India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తరాఖండ్‌లో ఈ ఉదయం <<16344592>>హెలికాప్టర్<<>> క్రాషై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరణించిన వారిలో ఏపీకి చెందిన వేదవతి కుమారి, విజయారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వేదవతి కుమారి అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి. వేదవతి భర్త భాస్కర్‌కు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయన్ను రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
AP: PM మోదీని ఓ బలమైన సంకల్పమని కొనియాడుతూ Dy.CM పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారకా వరకు తన ఇల్లుగా భావిస్తారని పేర్కొన్నారు. తనకు ఇల్లు లేకపోయినా ఆవాస్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాలకు మోదీ సొంత ఇళ్లను అందించారని తెలిపారు. తన ఆశ్రమ జీవితంలో మోదీని ‘అనికేత్’ అని పిలిచేవారని, దానికి అర్థం ‘ఇల్లు లేని వ్యక్తి’ అని పేర్కొన్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ ఫస్ట్ లుక్‌ను మే 1-4 మధ్య జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES)లో రిలీజ్ చేయనున్నారు. సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ సీతారాములుగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్ర పార్ట్-1ను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవాళ శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. లంక వేదికగా జరిగే ఈ టోర్నీలో అతిథ్య జట్టుతో నేడు టీమ్ ఇండియా తలపడనుంది. ఉ.10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. WPLలో సత్తా చాటి జట్టుకు ఎంపికైన కష్వీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. కాగా మ్యాచులు ఫ్యాన్ కోడ్‌లో ప్రసారం కానున్నాయి.
TG: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ చీఫ్ KCR ఏం మాట్లాడుతారనే ఆసక్తి జనాల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కావడమే దీనికి ప్రధాన కారణం. అదే సమయంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గులాబీ బాస్ ఎలాంటి సందేశం, దిశానిర్దేశం చేస్తారనే చర్చ జరుగుతోంది. కాగా KCR సుమారు గంట పాటు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఎర్రవెల్లి నుంచి సా.5 గంటలకు సభాస్థలికి చేరుకుంటారని సమాచారం.
AP: ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని Xలో సూచించింది. అల్లూరి జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలులు, మరో 17 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా నిన్న వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
TG: 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో BRS రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించనుంది. హనుమకొండలోని ఎల్కతుర్తిలో జరిగే ఈ సభకు భారీగా జనం వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉండగా 500 మంది కూర్చునేలా ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న భారీ సభ కావడంతో నేతలంతా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తమ బలాన్ని చాటి చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐపీఎల్‌లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ వాంఖడే వేదికగా 3.30 గంటలకు లక్నో, ముంబై మధ్య జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికీ ఏడు సార్లు తలపడగా LSG 6, MI ఒక మ్యాచులో గెలిచింది. ఢిల్లీ వేదికగా జరిగే మరో మ్యాచులో రా.7.00 గంటలకు బెంగళూరు, ఢిల్లీ పోటీ పడనున్నాయి. ఇప్పటివరకు ఇరు జట్లు 32 సార్లు తలపడగా RCB 19, DC 12 మ్యాచుల్లో గెలవగా ఒక మ్యాచులో ఫలితం రాలేదు.
ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న TRS పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ మద్దతుతో ఈ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలనే ఆకాంక్షను మరోసారి ప్రజల్లో రగిల్చింది. రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించడంతో 2014 నుంచి పదేళ్లపాటు ప్రజలు పట్టం కట్టారు. 2023లో BRSగా మారింది. ఎన్నికల్లో ఓటమిపాలైనా తిరిగి తన అస్థిత్వాన్ని చాటాలని చూస్తోంది.
ఇటీవల సివిల్స్ తుది ఫలితాలు రాగా UPSC తాజాగా మార్కులను వెల్లడించింది. మొత్తం 2,025 మార్కులకు గానూ నం.1 ర్యాంకర్ శక్తి దూబేకు 1,043(51.5%) మార్కులు వచ్చాయి. రాత పరీక్షల్లో 843, ఇంటర్వ్యూలో 200 మార్క్స్ వచ్చాయి. ఇక రెండో ర్యాంకర్ హర్షిత 1,038, మూడో ర్యాంకర్ అర్చిత్ పరాగ్ 1,038 స్కోర్ చేశారు. తెలుగమ్మాయి సాయి శివాని(11వ ర్యాంకర్)కి 1,027 మార్కులు రావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.