India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇప్పటికే ఎన్‌కౌంటర్లలో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా 50మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 14మంది తలలపై రూ.68లక్షల రివార్డు ఉంది. లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని అధికారులు తెలిపారు. PM మరికొన్ని గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనుండగా ఈ లొంగుబాటు జరగడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో 25మంది నక్సలైట్లు లొంగిపోయారు.
* ఏప్రిల్: 6, 16, 18, 20, 23, 30
* మే: 1, 8, 9, 11, 17, 18, 28
* జూన్: 1, 2, 5, 6, 7, 8 * జులై: 16, 30
* ఆగస్టు: 1, 4, 7, 8, 9, 10, 13, 14, 17
* సెప్టెంబర్: 26, 27
* అక్టోబర్: 1, 2, 3, 4, 6, 8, 10, 11, 22, 24
* ఫిబ్రవరి(2026): 19, 20, 21, 22, 25, 26, 27
* మార్చి: 4, 5, 7, 8, 11
* జూన్ 26- జులై 24, ఆగస్టు 24-సెప్టెంబర్ 21, నవంబర్ 21- ఫిబ్రవరి 18(2026), మార్చి12-19(2026) మధ్య ముహూర్తాలు లేవు.
AP: పార్టీలో రెండు టర్మ్‌లు ఓ పదవిలో పనిచేసినవారు పై స్థాయికి వెళ్లాలి లేదా టర్మ్ గ్యాప్ తీసుకోవాలన్న మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు TDP సీనియర్లు మద్దతు పలికారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్కొన్నారు. ‘లోకేశ్ ప్రతిపాదనకు మద్దతునిస్తున్నాం. 2012 నుంచి నేను టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉన్నాను. నా స్థానంలో వేరొకరికి అవకాశమివ్వాలనుకుంటే నేను సిద్ధం’ అని పేర్కొన్నారు.
AP: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.
ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 3 వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. షెడ్యూల్ ఇలా..
OCT 19: మొదటి వన్డే(పెర్త్)
OCT 23: సెకండ్ వన్డే(అడిలైడ్)
OCT 25: మూడో వన్డే(సిడ్నీ)
OCT 29: ఫస్ట్ టీ20(మనుకా ఓవల్)
OCT 31: రెండో టీ20(MCG)
NOV 2: థర్డ్ టీ20(బెల్లిరివ్ ఓవల్)
NOV 6: నాలుగో టీ20(గోల్డ్ కోస్ట్)
NOV 8: ఫిఫ్త్ టీ20(గబ్బా)
TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
సన్‌రైజర్స్ వైజాగ్‌లో కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ రనౌట్ రూపంలో చేజేతులా వికెట్ సమర్పించుకోగా ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్లకు యత్నించి ఔటయ్యారు. ఒకే ఓవర్లో వారిద్దరి వికెట్లు కోల్పోవడం గమనార్హం.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. తాజా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది.
దర్శకుడు పూరీ జగన్నాథ్ కొత్త సినిమాను ప్రకటించారు. విజయ్ సేతుపతితో కొత్త మూవీని చేయనున్నట్లు పూరీ కనెక్ట్స్ ద్వారా వెల్లడించారు. పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్, ఛార్మితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. జూన్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాపయ్యాయి.
రైట్ బ్రదర్స్ కంటే ముందే 1895లో శివ్‌కర్ బాపూజీ తల్పడే విమానాన్ని ఎగరేశారని రాజస్థాన్ గవర్నర్ హరిభౌ బగ్డే తెలిపారు. ‘రైట్ బ్రదర్స్ 1903లో విమానాన్ని ఎగరేశారు. కానీ తల్పడే 1895లోనే ముంబైలో విమానాన్ని ఎగరేశారు. అలాగే న్యూటన్ గ్రావిటీ థియరీకి ముందే 11వ శతాబ్దంలో భాస్కరాచార్య గురుత్వాకర్షణ గురించి చెప్పారు. టెక్నాలజీలో భారత్ ముందుకెళ్తేనే ప్రపంచానికి లీడర్ అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.