India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చర్మసంరక్షణలో సన్‌స్క్రీన్‌ది కీలకపాత్ర. వేసవిలో ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. ఇది చర్మానికి రక్షణను ఇచ్చి ట్యానింగ్, వృద్ధాప్యఛాయలు రాకుండా చూస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఉండేవారు 2 గంటలకొకసారి సన్‌స్క్రీన్ రాసుకోవాలి. వేసవిలో వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ వాడాలి. ప్రస్తుతం ఇంట్లో వాడే వివిధ రకాల లైట్ల వల్ల కూడా చర్మానికి హాని కలుగుతోంది. కాబట్టి ఇంట్లో ఉన్నా సన్‌స్క్రీన్ వాడటం మంచిది.
నటి సమంత డైరెక్టర్ రాజ్ నిడిమూరుతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సమంత ఇన్‌స్టా పోస్ట్ ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. తను నిర్మించిన ‘శుభం’ రేపు రిలీజవుతున్న నేపథ్యంలో రాజ్‌తో ఉన్న పిక్స్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు ‘లాంగ్ జర్నీ తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాం. న్యూ బిగినింగ్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సమంత తన లవ్ రిలేషన్‌ను అఫీషియల్ చేశారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఉదయం పాకిస్థాన్ <<16347211>>ఎయిర్ డిఫెన్స్ రాడార్లపై<<>> భారత్ అటాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్‌కు వాడినట్లు భావిస్తోన్న HAROP డ్రోన్లను భారత్ ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకొంది. ఇవి లక్ష్యాలని గుర్తించడానికే కాకుండా మిసైల్స్ గానూ పనిచేయగలవు. ఆటోమేటిక్ ఆపరేట్ సిస్టమ్ వీటి సొంతం. వాటి సామర్థ్య పరిధి 1000KM. కాగా వీటిని వాడినట్లు భారత్ అధికారికంగా ప్రకటించలేదు.
భారత్‌తో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ఆ దేశ క్రికెటర్లను రావల్పిండి నుంచి తిరిగి రావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) జరుగుతోంది. భారత్, పాక్ సరిహద్దులో రావల్పిండి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లాహోర్, ముల్తాన్, కరాచీ, రావల్పిండి వేదికల్లో PSL మ్యాచులు జరుగుతున్నాయి.
గాయంతో దూరమైన సందీప్ శర్మ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ మరో ప్లేయర్‌ను రీప్లేస్ చేసింది. దక్షిణాఫ్రికా పేసర్ బర్జర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. గత సీజన్‌లోనూ RR తరఫున ఆడిన బర్జర్ 6 మ్యాచుల్లో 7 వికెట్లు తీశారు. కాగా సందీప్ శర్మ వేలి గాయంతో దూరమయ్యారు. మరో ప్లేయర్ నితీశ్ రాణా స్థానంలో SA బ్యాటర్ ప్రిటోరియస్‌ను తీసుకుంది.
జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఆపరేషనల్ హెడ్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం అంతర్జాతీయ సమాజ హితానికై చేసిన చర్యగా భారత ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. 1999లో IC 814 హైజాక్ సూత్రధారి రౌఫ్ ఆ తర్వాత భారత్ సహా ప్రపంచంపై పలు దాడులకు తెగబడ్డాడు. Wall Street Journal (USA) జర్నలిస్టు డేనియల్ పర్ల్ కిడ్నాప్, హత్య ఇందులో ఒకటి. నాడు ప్రపంచమే దిగ్భ్రాంతి చెందిన ఈ దారుణానికి సిందూర్‌తో నేడు న్యాయం జరిగిందని ఆర్మీ చెబుతోంది.
AP: తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలే ప్రసక్తే లేదని YCP అధినేత జగన్ మరోసారి తేల్చి చెప్పారు. ‘ఎవరినీ వదిలిపెట్టం, సినిమా చూపిస్తాం. తప్పు చేసిన అధికారుల పేర్లను రాసి పెట్టుకోండి. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తాం. చంద్రబాబు విలువలు లేని పాలిటిక్స్ చేస్తున్నారు. రాజకీయాలే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారు’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.
భారత్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోందని, తాము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రసంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. ‘ఎన్నో దశాబ్దాలుగా ముస్లింలు, ఇస్లాంపై భారత్ దాడులు చేస్తోంది. ఉపఖండంలోని ముస్లింలందరూ చేతులు కలిపి ఈ ‘జిహాద్’లో పాల్గొనాలి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మనపై సైనిక, రాజకీయ, సాంస్కృతిక దాడి చేస్తోంది. అల్లా సాయంతో భారత్‌పై పోరాటం చేస్తాం. ప్రతీకారం తీర్చుకుంటాం’ అని పేర్కొంది.
పాకిస్థాన్, POKలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పేరు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఈ పాపులారిటీని ఉపయోగించుకునేందుకు వ్యాపార సంస్థలతో పాటు సినీ నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ‘ఆపరేషన్ సింధూర్’ టైటిల్ కోసం 10కిపైగా ప్రొడక్షన్ హౌజ్‌లు పోటీ పడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వీటిలో టీ-సిరీస్, జీ స్టూడియోస్ వంటి బడా నిర్మాణ సంస్థలు ఉన్నట్లు పేర్కొన్నాయి.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంలో మహేంద్ర సింగ్ ధోనీని ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సైలెంట్‌గా సాయంత్రం సమయంలో SM ద్వారా వీడ్కోలు పలికారు. అయితే, ధోనీ 2020లో ఏ క్షణాన రిటైర్మెంట్ ప్రకటించారో సరిగ్గా నిన్న అదే సమయానికి(19:29 IST) రోహిత్ కూడా తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికారు. ఈ ఇద్దరూ సొంత గడ్డపై వాంఖడే మైదానంలో, విదేశీ గడ్డపై మెల్బోర్న్‌లో తమ చివరి టెస్ట్ ఆడారు.
Sorry, no posts matched your criteria.