News April 3, 2025

2026 T20WC వరకు టైట్ షెడ్యూల్

image

ఐపీఎల్ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానున్నారు. 2026 T20 WC వరకు టైట్ షెడ్యూల్ ఖరారైంది. జూన్-జులైలో ENGతో 5 టెస్టులు, SEPలో ఆసియా కప్, OCTలో వెస్టిండీస్‌తో 2 టెస్టులు, OCT-NOVలో AUSతో 3 ODI & 5 T20I, NOV-DECలో SAతో 2 Test, 3 ODI & 5 T20I, JANలో NZతో 3 ODI & 5 T20I, FEB-MARలో T20 వరల్డ్ కప్ ఆడనున్నారు.

News April 3, 2025

సంచలనం.. 25000 టీచర్ల పోస్టులు రద్దు

image

పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2016లో జరిగిన 25 వేల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. ఆ తీర్పును SC సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవంది. 3 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టును ఆశ్రయించారు.

News April 3, 2025

కంచ భూముల వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

image

TG: హెచ్‌సీయూ కంచ భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం విక్రయించాలన్న భూములను సందర్శించి మ.3.30 గంటలకు నివేదిక అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరకవద్దని సీఎస్‌ను SC ఆదేశించింది.

News April 3, 2025

నా వయసును నమ్మలేకపోతున్నాను: రష్మిక

image

ఈ నెల 5న 29వ పుట్టినరోజు చేసుకోనున్నట్లు హీరోయిన్ రష్మిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 29 ఏళ్లనే విషయం తనకే నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. ఇది తన బర్త్ డే మంత్ అని పేర్కొంటూ వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజును జరుపుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘సికందర్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.

News April 3, 2025

SRHకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం

image

HCAతో SRHకు వివాదం నెలకొన్న వేళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) సన్‌రైజర్స్ జట్టును APకి ఆహ్వానించింది. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లను విశాఖలో నిర్వహించాలని కోరింది. పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని ఆఫర్ చేసింది. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో SRH, HCA మధ్య వివాదం నెలకొనగా సీఎం రేవంత్ ఆదేశాలతో HCA దిగొచ్చింది. మరోవైపు ఈ సీజన్‌లో విశాఖలో 2 IPL మ్యాచ్‌లు జరిగిన విషయం తెలిసిందే.

News April 3, 2025

ట్రంప్ టారిఫ్‌లు ఎదురుదెబ్బ కాదు: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

image

భారతదేశ దిగుమతులపై అమెరికా 26% టారిఫ్ విధించడాన్ని తాము ఎదురుదెబ్బగా భావించట్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది మిశ్రమ ఫలితమే అని తేల్చి చెప్పాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య సమస్యలను పరిష్కరిస్తే ఈ టారిఫ్‌లు తగ్గే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ మేరకు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని వివరించాయి. మరోవైపు, మన దేశ ఫార్మా ఉత్పత్తులకు టారిఫ్ నుంచి ట్రంప్ మినహాయింపు ఇచ్చారు.

News April 3, 2025

ఎమ్మెల్సీగా ప్రమాణం.. పవన్ కళ్యాణ్‌ను కలిసిన నాగబాబు

image

AP: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన నేత నాగబాబు విజయవాడలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. నాగబాబుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. నిన్న నాగబాబు సీఎం చంద్రబాబు, తన సోదరుడు చిరంజీవితో భేటీ అయ్యారు.

News April 3, 2025

ట్రంప్ టారిఫ్స్‌పై ప్రపంచ దేశాధినేతల కామెంట్స్

image

యూఎస్ చీఫ్ ట్రంప్ టారిఫ్స్‌పై ప్రపంచ నేతలు పెదవి విరుస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌పై 20% టారిఫ్ విధించడాన్ని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తప్పు పట్టారు. మరోవైపు ట్రంప్ టారిఫ్ అన్యాయంగా ఉందని ఆస్ట్రేలియా పీఎం అల్బనీస్ వ్యాఖ్యానించారు. యూఎస్ బాస్ నిర్ణయంతో ఏ ఒక్కరికి ప్రయోజనం లేదని ఐర్లాండ్ ప్రధాని మార్టిన్ అన్నారు. ట్రంప్‌కు దీటుగా బదులిస్తామని చైనా ప్రభుత్వం హెచ్చరించింది.

News April 3, 2025

బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!

image

బంగారం ధరలు ఇవాళ కూడా పెరగడంతో ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.85,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 పెరగడంతో రూ.93,380 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,900గా ఉంది. గత తొమ్మిది రోజుల్లో గోల్డ్ రేటు రూ.4090 పెరగడం గమనార్హం.

News April 3, 2025

ఢిల్లీ చెత్త రికార్డును సమం చేసిన ఆర్సీబీ

image

నిన్నటి మ్యాచులో గుజరాత్ చేతిలో పరాజయంతో ఆర్సీబీ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఒకే వేదికపై అత్యధిక మ్యాచులు ఓడిన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ చెత్త రికార్డును సమం చేసింది. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు 92 మ్యాచులు ఆడిన RCB 44 మ్యాచుల్లో ఓడింది. కాగా DC ఢిల్లీలో 82 మ్యాచులు ఆడి 44 మ్యాచుల్లో ఓడటం గమనార్హం.