సుంకాల వేళ భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోవడంతో సుమారు రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ONGC, హిందాల్కో, సిప్లా షేర్లు అత్యధికంగా 6శాతం చొప్పున నష్టపోయాయి. టారిఫ్ దెబ్బకు ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల షేర్లు కుదేలయ్యాయి.

News April 4, 2025

MIకి గుడ్‌న్యూస్.. త్వరలోనే బుమ్రా ఆగమనం?

image

ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వెన్నెముక గాయంతో BGT సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో ఆయన దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రికవరీలోనే ఉన్న ఈ పేసర్ తిరిగి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి రానున్నారని తెలిపాయి. ఈలోపు తుది దశ ఫిట్‌నెస్ టెస్టుల్లో పాల్గొంటారని సమాచారం.

News April 4, 2025

బీజేపీ అధ్యక్ష రేసులో లేను: అన్నామలై

image

TN BJP అధ్యక్ష రేసులో తాను లేనని ఆ పార్టీ ప్రస్తుత చీఫ్ అన్నామలై స్పష్టం చేశారు. ‘పార్టీలో ఎంతోమంది గొప్ప నేతలున్నారు. వారి నుంచే నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇక.. వచ్చే ఏడాది ఎన్నికల్లో BJP ఒంటరిగా బరిలోకి దిగాలని అన్నామలై యోచిస్తుండగా ఆ పార్టీ AIADMKతో పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అధ్యక్ష బరినుంచి తప్పుకున్నారన్న చర్చ నడుస్తోంది.

News April 4, 2025

బియ్యపు గింజ కంటే చిన్నదైన పేస్‌మేకర్

image

ప్రపంచంలోనే అతి చిన్నదైన పేస్‌మేకర్‌ను నార్త్‌వెస్ట్రన్ వర్సిటీ(US) సైంటిస్టులు రూపొందించారు. ఇది 1.8mm వెడల్పు, 3.5mm పొడవుతో ఒక బియ్యపు గింజ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఇది అన్ని సైజుల గుండెలకు పనిచేస్తుంది. అయితే గుండె జబ్బులతో జన్మించిన పిల్లలకు బాగా సూటవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్ట్ ఆపరేషన్ల సమయంలో టెంపరరీ పేస్‌మేకర్ కీలక పాత్ర పోషిస్తుందని, సైజ్ కూడా కీలకమేనని పేర్కొంటున్నారు.