News May 8, 2025

పిల్లలకు ‘సింధూర్’ అని పేరు పెడుతున్నారు!

image

‘ఆపరేషన్ సింధూర్’ను భారతీయులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతో మంది భారతీయుల ప్రాణాలను బలిగొన్న నరరూప రాక్షసులైన ఉగ్రవాదులను ఈ మిషన్ ద్వారా ఏరివేయడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మిషన్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొందరు తమ పిల్లలకు ఈ పేరు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బిహార్‌లోని కతిహార్ జిల్లాలో కుందన్ కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెకు ‘సింధూర్’ అని నామకరణం చేసి దేశభక్తి చాటాడు.

News May 8, 2025

భారత్‌లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం!

image

భారత్‌లోని 15 నగరాల్లోని మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. చైనాకు చెందిన BVR మిస్సైల్స్‌తో దాడులు చేసేందుకు యత్నించగా, భారత్‌లోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్, పఠాన్ కోట్, బటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు పాక్ యత్నించింది.

News May 8, 2025

స్పోర్ట్స్ జర్నలిజంపై రోహిత్ శర్మ అసహనం

image

భారత్‌లో క్రికెట్ కామెంట్రీ, స్పోర్ట్స్ జర్నలిజంపై రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశారు. వ్యూస్, లైక్స్ కోసం వాస్తవానికి మసాలా జోడించి చూపిస్తున్నట్లు తెలిపారు. ఆట నైపుణ్యాలపై చాలా కొద్ది సందర్భాల్లోనే చర్చ జరుగుతోందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఓ ప్లేయర్ సరిగా ఆడకపోతే అతను ఆటలో ఎక్కడ తప్పు చేస్తున్నాడో చెప్పకుండా పర్సనల్ టార్గెట్ చేయడం సరికాదన్నారు. AUSలో క్రికెట్ కామెంట్రీ బాగుంటుందని చెప్పారు.

News May 8, 2025

కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు!

image

భారత్ కన్నెర్రతో వణుకుతున్న పాక్‌కు ఆర్థికంగా మరో దెబ్బ పడింది. భారత్ నుంచి వరుస దాడులు జరగొచ్చన్న భయాలు వ్యాప్తి చెందడంతో ఆ దేశ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఏకంగా 7వేల పాయింట్లు డౌన్ కావడంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజీని సర్కారు మూసేసింది. ఆ దేశం కోలుకోవడం ఇప్పట్లో కష్టమేనని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు యుద్ధభయాలున్నా భారత స్టాక్ మార్కెట్ పెద్దగా కుదుపునకు లోనవ్వకపోవడం విశేషం.

News May 8, 2025

పాక్‌కు షాక్.. గగనతల రక్షణ వ్యవస్థల ధ్వంసం

image

పాకిస్థాన్ మిస్సైల్ దాడులకు ప్రతీకారంగా భారత్ ఈ ఉదయం పాక్‌పై విరుచుకుపడింది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలే లక్ష్యంగా అటాక్ చేసింది. ఈ క్రమంలో లాహోర్‌లోని HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటిని పాకిస్థాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్‌కు సరైన సమాధానమిచ్చేందుకు భారత్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.

News May 8, 2025

జెత్వానీ కేసులో IPSలకు హైకోర్టులో భారీ ఊరట

image

AP: ముంబై నటి జెత్వానీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఐపీఎస్‌లు విశాల్ గున్నీ, కాంతిరాణా, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలపై తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. నిందితుల క్వాష్ పిటిషన్లపై విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. కాగా ఇదే కేసులో సీనియర్ ఐపీఎస్‌ PSR ఆంజనేయులు అరెస్టయిన విషయం తెలిసిందే.

News May 8, 2025

పరీక్షలన్నీ రద్దంటూ నోటిఫికేషన్.. కొట్టిపారేసిన UGC

image

భారత్-పాక్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో UGC అన్ని పరీక్షలను రద్దు చేసినట్లు ఓ ప్రకటన వైరలవుతోంది. విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించాలని అందులో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా UGC పరిధిలోని కాలేజీల యాజమాన్యాలు గందరగోళానికి లోనయ్యాయి. ఈక్రమంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పందించింది. ఇది తప్పుడు సమాచారమని, ఇలాంటి ప్రకటన తాము చేయలేదని స్పష్టం చేసింది. విద్యార్థులు ఇలాంటివి నమ్మొద్దని సూచించింది.

News May 8, 2025

ప్రయాణికుడిపై దాడి.. రూ.5 లక్షలు ఫైన్ వేసిన ఇండియన్ రైల్వే

image

రైళ్లలో అధిక ధరలకు ఫుడ్ అమ్ముతున్నారని కంప్లైంట్ చేసిన వ్యక్తిపై క్యాటరింగ్ సిబ్బంది <<16344275>>దాడి<<>> చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఇండియన్ రైల్వే స్పందించింది. ‘ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. క్యాటరర్‌పై రూ.5లక్షలు జరిమానా విధించాం. కథువా రైల్వే పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. నిశితంగా ఈ కేసును పరిశీలిస్తాం. దర్యాప్తు ఆధారంగా వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేసింది.

News May 8, 2025

అమరావతికి చట్టబద్ధతపై క్యాబినెట్ తీర్మానం

image

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దీనిపై తీర్మానం చేసిన మంత్రివర్గం దానిని త్వరలోనే కేంద్రానికి పంపనుంది. అలాగే ఏపీ పునర్విభజన చట్టంలో పలు సవరణలను ప్రతిపాదించనుంది. ఆ చట్టంలోనే రాజధానిగా అమరావతి పేరును మెన్షన్ చేయాలని సూచించనుంది. కాగా ‘ఆపరేషన్ సింధూర్‌’ చేపట్టిన కేంద్రానికి క్యాబినెట్ అభినందనలు తెలిపింది.

News May 8, 2025

CBIతో లిక్కర్ స్కామ్ విచారణ జరిపించాలి: కేశినేని నాని

image

AP: లిక్కర్ స్కామ్‌పై CBIతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేత కేశినేని నాని CM చంద్రబాబును కోరారు. ‘రూ.3,600 కోట్ల లిక్కర్ స్కామ్‌లో మీ పార్టీ MP కేశినేని చిన్ని వైఖరి సరిగ్గా లేదు. ఆ కేసులో<<16344826>> ఆయన సీబీఐ దర్యాప్తు చేయాలని<<>> కోరడం, మీ ప్రభుత్వమే చేయిస్తున్న సిట్ దర్యాప్తుపై అపనమ్మకాన్ని సూచిస్తోంది. సిట్‌ సమగ్రత ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలి’ అని డిమాండ్ చేశారు.