News April 2, 2025

మగవారితో పోలిస్తే అతివల్లో ఎక్కువ నిద్రలేమి

image

ఆరోగ్యానికి చక్కటి నిద్ర అత్యవసరం. కానీ పురుషులతో పోలిస్తే మహిళల్లో నిద్రలేమి ఎక్కువ ఉందని USకు చెందిన ‘రెస్‌మెడ్’ సంస్థ అధ్యయనంలో తేలింది. దాని ప్రకారం.. వారంలో పురుషులు సగటున 4.13 రాత్రుళ్లు హాయిగా నిద్రపోతుంటే స్త్రీలు 3.83 రాత్రుళ్లు మాత్రమే సరైన నిద్రపోతున్నారు. హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళనల వంటి కారణాలు స్త్రీల నిద్రని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

News April 2, 2025

HCU భూముల వివాదంపై సెలబ్రిటీల స్పందన

image

హెచ్‌సీయూ భూముల వివాదంపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇషా రెబ్బా, రేణూ దేశాయ్, ప్రియదర్శి, ఉపాసన కొణిదెల, కావ్య కళ్యాణ్‌రామ్, రష్మీ గౌతమ్, అభినవ్ గోమఠం, నోయెల్ షాన్, ప్రియాంక జవాల్కర్ తమ ఇన్‌స్టాల్లో హెచ్‌సీయూ భూముల్ని, అక్కడి ప్రాణుల్ని కాపాడాలనే అర్థంలో స్టోరీలు పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

News April 2, 2025

BREAKING: పంజాబ్ ఘన విజయం

image

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో ఛేదించింది. ప్రభుసిమ్రన్ సింగ్ 69, శ్రేయస్ అయ్యర్ 52*, వధేరా 43* రన్స్ చేశారు. లక్నో బౌలర్ దిగ్వేశ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు LSG బ్యాటర్లలో పూరన్ 44, బదోనీ 41, మార్‌క్రమ్ 28, సమద్ 27, మిల్లర్ 19 రన్స్ చేశారు. అర్ష్‌దీప్ 3, ఫెర్గూసన్, మ్యాక్స్‌వెల్, మార్కో, చాహల్ తలో వికెట్ తీశారు.

News April 2, 2025

రేపట్నుంచి RTC ఉద్యోగుల నిరసనలు

image

AP: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ RTC ఉద్యోగులు నిరసనలకు పిలుపునిచ్చారు. రేపు, ఎల్లుండి ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. సస్పెన్షన్లు, తొలగింపు లేకుండా 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, వెంటనే పదోన్నతులు చేపట్టాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారానే కొనాలని, నైట్‌అవుట్ అలవెన్స్ ₹150 నుంచి ₹400 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

News April 1, 2025

రతన్ టాటా వీలునామా.. వెలుగులోకి మరో విషయం

image

గత ఏడాది కన్నుమూసిన రతన్ టాటాకు దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటిలో అత్యధిక భాగం ఆయన ఛారిటీకి కేటాయించినట్లు ఓ కథనం వెల్లడించింది. దాదాపు రూ.3,800cr సంపదను రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, ట్రస్ట్‌కు కేటాయిస్తూ వీలునామా రాసినట్లు సమాచారం. అలాగే తన సవతి సోదరీమణులకు ₹800cr, సన్నిహితుడు మొహిన్ ఎం దత్తాకు ₹800cr, ఇతర కుటుంబ సభ్యులకూ ఆస్తులను రాశారు. తన శునకాల సంరక్షణకూ నిధులను కేటాయించారు.

News April 1, 2025

వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు

image

కేంద్ర ప్రభుత్వం రేపు లోక్‌సభ ముందుకు తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. విద్యావంతులు, నిపుణులతో చర్చించి ఈ బిల్లును రూపొందించారన్నారు. ఇది ముస్లింలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.

News April 1, 2025

HCU భూములు కాపాడాలని కేంద్రమంత్రికి వినతి

image

HCUకి చెందిన 400 ఎకరాల భూమిని కాపాడాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను రాష్ట్ర BJP MPలు కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మేరకు వినతిపత్రం అందించారు. పచ్చని చెట్లు, దట్టమైన అడవితో ఉన్న భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు. జింకలు, నెమళ్లు, అరుదైన నక్షత్ర తాబేళ్లు, సరీసృపాలకు ప్రాణాధార చెరువులు ఉన్న ఈ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

News April 1, 2025

పంత్ ఫ్లాప్ షో.. రూ.27 కోట్లు.. 17 రన్స్

image

IPL హిస్టరీలోనే అత్యధిక వేతనం(రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. 3 మ్యాచ్‌లలో 17 రన్స్(DCపై 0, SRHపై 15, PBKSపై 2) మాత్రమే చేశారు. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీపర్‌, కెప్టెన్‌గానూ ఆకట్టుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇతనొక ఓవర్ రేటెడ్ ప్లేయర్ అని ఫైరవుతున్నారు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా పుంజుకోవాలని కోరుకుంటున్నారు.

News April 1, 2025

టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

image

APలో టెన్త్ పరీక్షలు ముగిశాయి. మార్చి 17న తెలుగు పరీక్షతో ప్రారంభమైన పరీక్షలు ఇవాళ సోషల్ స్టడీస్‌తో ముగిశాయి. 6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.17 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత పలు దఫాల పరిశీలన అనంతరం మే రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.

News April 1, 2025

మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళా క్రికెటర్ల జంట

image

ENG మహిళా క్రికెటర్లు నాట్ స్కివర్ బ్రంట్, క్యాథరిన్ స్కివర్ బ్రంట్ మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు థియోడోర్ మైకేల్ స్కివర్ బ్రంట్ అని పేరు పెట్టినట్లు నాట్ ఇన్‌స్టాలో వెల్లడించారు. నాట్, క్యాథరిన్ 2022లో వివాహం చేసుకున్నారు. తమ చివరి పేరును స్కివర్ బ్రంట్‌గా మార్చుకున్నారు. వీరు రెసిప్రోకల్ IVF విధానంలో పేరెంట్స్ అయినట్లు తెలుస్తోంది. నాట్ WPLలో MIకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.