News March 31, 2025

సంచలనం.. ‘మ్యాడ్ స్క్వేర్’ భారీ కలెక్షన్లు

image

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. మ్యాడ్ గ్యాంగ్ చేసే కామెడీకి ప్రేక్షకుల గోలతో థియేటర్లు షేక్ అవుతున్నాయని పేర్కొంది. కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు కీలక పాత్రలు పోషించారు.

News March 31, 2025

హెడ్‌కు స్టార్క్ దెబ్బ

image

SRH స్టార్ బ్యాటర్ హెడ్‌కు స్టార్క్ పీడకలలా మారారు. టాప్ లెవెల్ క్రికెట్లో స్టార్క్.. హెడ్‌ను 8 ఇన్నింగ్సుల్లో 6 సార్లు ఔట్ చేశారు. 34 బంతులు వేసి 18 రన్స్ మాత్రమే ఇచ్చారు. తన భయంతోనే హెడ్ ఫస్ట్ బాల్ స్ట్రైక్ తీసుకోలేదని నిన్న మ్యాచ్ అనంతరం స్టార్క్ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా నిన్న SRHపై స్టార్క్ 5 వికెట్లు పడగొట్టి MOMగా నిలిచారు. గతేడాది క్వాలిఫైయర్-1, ఫైనల్లో స్టార్క్ SRHను దెబ్బకొట్టారు.

News March 31, 2025

‘బేబి’కి రూ.కోటి రెమ్యూనరేషన్?

image

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సరిపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండగా ఆ అవకాశాన్ని ‘బేబీ’ హీరోయిన్ క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు ఆమె పారితోషికం పెంచారని టాక్. ఒక్కో సినిమాకు రూ.కోటి పైనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సిద్ధూతో కలిసి ‘జాక్’లో నటిస్తోండగా ఆనంద్ దేవరకొండతో మరో సినిమాకు ఓకే చెప్పారు.

News March 31, 2025

పాస్టర్ ప్రవీణ్ మృతి.. కొత్త విషయాలు

image

AP: పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారనే మిస్టరీ వీడింది. రామవరప్పాడు రింగ్ రోడ్డుకు 50 మీటర్ల దూరంలో బైక్ ఆపి కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. సా.5.30 నుంచి రా.8.45 వరకు అక్కడే ఉన్నారని తెలిపారు. 200 సీసీ కెమెరాలు పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆయన విజయవాడకు రాకముందే ప్రమాదంలో బైక్ హెడ్ లైట్ దెబ్బతిందని, అయినా రాజమండ్రికి ప్రయాణం కొనసాగించారని గుర్తించారు.

News March 31, 2025

CSK ‘ధోనీ’ని వదులుకోలేక!

image

ధోనీ ఉంటేనే CSK. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోంది. ప్రస్తుతం ధోనీ బ్యాటింగ్ చూస్తే సగటు చెన్నై ఫ్యాన్‌కి అసహనం కలుగుతోంది. బ్యాటింగ్‌లో మేనేజ్మెంట్ ధోనీకి స్వేచ్ఛనివ్వగా యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ రావట్లేదని పలువురు ఫ్యాన్స్ అంటున్నారు. అటు శరీరం సహకరించక MS ఆలస్యంగా బ్యాటింగ్‌కు వస్తున్నారని కోచ్ ఫ్లెమింగ్ చెప్పారు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేక పరిస్థితిని బట్టి క్రీజులోకి వస్తున్నారని తెలిపారు.

News March 31, 2025

శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

image

AP: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కన్పిస్తోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 62,263 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

News March 31, 2025

విశ్వావసులో ముఖ్యమైన పండుగలు

image

*ఏప్రిల్ 6- శ్రీరామనవమి *జులై 6- తొలి ఏకాదశి *జులై 10- గురుపూర్ణిమ *జులై 25- శ్రావణమాసం ప్రారంభం *ఆగస్టు 8- వరలక్ష్మీ వ్రతం *AUG 9- రాఖీ పూర్ణిమ *AUG 16- శ్రీకృష్ణాష్టమి *AUG 27- వినాయక చవితి *అక్టోబర్ 2- విజయదశమి *OCT-20 దీపావళి *OCT 22- కార్తికమాసం ప్రారంభం *జనవరి 14- భోగి, 15- సంక్రాంతి, 16- కనుమ *JAN 23- వసంత పంచమి*జనవరి 30- మేడారం జాతర *ఫిబ్రవరి 15- మహాశివరాత్రి *మార్చి 2- హోలీ

News March 31, 2025

బెట్టింగ్ యాప్స్.. సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

image

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ ప్రధాన అధికారిగా ఐజీ రమేశ్‌ను నియమించారు. ఇందులో సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మీ, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌ను పేర్కొన్నారు. ఇప్పటికే 25 సెలబ్రిటీలపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వగా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

News March 31, 2025

రంజాన్ స్పెషల్.. పసందైన విందు

image

రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ముస్లిం సోదరులు ఇచ్చే విందు. మతాలకు అతీతంగా స్నేహితులు, సన్నిహితులను తమ ఇళ్లకు పిలిచి పసందైన చికెన్ బిర్యానీ వడ్డిస్తారు. ఆ తర్వాత తియ్యటి షేమియా తినిపిస్తారు. అనంతరం ఆత్మీయంగా హత్తుకుని పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరి మీకూ ముస్లిం స్నేహితులు ఉన్నారా? ఈద్ సందర్భంగా మిమ్మల్ని విందుకు ఆహ్వానించారా? కామెంట్ చేయండి.

News March 31, 2025

ముస్లింలకు PM మోదీ ఈద్-ఉల్-ఫితర్ విషెస్

image

దేశంలోని ముస్లింలకు PM నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు దేశంలోని అన్ని పాంతాల్లో ముస్లింలు ఈద్గాలకు చేరుకొని పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.