News May 7, 2025

శుభ సమయం(27-04-2025) ఆదివారం

image

✒ తిథి: అమావాస్య రా.1.22 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.1.31 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేదు
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: రా.9.11-11.14 వరకు
✒ అమృత ఘడియలు: రా.6.42-8.12 వరకు

News May 7, 2025

TODAY HEADLINES

image

* TDPతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు: చంద్రబాబు
* ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మా లక్ష్యం: రేవంత్ రెడ్డి
* భారీ ఎన్‌కౌంటర్.. 37 మంది మృతి?
* భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం: ప్రపంచ బ్యాంకు
* పాతతరం రాజకీయాలు అంతరించాయి: రాహుల్
* నేను భారత కోడలిని.. నన్ను పంపించకండి: సీమా హైదర్
* SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్!
* మే 7న ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్

News May 7, 2025

వారిని వదిలే ప్రసక్తే లేదు: అర్చకులు రంగరాజన్

image

TG: తనపై దాడి చేసిన వారిని వదలబోనని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ స్పష్టం చేశారు. FEB 7న తాను స్నానానికి వెళ్తూ.. ఇప్పుడు ఎవరినీ కలవబోనని చెప్పగానే 20 మంది తలుపులు తోసుకొని ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. రామరాజ్యం కోసం పనిచేసే వారిని కలవడానికి టైం లేదా? అంటూ వారు తనను కిందపడేసి దాడి చేశారన్నారు. దాన్ని తేలికగా తీసుకొనే ప్రసక్తే లేదని, కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానని ఆయన తెలిపారు.

News May 7, 2025

రిచెస్ట్ లీగ్.. అంపైర్స్ మ్యాచ్ ఫీజ్ ఎంతో తెలుసా?

image

వరల్డ్ రిచెస్ట్ టీ20 లీగ్ ఐపీఎల్‌లో అంపైర్ల మ్యాచ్ ఫీజ్ ఎంతనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ప్లేయర్ల స్థాయి(రూ.7.5 లక్షలు)లో కాకపోయినా వారికీ భారీగానే మ్యాచ్ ఫీజ్‌లు ఉంటాయి. ఒక్కో మ్యాచ్‌కు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌కు రూ.3 లక్షలు, ఫోర్త్ అంపైర్‌కు రూ.2 లక్షలు ఇస్తారు. డొమెస్టిక్ క్రికెట్(రూ.30 వేలు)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. విపరీతమైన ఒత్తిడి ఉండే ఐపీఎల్‌‌ మ్యాచ్‌ల్లో ఈ మాత్రం ఫీజ్ ఉండడం సముచితమే.

News May 7, 2025

IPL: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

image

పంజాబ్, కోల్‌కతా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కతా మొదటి ఓవర్లో 7 పరుగులు చేసింది. అనంతరం వర్షం మొదలైంది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహించేందుకు సాధ్యపడలేదు. దీంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

News May 7, 2025

గులాబీ సునామీకి వేదిక సిద్ధం: కేటీఆర్

image

TG: గులాబీ సునామీ సృష్టించేందుకు వేదిక సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సభాస్థలికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. బీఆర్ఎస్(TRS) ఏర్పడి 25 ఏళ్లైన సందర్భంగా రేపు హనుమకొండలోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రేపు సా.4.30 గంటలకు కలుద్దామంటూ జై తెలంగాణ అని రాసుకొచ్చారు.

News May 7, 2025

IPL: ప్రతి సీజన్‌లోనూ ఓ పంత్!

image

IPL 2025లో అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఇలా ప్రతి సీజన్‌లోనూ అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఫెయిల్ కావడం పరిపాటిగా మారింది. స్టార్క్-2024(రూ.24.75cr), కరన్-2023(రూ.18.5cr), ఇషాన్ కిషన్-2022(రూ.15.25cr), మోరిస్-2021(రూ.16.25cr), కమిన్స్-2020(రూ.15.5cr), ఉనద్కత్-2019 (రూ.8.4cr), స్టోక్స్-2017 (రూ.14.5cr,), వాట్సన్-2016(రూ.9.5cr), యువరాజ్-2015(రూ.16cr) లో ఇలాగే విఫలమయ్యారు.

News May 7, 2025

‘కాళేశ్వరం’ ఎండీపై ఏసీబీ కేసు.. ఆస్తులు చూస్తే కళ్లు తేలేయాల్సిందే

image

TG: కాళేశ్వరం కార్పొరేషన్ MD భూక్యా హరిరామ్‌పై ACB కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో 14 చోట్ల దాడులు జరిపింది. తనిఖీల్లో షేక్‌పేట్, కొండాపూర్‌లో విల్లాలు, శ్రీనగర్, మాదాపూర్, నార్సింగిలో ఫ్లాట్లు, అమరావతిలో స్థలం, మర్కూక్‌లో 28 ఎకరాలు, బొమ్మలరామారంలో 6 ఎకరాల ఫామ్‌హౌస్, శ్రీనగర్ కాలనీలో 2 ఇళ్లు, కొత్తగూడెంలో బిల్డింగ్, BMW కారు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు గుర్తించారు.

News May 7, 2025

ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. నిజమిదే!

image

ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇక నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ బంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాని సారాంశం. కాగా, అది 2017 నాటి వీడియో అని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయమేదీ తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు.

News May 7, 2025

పాక్ నుంచి తిరిగొచ్చేస్తున్న భారతీయులు

image

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌లోని భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. గత మూడు రోజుల్లో 450 మందికి పైగా ఇండియన్స్ వాఘా బార్డర్ క్రాస్ చేశారు. వీరిలో 23 మంది పాకిస్థాన్ సూపర్ లీగ్‌‌కు సంబంధించిన బ్రాడ్‌కాస్ట్ కంపెనీలో పనిచేసే వారే కావడం గమనార్హం. మరోవైపు భారత్‌లో ఉన్న 200 మంది పాకిస్థానీయులు తమ దేశానికి వెళ్లిపోయారు.