News April 3, 2025

ప్రభుత్వంపై సుప్రీం ప్రశ్నల వర్షం

image

TG: కంచ భూముల్లో చెట్ల నరికివేతపై స్టే <<15980464>>విధిస్తూ <<>>సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చెట్ల కొట్టివేతను సుమోటోగా చేపట్టాం. హైకోర్టు రిజిస్ట్రార్ స్పాట్‌కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో చెట్లు ఎందుకు తొలగించారు? 100 ఎకరాలు ధ్వంసం చేసినట్లు నివేదిక వచ్చింది. ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టారు? అనుమతులు తీసుకున్నారా?’ అని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 16లోగా నివేదిక ఇవ్వాలని GOVTను ఆదేశించింది.

News April 3, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా NTR

image

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ రేపు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నట్లు ప్రకటించారు. తారక్ తన సినిమాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలియజేస్తూ నిర్మాత నాగవంశీ Xలో స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.

News April 3, 2025

కంచ భూములపై ఫేక్ వీడియోలు.. BRS IT సెల్ ఇంచార్జిలపై కేసు

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె భూములను ప్రభుత్వం చదును చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడి పరిస్థితులను తప్పుదోవ పట్టించేలా కొన్ని ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈక్రమంలో గచ్చిబౌలి పోలీసులు ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారనే ఆరోపణలపై BRS IT సెల్ ఇంచార్జ్‌లు క్రిశాంక్ & కొణతం దిలీప్‌లపై కేసు నమోదు చేశారు.

News April 3, 2025

HCU కంచ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

image

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చెట్లు నరికివేయొద్దని, భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికపై విచారణ సందర్భంగా SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని మీరు ఎలా చేతుల్లోకి తీసుకుంటారు’ అని CSపై ఆగ్రహిస్తూ ప్రతివాదిగా చేర్చింది.

News April 3, 2025

నష్టాలతో ముగిసిన మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. US అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంకోచించారు. సెన్సెక్స్ 322 నష్టంతో 76,295 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 23,250 వద్ద ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడవగా, TCS, టెక్ మహీంద్ర, HCL, ఇన్ఫోసిస్, ONGC షేర్లు నష్టాల్లో ముగిశాయి.

News April 3, 2025

‘HIT-3’ సినిమా క్లైమాక్స్‌లో కార్తీ?

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేశ్ కొలను తెరకెక్కిస్తోన్న ‘HIT-3’కి సంబంధించిన క్రేజీ న్యూస్ SMలో చక్కర్లు కొడుతోంది. HIT, HIT-2 క్లైమాక్స్‌లో కొత్త హీరోను పరిచయం చేస్తూ సీక్వల్స్‌పై భారీ అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. HIT-3లోనూ మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ క్లైమాక్స్‌లో కనిపిస్తారని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News April 3, 2025

మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: మల్‌రెడ్డి

image

TG: క్యాబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో AICC అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో HYD-రంగారెడ్డి జిల్లాల నుంచి చాలామంది మంత్రులు ఉండేవారని, తనకు పదవి ఇవ్వడం ద్వారా RR జిల్లాకు పదవి దక్కినట్లు అవుతుందన్నారు. తనకు ఇవ్వకపోయినా జిల్లాలో ఏదో ఒక సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

News April 3, 2025

ఆ ఫొటోగ్రాఫర్‌ను పట్టిస్తే రూ.10 లక్షలిస్తాం: కాంగ్రెస్ నేత

image

HCU భూములను జేసీబీలు చదును చేస్తుంటే అక్కడే ఉన్న జింకలు, నెమళ్లు పరుగులు తీసిన ఫొటోను సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే, ఇది ఏఐ ఎడిటెడ్ ఫొటో అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఇంత గొప్ప ఫొటోను తీసిన వ్యక్తిని గుర్తించి తమకు పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డ్ ఇస్తామని సెటైరికల్ ట్వీట్ చేశారు.

News April 3, 2025

3వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

image

భారీ భూకంపం ధాటికి మయన్మార్‌లో మృతుల సంఖ్య 3,085కు చేరినట్లు సైనిక ప్రభుత్వం వెల్లడించింది. 4,715 మంది గాయపడ్డారని, 341 మంది గల్లంతయ్యారని తెలిపింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం మృతుల సంఖ్య ప్రభుత్వం చెప్పినదానికంటే చాలా అధికంగా ఉంటుందని సమాచారం. భూకంప విధ్వంసం కారణంగా 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస నివేదిక పేర్కొంది.

News April 3, 2025

ట్రంప్ టారిఫ్‌లు, చైనా ఆక్రమణలపై ఏం చెప్తారు?: రాహుల్

image

భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల అంశాన్ని LOP రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు. ‘ఈ టారిఫ్‌లపై కేంద్రం స్పందించాలి. ఈ సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అటు భారత్‌కు చెందిన 4వేల చ.కి.మీపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అక్కడి రాయబారి ద్వారా ఈ విషయం తెలిసిందని సంచలన ఆరోపణలు చేశారు.