India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేవీలో 327 బోట్ క్రూ స్టాఫ్ (గ్రూప్ C) పోస్టుల దరఖాస్తుకు ఏప్రిల్ 1తో గడువు ముగియనుంది. 57 సిరాంగ్ ఆఫ్ లాస్కర్స్, 192 లాస్కర్-1, 73 ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ), 5 టోపాస్ పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు పదో తరగతి పాస్ కావడంతో పాటు ఈత రావాలి. లాస్కర్ సిరాంగ్ పోస్టులకు అదనంగా రెండేళ్లు, లాస్కర్-1 పోస్టులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 18-25 ఏళ్లు. పూర్తి వివరాలకు సైట్: joinindiannavy.gov.in/
TG: ముస్లింలకు సీఎం రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది’ అని తెలిపారు.
న్యూక్లియర్ ఒప్పందానికి అంగీకరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. టారిఫ్‌లు రెట్టింపు చేయడమే కాకుండా అవసరమైతే బాంబు దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యూఎస్ విధిస్తున్న ఆంక్షలతో ఇరాన్ గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
మన దేశంలో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపు రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్)జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రంజాన్ సందర్భంగా రేపు సెలవు ప్రకటించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ గాలులు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మరణించారు. కులు సమీపంలోని పర్యాటక ప్రాంతంలో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. వాటితో పాటు రాళ్లు, శిథిలాలు ఓ వ్యానుతో పాటు అక్కడ కూర్చున్న పర్యాటకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్‌లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.
IPLలో ఒక్క ట్రోఫీ గెలిస్తేనే గొప్ప. అలాంటిది ముంబై, చెన్నై ఐదేసి సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఇదంతా గతం. రోహిత్, ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దూరమయ్యాక ఈ రెండు ఫ్రాంచైజీల పరిస్థితి దారుణంగా తయారైంది. 200కు పైగా స్కోర్లను అలవోకగా ఛేదించే ఈ జట్లలో ఇప్పుడు గెలవాలన్న కసి కనిపించట్లేదు. మొన్న RCBపై చెన్నై, నిన్న GTపై ముంబై బ్యాటింగ్ చూసి.. ఆ జట్ల పని అయిపోయినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. COMMENT?
IPL-2025: చెన్నైతో జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ జైస్వాల్ (4) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా బౌండరీలతో వీరవిహారం చేస్తున్నారు. 22 బంతుల్లోనే 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 58* రన్స్ చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 6 ఓవర్లలో 79/1గా ఉంది.
TG: సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ.11వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర తమదని చెప్పారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు.
10మంది పిల్లలకు జన్మనివ్వడమంటేనే కష్టం. ఆ పదో బిడ్డను 66ఏళ్ల వయసులో ప్రసవిస్తే..? జర్మనీకి చెందిన ఆలెగ్జాండ్రా హెల్డెబ్రాండ్ ఇదే ఘనత సాధించారు. ఎటువంటి కృత్రిమ పద్ధతులూ లేకుండా ఆమె సహజంగానే తల్లి కావడం, ప్రసవించడం విశేషం. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారని బెర్లిన్‌లోని చారైట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అలెగ్జాండ్రా తొలి బిడ్డకు ఇప్పుడు 50 ఏళ్లు కావడం ఆసక్తికరం.
Sorry, no posts matched your criteria.