News September 8, 2025

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

image

రేపు జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు NDA, INDI కూటమి సిద్ధమవుతున్నాయి. ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో విపక్ష ఎంపీలకు ఇండి కూటమి మాక్ పోలింగ్ నిర్వహించనుంది. దీనికి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. అటు AP మంత్రి నారా లోకేశ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతుగా తమ TDP ఎంపీలతో సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నికకు BRS దూరంగా ఉండే అవకాశం ఉంది.

News September 8, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

image

TG: స్టీల్, సిమెంట్‌పై GST 28% నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది. ఇంటి నిర్మాణానికి 180 సంచుల సిమెంట్ అవసరం కాగా సంచి ధర రూ.330-370గా ఉంది. GST తగ్గడం ద్వారా సంచిపై రూ.30 చొప్పున రూ.5,500 ఆదా అయ్యే అవకాశం ఉంది. అటు 1500 కిలోల స్టీల్ అవసరం పడుతుండగా కేజీ రూ.70-85 వరకు పలుకుతోంది. కేజీపై రూ.5 తగ్గినా రూ.7,500 ఆదా కానుంది. మొత్తం రూ.13వేల వరకు తగ్గనుంది.

News September 8, 2025

రష్యాపై మరిన్ని సుంకాలు: ట్రంప్

image

రష్యాపై మరిన్ని సుంకాలు విధిస్తామని US అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ‘రష్యాపై సెకండ్ ఫేస్ టారిఫ్స్‌కు సిద్ధంగా ఉన్నారా?’ అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నేను రేడీగా ఉన్నాను’ అని ఆయన సమాధానమిచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వంటి దేశాలపై మరిన్ని సుంకాలు విధించాలని US ట్రెజరీ సెక్రటరీ<<17644290>> బెసెంట్<<>> కూడా అన్నారు.

News September 8, 2025

జ్వరమని వెళ్తే.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి!

image

TG: కరీంనగర్‌లో దారుణం వెలుగు చూసింది. జగిత్యాల జిల్లాకు చెందిన యువతి జ్వరమొచ్చిందని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు సమాచారం. ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆమె నిద్రపోతున్నప్పుడు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 8, 2025

శరవేగంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు

image

AP: గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇంటిగ్రేటేడ్ టెర్మినల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 6 ఎయిరో బ్రిడ్జిలు, ILBHS(inline Bagage handling system), ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ప్రత్యేకంగా నిలవనున్నాయి. అరైవల్, డిపార్చర్ ప్యాసింజర్ల కోసం వేర్వేరుగా ఎయిరోబ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తున్నారు. ILBHS వల్ల లగేజ్ వెంటనే స్కాన్ చేసుకోవచ్చు. నూతన టెర్మినల్ పనులు 70% పూర్తి కాగా, సంక్రాంతి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది.

News September 8, 2025

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి మరో షాక్!

image

స్విగ్గీ, జొమాటో <<17604591>>ఇప్పటికే<<>> డెలివరీ ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేసేవారిపై మరింత భారం పడనుంది. జీఎస్టీ వల్ల జొమాటో కస్టమర్ల నుంచి ఆర్డరుకు రూ.2, స్విగ్గీ కొనుగోలుదార్ల నుంచి రూ.2.6 చొప్పున అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది.

News September 8, 2025

గ్రహణం మళ్లీ ఎప్పుడంటే?

image

నిన్న రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం <<17644262>>కనువిందు<<>> చేసింది. అయితే రెండు వారాల తర్వాత మరో గ్రహణం ఏర్పడనుంది. ఈనెల 21న(ఆదివారం) సూర్యగ్రహణం సంభవిస్తుంది. రాత్రి 11 గంటల నుంచి 22వ తేదీ తెల్లవారుజామున 3.23 గంటల వరకు ఇది కొనసాగుతుంది. కానీ దీని ప్రభావం మన దేశంలో అంతగా ఉండదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.

News September 8, 2025

బీసీలే టార్గెట్‌గా కవిత, మల్లన్న పార్టీలు?

image

TG: రాష్ట్రంలో BC కాన్సెప్ట్‌తో 2 కొత్త పార్టీలు ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ నెల 17న పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని ప్రకటించి జెండా, ఎజెండా‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి వీరిద్దరూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

News September 8, 2025

4 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు!

image

AP: ఉపాధి హామీ శ్రామికుల వేతన బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,668కోట్లు విడుదల చేసింది. 4రోజుల్లోగా శ్రామికుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నిధులతో మే 15 – ఆగస్టు 15 వరకు చెల్లించాల్సిన బకాయిలు తీరిపోతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మిగిలిన చెల్లింపుల కోసం దాదాపు రూ.140 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. బకాయిల చెల్లించాలని కేంద్రానికి రాష్ట్ర అధికారులు లేఖలు రాయగా నిధులు విడుదల చేసింది.

News September 8, 2025

చంద్రుడు ఎందుకు ఎరుపెక్కుతాడు?

image

సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అర్ధరాత్రి చంద్రగ్రహణం <<17644262>>సందర్భంగా<<>> చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారాడు. దీన్నే ‘బ్లడ్ మూన్’ అంటారు. భూమి అడ్డుకోగా మిగిలిన సూర్యకిరణాలు వాతావరణం గుండా ప్రసరించి చంద్రుడిని చేరుతాయి. సప్తవర్ణాల్లోని నీలిరంగు తేలిపోగా ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే చందమామపై పడతాయి. దీంతో చంద్రుడు ఎరుపెక్కుతాడు.