News March 31, 2025

KKRకు షాక్.. 25కే 3 వికెట్లు

image

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 25 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. డికాక్ 1, నరైన్ 0, కెప్టెన్ రహానే 11 పరుగులకు ఔటయ్యారు. బౌల్ట్, దీపక్, అశ్వినీ కుమార్ తలో వికెట్ తీశారు.

News March 31, 2025

మయన్మార్‌: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య

image

మయన్మార్‌లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న ఘోర భూకంపంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2056మంది చనిపోయినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. భూకంప తీవ్రతను ప్రపంచానికి చూపించేందుకు అక్కడికి వెళ్లిన అంతర్జాతీయ మీడియా సంస్థల్ని దేశంలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది.

News March 31, 2025

IPL: టాస్ గెలిచిన ముంబై

image

వాంఖడే స్టేడియంలో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నారు. MI తరఫున అశ్వనీ కుమార్ అరంగేట్రం చేస్తున్నారు.
MI: రికెల్టన్, జాక్స్, సూర్య, తిలక్, హార్దిక్, నమన్ ధిర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేశ్
KKR: డీకాక్, అయ్యర్, రహానే, రింకూ, రఘువంశీ, నరైన్, రస్సెల్, రమన్‌దీప్, జాన్సన్, రాణా, వరుణ్ చక్రవర్తి

News March 31, 2025

బుల్లెట్ ప్రూఫ్ బాల్కనీ నుంచి సల్మాన్ ఈద్ విషెస్

image

రంజాన్ సందర్భంగా అభిమానులకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముంబైలోని తన ‘గెలాక్సీ’ హౌస్ బాల్కనీకి వచ్చి అభివాదం చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఉండటంతో సల్మాన్ బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌‌ను అమర్చారు. ఆయన అందులో నుంచే తన సోదరి అర్పిత ఖాన్ పిల్లలు ఆయత్, ఆహిల్‌‌తో ఫ్యాన్స్‌కు కనిపించి విషెస్ చెప్పారు.

News March 31, 2025

రేపటి నుంచి కొత్త రూల్స్

image

✒ స్టాండర్డ్ డిడక్షన్‌ ₹75Kతో కలుపుకుని ₹12.75L వరకు పన్ను మినహాయింపు.
✒ బ్యాంకుల్లో డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమయ్యే వడ్డీ ₹లక్ష వరకు, 60ఏళ్లలోపు వ్యక్తులకు ₹50K వరకు నో TDS.
✒ ఇన్‌యాక్టివ్/వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు UPI సేవలు రద్దు.
✒ UPI లైట్ వ్యాలెట్‌లో డిపాజిట్ చేసిన నగదును బ్యాంక్ అకౌంట్‌కు పంపుకోవచ్చు.
✒ NPS వాత్సల్యలో పెట్టుబడులకు సెక్షన్ 80CCD(1B)కింద పన్ను మినహాయింపు.

News March 31, 2025

రోహిత్ శర్మ చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు: మంజ్రేకర్

image

రోహిత్ శర్మ ప్రస్తుతం క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ క్రికెట్‌కు దూరమయ్యే స్థితిలో ఉన్నారు. రోజూ ఉదయాన్నే చాలా కష్టంగా లేచి ఆరోజు ప్రాక్టీస్‌పై బలవంతంగా దృష్టి పెట్టే తరహాలో కనిపిస్తున్నారు. ఈ తరుణంలో ప్రాక్టీస్‌కు, ఫిట్‌గా ఉండేందుకు మనసు, శరీరం ఒప్పుకోవు. ప్రస్తుతం టాలెంట్‌తో నెట్టుకొస్తున్నారు’ అని వివరించారు.

News March 31, 2025

ఆమె నాలుక ఎంత పొడవో…

image

నాలుకతో ముక్కును అందుకోవడానికే మనం నానాపాట్లు పడుతుంటాం. కానీ ఆ మహిళ నాలుకతో ముఖం మొత్తాన్ని చుట్టేస్తోంది. ఆమే కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదివే చానల్ టాపర్(34). ఈ మహిళ నాలుక పైపెదవి నుంచి కొన వరకు ఏకంగా 3.78 అంగుళాలు(9.75cm) ఉంది. దీంతో ‘లాంగెస్ట్ టంగ్ ఇన్ ది వరల్డ్’గా గిన్నిస్ బుక్‌లో చోటుదక్కించుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో ‘హలోవీన్’ ఫొటో సెషన్ సందర్భంగా తనలోని ఈ లక్షణాన్ని టాపర్ గుర్తించారు.

News March 31, 2025

ధోనీ మ్యాచ్ విన్నర్ కాదు.. ఈ గణాంకాలే నిదర్శనం: విశ్లేషకులు

image

క్రికెట్‌లో ధోనీ బెస్ట్ ఫినిషర్. అతను చివరి వరకు క్రీజులో ఉంటే గెలుపు ఖాయమనే మాటలకు ఇక కాలం చెల్లినట్లే. అతని IPL గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2023 నుంచి ఇప్పటి వరకు ఛేజింగ్ చేస్తూ జట్టు గెలిచిన సందర్భాల్లో అతను 3 మ్యాచ్‌లలో 3 రన్స్(9 బాల్స్) మాత్రమే చేశారు. ఓడిన గేమ్స్‌లో 6 Innsలలో 166 రన్స్(84 బంతులు) చేశారు. దీన్నిబట్టి టీమ్ విజయాల్లో ధోనీ పాత్ర ఏమీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీరేమంటారు?

News March 31, 2025

పాపం మోనాలిసా

image

కుంభమేళాలో పూసలమ్మే మోనాలిసా SM వల్ల పాపులరైంది. ఆమెవి కైపెక్కించే కళ్లు అని, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదంటూ నెటిజన్లు పొగిడారు. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాను తీసే ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’లో పాత్ర ఇస్తానని ప్రకటించడంతో మోనాలిసా ఫేట్ మారిపోయిందని అంతా భావించారు. కానీ అంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలతో సనోజ్‌ అరెస్ట్ అయ్యారు. దీంతో మోనాలిసా సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి.

News March 31, 2025

బలూచిస్థాన్‌లో భూకంపం

image

వరుస భూకంపాలు మానవాళిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. కరాచీలోనూ భూప్రకంపనలు కనిపించాయి. బలూచిస్థాన్‌‌కు 65కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇవాళ మధ్యాహ్నం భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో <<15949405>>భూకంపం<<>> వచ్చిన విషయం తెలిసిందే.