India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇవాళ పాక్ చేసిన మిస్సైల్స్ దాడిని మన <<16347393>>S-400<<>> సుదర్శన్ చక్ర క్షిపణి వ్యవస్థ అడ్డుకున్న విషయం తెలిసిందే. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే.. 360 డిగ్రీల సర్వైలెన్స్‌తో 600 కి.మీ.దూరంలోని 300 లక్ష్యాలను ట్రాక్ చేసి దాడులను నిర్వీర్యం చేస్తుంది. అలాగే, ఒకేసారి 36 లక్ష్యాలపై మిస్సైల్స్‌ను సంధించగలిగే శక్తి ఉంది. S-400 స్క్వాడ్రన్లలో ఒకటి J&K- పంజాబ్‌ను, మరొకటి గుజరాత్-రాజస్థాన్‌ను కవర్ చేస్తున్నాయి.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో ‘డ్రాగన్’ మూవీ భామ కయాదు లోహర్ నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన డ్రాగన్ మూవీలో కయాదు పేరు మార్మోగింది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది.
AP: రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలకు క్యాచీగా ఉండే పేర్లు పెట్టాలని క్యాబినెట్ సమావేశంలో సూచించారు. మరోవైపు ఉగ్రమూకలపై దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరు బాగుందని మంత్రి వర్గం అభిప్రాయపడినట్లు సమాచారం.
భారత విదేశాంగ శాఖ ఈ సాయంత్రం గం.5:30కి ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఆపరేషన్ సిందూర్, పాక్ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో MEA సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
– ఈ ప్రెస్‌మీట్ లైవ్ వే2న్యూస్‌లో చూడవచ్చు.
APలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని CM చంద్రబాబు చెప్పారు. తిరుపతి(D) శ్రీసిటీలో ₹5,800 కోట్ల పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. దీనిద్వారా 2,500కు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ(SIPC) కింద ఈ ప్రాజెక్ట్ 100% ప్రోత్సాహకాలు పొందనుందని ట్వీట్ చేశారు. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ఇదొక కొత్త అధ్యాయమని పేర్కొన్నారు.
చాలామంది అమ్మాయిలకు పీరియడ్స్, ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ వస్తాయి. అయితే ఇవి పోషకలోపానికి సంకేతాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, డీహైడ్రేషన్, హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల తీపి పదార్థాలవైపు మనసు మళ్లుతుంది. ఇలాంటప్పుడు మూల కారణాలు గుర్తించి సరిదిద్దాలి. ఒకవేళ క్రేవింగ్స్ వస్తే డార్క్ చాక్లెట్, స్వీట్ కార్న్, డ్రై ఫ్రూట్స్ వంటివి తింటే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
✒ చెరువుల్లో తవ్విన మట్టిని ఉచితంగా పొలాలకు తీసుకెళ్లేందుకు రైతులకు అనుమతి
✒ ఏటా పంట కాల్వలకు మరమ్మతులు చేయాలని నిర్ణయం
✒ టీటీడీలో అర్బన్ డిజైన్ ప్లానింగ్ సెల్ ఏర్పాటు
✒ జలవనరుల శాఖలో కంపెనీల చట్టం కింద జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
✒ పర్యాటక ప్రాజెక్టుల్లో ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదం
ఉగ్రస్థావరాలపై భారత్ దాడులను సమర్థిస్తూ పలు దేశాలు తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి యూరోపియన్ యూనియన్ చేరింది. ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. చట్టబద్ధంగా పౌరులను రక్షించడం బాధ్యత అని వెల్లడించింది. పాక్, భారత్ మధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. యూరోపియన్ యూనియన్ ఐరోపాలోని 27 సభ్య దేశాల సమూహం.
భారత్ చేస్తున్న దాడులను నేరుగా ఎదుర్కోవడం చేతకాక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తోంది పాకిస్థాన్. తాజాగా భారత సైనిక కాలనీలపై పాక్ దాడి చేసిందంటూ ఓ పాత వీడియోను కొందరు పోస్టులు చేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఇండోనేషియాకు చెందినదని, ఇప్పటిది కాదని ‘PIB FACTCHECK’ వెల్లడించింది. దీంతో మనల్ని ఎదుర్కోలేక ఇలాంటి చిల్లర పనులు చేస్తోందంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు.
2022లో విడుదలైన లాల్ సింగ్ చడ్డా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆమిర్ ఖాన్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆ సినిమాకు భారీ నష్టాలు రావడంతో ఈ హీరో తన పారితోషికం తీసుకోలేదట. సినిమా నష్టంలో తాను భాగం పంచుకోవాలని ఇలా చేశాడట. అయితే తన వ్యక్తిగత నిర్ణయాన్ని సాకుగా చూపి ఇతర సినిమాలకు ఇలా చేయకూడదని ఆమిర్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.