News April 1, 2025

BIG BREAKING: కొత్త రేషన్‌కార్డులపై శుభవార్త

image

AP: మే నెల నుంచి ATM కార్డు సైజులో కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. QR కోడ్, ఇతర భద్రతా ఫీచర్లతో కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక ఎంతమందికి రేషన్‌కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే కొత్త కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.

News April 1, 2025

కాకాణికి చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన హైకోర్టు

image

AP: వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి ఆయనకు ఉపశమనం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. తనపై పోలీసులు <<15956367>>అక్రమ కేసులు<<>> నమోదు చేస్తున్నారని, కేసులు క్వాష్ చేయాలని, బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

News April 1, 2025

HCU భూముల వ్యవహారం: ప్రజాసంఘాలతో భట్టి సమావేశం

image

హెచ్‌సీయూకు సంబంధించి భూముల వ్యవహారంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రజాసంఘాల నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ సూచన మేరకు భూకేటాయింపులకు సంబంధించిన వివరాలను వారికి ఆయన అందజేశారు. అదే విధంగా రద్దు, చదును ప్రక్రియల గురించి వివరించారు. అంతకు ముందు భూముల వివాదంపై సీఎం మంత్రులతో భేటీ అయి చర్చించారు.

News April 1, 2025

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

image

కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే మార్కెట్ ఒడిదుడుకులతో మొదలైంది. ట్రంప్ సుంకాల గడువు రేపటితో ముగియనుండటంతో ఆ భయాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయి 76,024 వద్ద ముగియగా నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయి 23,165 వద్ద క్లోజ్ అయింది. మీడియా, చమురు, గ్యాస్ స్టాక్స్ తప్పితే దాదాపు మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.

News April 1, 2025

అమెరికాలో అత్యధిక పెట్స్ ఏవంటే?

image

అమెరికన్లు పెంపుడు జంతువులను అమితంగా ప్రేమిస్తుంటారు. ఒక్కొక్కరి దగ్గర నాలుగైదు రకాల పెట్స్ కూడా ఉంటుంటాయి. అయితే, అత్యధికంగా కుక్కలను పెంచుకునేందుకు వారు మొగ్గుచూపుతున్నట్లు అమెరికన్ పెట్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ తెలిపింది. USలో 65 మిలియన్ల పెట్ డాగ్స్ ఉండగా 47M పిల్లులున్నాయి. ఫ్రెష్ వాటర్ ఫిష్‌లు 11M, చిన్న జంతువులు 7M, పక్షులు 6M, రెప్టైల్స్ 6M, సాల్ట్ వాటర్ ఫిష్ – 2M, గుర్రాలు 2M ఉన్నాయి.

News April 1, 2025

A+ కాంట్రాక్టులోనే విరాట్, రోహిత్?

image

విరాట్, రోహిత్‌ను A+ గ్రేడ్‌లోనే కొనసాగించాలని BCCI భావిస్తున్నట్లు సమాచారం. మూడు ఫార్మాట్లలోనూ ఆడే క్రికెటర్లకే బీసీసీఐ A+ గ్రేడ్‌ను కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి గ్రేడ్‌ను తగ్గించొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, భారత క్రికెట్‌కు వారందించిన సేవల దృష్ట్యా అగ్రస్థాయి కాంట్రాక్ట్‌లోనే కొనసాగించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News April 1, 2025

పెరిగిన ఔషధాల ధరలు

image

దాదాపు 900 రకాల ఔషధాల ధరలను ఇవాళ్టి నుంచి గరిష్ఠంగా 1.74% మేర పెంచినట్లు NPPA వెల్లడించింది. ఇందులో యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గుండె జబ్బులు, షుగర్‌ మెడిసిన్స్ ఉన్నాయి. సవరించిన ధరల ప్రకారం అజిత్రోమైసిస్ 250Mg ఒక్కో టాబ్లెట్ రేటు ₹11.87, 500Mg ధర ₹23.97కు చేరింది. డైక్లోఫెనాక్ ₹2.09, ఇబ్రూఫెన్ 200Mg ₹0.72, 400Mg ₹1.22గా పేర్కొంది. పూర్తి లిస్టును https://www.nppaindia.nic.in/లో చూడొచ్చు.

News April 1, 2025

ఐపీఎల్‌లో ధోనీ స్థాయి వేరు: గేల్

image

ఎంఎస్ ధోనీని మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రశంసలతో ముంచెత్తారు. ‘ధోనీ, సీఎస్కే భారత్‌లో ఎక్కడ ఆడినా ఆ స్టేడియం పసుపుతో నిండిపోతుంది. ఐపీఎల్‌లో ధోనీ రేంజ్ అలాంటిది. ఆయన ఏ స్థానంలో ఆడారన్నది ఎవరికీ అక్కర్లేదు. 11వ స్థానంలో వచ్చినా ఆయన ఆట చూస్తే చాలు అని ఫ్యాన్స్ భావిస్తుంటారు’ అని పేర్కొన్నారు. ధోనీ ఈ సీజన్లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

News April 1, 2025

జియో బంపర్ ఆఫర్

image

IPL మ్యాచులను ఇంట్లోనే టీవీల్లో 4Kలో ఉచితంగా వీక్షించే సదుపాయాన్ని జియో అందించింది. జియో ఓల్డ్ & న్యూ కస్టమర్లు రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్‌తో 4Kలో TV/ మొబైల్‌లో 90 రోజులు ఉచితంగా జియో హాట్‌స్టార్ చూడొచ్చు. అలాగే 50 రోజులు ఉచిత jio fiber కనెక్షన్ పొందొచ్చు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 15 వరకు రీచార్జ్ చేసిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మిగిలిన వారు RS.100తో యాడ్ ఆన్ ప్యాక్ రీచార్జ్ చేసుకోవాలి.

News April 1, 2025

‘తల్లికి వందనం’ పథకంపై కీలక ప్రకటన

image

AP: తల్లికి వందనం పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 లోపు ఆ పథకం కింద రూ.15వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. పిల్లలను ఇంకా కనాలని, వాళ్లకూ పథకాలు అందుతాయని చెప్పారు. ఇక ప్రతి మహిళకు నగదు, ఉచిత బస్సు పథకాలు అమలు చేయాల్సి ఉందన్నారు. కానీ ఖజానాలో డబ్బులు లేవని, అన్నీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అత్యధిక పెన్షన్లు ఏపీలోనే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.