News April 1, 2025

అసదుద్దీన్‌తో సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు

image

TG: హైదరాబాద్‌లో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయనతోపాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా విందులో పాల్గొన్నారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం’ అని సీఎం పేర్కొన్నారు.

News April 1, 2025

నొప్పి అంటే ఏంటో చూపిస్తా: హూతీలకు ట్రంప్ మాస్ వార్నింగ్

image

తమ దేశానికి చెందిన నౌకలపై దాడులు ఆపాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను హెచ్చరించారు. లేదంటే మీతోపాటు ఇరాన్‌కు కూడా నొప్పి అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ నౌకలపై దాడులు ఆపేవరకూ హూతీలపై దాడులు ఆపమని స్పష్టం చేశారు. ఇరాన్ కూడా హూతీలకు తక్షణమే మద్దతు ఆపాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు 300 సార్లకుపైగా USకు చెందిన నౌకలపై దాడులు చేశారు

News April 1, 2025

IPL: నేడు లక్నోతో పంజాబ్ కింగ్స్‌ ఢీ

image

IPLలో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నోలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆడిన తొలి మ్యాచులోనే పంజాబ్ ఘన విజయం సాధించి జోరు మీద ఉంది. ఈ మ్యాచులో కూడా గెలిచి 2 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది. మరోవైపు లక్నో తొలి మ్యాచులో ఓటమిపాలైనా, రెండో మ్యాచులో SRHపై గెలిచింది. ఇదే జోరులో పంజాబ్‌ను ఓడించాలని యోచిస్తోంది.

News April 1, 2025

నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

News April 1, 2025

పాయింట్ల పట్టికలో అట్టడుగున డిఫెండింగ్ ఛాంపియన్స్

image

ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ నిరాశాజనక పర్ఫార్మెన్స్ చేస్తోంది. ఇప్పటివరకు 3 మ్యాచులాడి రెండింట్లో ఓడింది, ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగున నిలిచింది. మరోవైపు ఆర్సీబీ టాప్‌లోనే కొనసాగుతోంది. ఆ తర్వాత DC, LSG, GT, PBKS, MI, CSK, SRH, RR ఉన్నాయి. కాగా ఇవాళ కేకేఆర్‌పై విజయంతో ముంబై ఆరో స్థానానికి దూసుకెళ్లడం విశేషం.

News April 1, 2025

అంతరిక్షంలో ఉండటమే నాకు ఇష్టం: సునీత విలియమ్స్

image

అంతరిక్షంలో గడిపేందుకు తనకు ఎంతో ఇష్టమని నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. స్పేస్ నుంచి భూమిపై అడుగుపెట్టిన 12 రోజుల అనంతరం సునీతతోపాటు బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం అంతా బాగానే ఉంది. అంతరిక్షంలో ఉన్నంతకాలం ఉత్సాహంగా ఉన్నా. అక్కడ ఎన్నో సైన్స్ పరిశోధనలు చేశా. తిరిగి వచ్చేందుకు కృషి చేసిన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌కు నా కృతజ్ఞతలు’ అంటూ ఆమె పేర్కొన్నారు.

News April 1, 2025

ఈ 3 నెలలు మంటలే.. జాగ్రత్త: IMD

image

ఈ ఏడాది APR-JUNE మధ్య దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు నమోదవుతాయని IMD వెల్లడించింది. AP, TG, UP, WB, TN, MP, రాజస్థాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, కర్ణాటకలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. విద్యుత్ డిమాండ్ 9-10% అధికంగా ఉంటుందని పేర్కొంది. గత ఏడాది మే 30న 250 గిగావాట్ల డిమాండ్ నమోదైన విషయం తెలిసిందే.

News April 1, 2025

నా పిల్లలు ఇండియాలోనే పెరగాలి: అమెరికన్ తల్లి

image

తన పిల్లలు భారతదేశంలో పెరిగితేనే ప్రయోజకులు అవుతారని ఓ అమెరికన్ తల్లి SMలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ ఈ పోస్ట్ పెట్టారు. ‘సంపాదనపరంగా US బెస్ట్ ఏమో కానీ.. సంతోషం మాత్రం భారత్‌లోనే దొరుకుతుంది. ఇక్కడ నివసిస్తే భావోద్వేగాలను హ్యాండిల్ చేయొచ్చు. లోతైన సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. సర్దుకుపోవడం అలవాటు అవుతుంది. కృతజ్ఞతాభావం పెరుగుతుంది’ అంటూ పేర్కొన్నారు.

News April 1, 2025

ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

image

1578: రక్తప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం 1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన
1936: ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
1941: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
2022: తెలుగు చిత్ర దర్శకుడు శరత్ మరణం

News April 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.