News March 30, 2025

ఉగాది కానుక.. CMRF దస్త్రంపై చంద్రబాబు సంతకం

image

AP: పేదలకు సాయంపై ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయనిధి దస్త్రంపై సంతకం చేశారు. దీని ద్వారా 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులు ప్రదానం చేశారు.

News March 30, 2025

హార్దిక్‌ పాండ్యకు మరో షాక్!

image

వరుస ఓటముల్లో ఉన్న MI కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. నిన్న GTతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు IPL గవర్నింగ్ కౌన్సిల్ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఓ కెప్టెన్‌కు ఫైన్ పడటం ఇదే తొలిసారి. గత సీజన్‌ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ ఉండటంతో ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో హార్దిక్ నిషేధానికి గురయ్యారు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ తరచూ జరిమానాల్ని ఎదుర్కొంటున్నారు.

News March 30, 2025

నేను, భట్టి జోడెద్దుల్లా పని చేస్తున్నాం: రేవంత్

image

TG: జీవితంలో తాను తీసుకున్న ప్రతి సంకల్పం నెరవేరిందని CM రేవంత్ అన్నారు. తాను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ‘కొత్త నగరాలకు ఫ్యూచర్ సిటీ నమూనా అవుతుంది. అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. అభివృద్ధి జరిగినప్పుడు అడ్డంకులొస్తాయి. అలాగని ఆగిపోకుండా అందరి సహకారం తీసుకుంటాం. దేవుళ్లనే నూటికి నూరు శాతం ఆమోదించడం లేదు’ అని ఉగాది వేడుకల కార్యక్రమంలో అన్నారు.

News March 30, 2025

అప్పుడే నా జన్మ సార్థకం అవుతుంది: సీఎం చంద్రబాబు

image

AP: జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకం అవుతుందని CM చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు P4 విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని, వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని కోరారు. 20 ఏళ్ల క్రితమే IT ప్రాముఖ్యత చెప్పానని, తన మాట విని IT వైపు వెళ్లిన వారు మంచి స్థితిలో ఉన్నారన్నారు. అధికంగా డబ్బులు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులని CM వివరించారు.

News March 30, 2025

రేపు, ఎల్లుండి సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లో రేపు రంజాన్ పండుగ జరుపుకోనుండటంతో ప్రభుత్వ బడులు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవు ఉండనుంది. APలో రేపు ఒక్క రోజే హాలిడే ఇవ్వగా, TG సర్కారు రేపటితో పాటు APR 1న కూడా సెలవు ప్రకటించింది. బోనాలు, క్రిస్మస్, రంజాన్ తర్వాతి రోజు సెలవుగా ప్రకటించడం గత ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు, సౌదీలో నిన్న నెలవంక కనిపించగా అక్కడ ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నారు.

News March 30, 2025

గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పింది: సీఎం చంద్రబాబు

image

AP: ‘ప్రజలే ముందు’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. ఒక్కో చిక్కుముడిని వదిలించుకుంటున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

News March 30, 2025

నాగరికత, సంస్కృతి మరిచిపోతే ఉనికిని కోల్పోతాం: చంద్రబాబు

image

AP: ఉగాది.. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. 25ఏళ్లలో అమెరికన్ల కంటే రెండింతల ఆదాయాన్ని తెలుగుజాతి సంపాదించింది. నాగరికత, సంస్కృతి మరిచిపోతే ఉనికిని కోల్పోతాం. వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారమవుతాయి. కూటమి ప్రభుత్వం నాగరికత, సంస్కృతిని అనుసంధానిస్తూ ముందుకెళ్తోంది’ అని అన్నారు.

News March 30, 2025

SHOCKING: రిలీజ్‌కు ముందే నెట్టింట స్టార్ హీరో సినిమా లీక్!

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ సినిమా ఈరోజు విడుదల కాగా రిలీజ్‌కు 5 గంటల ముందే మొత్తం సినిమా నెట్టింట ప్రత్యక్షమైంది. తమిళ్‌రాకర్స్, మూవీరూల్స్ వంటి పైరేట్ సైట్స్‌లో సినిమా ప్రత్యక్షం కావడంతో మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేసింది. సల్మాన్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మురుగదాస్ తెరకెక్కించారు.

News March 30, 2025

BG-2 కాటన్ సీడ్స్ ధర పెంపు

image

BG-2 పత్తి విత్తనాల ధరను కేంద్ర ప్రభుత్వం ప్యాకెట్‌కు రూ.37 మేర పెంచింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 475 గ్రాముల ప్యాకెట్ రేటు రూ.864 నుంచి రూ.901కి చేరింది. బీజీ-1 విత్తనాల ధర(రూ.635)ను యథాతథంగా ఉంచింది. ఎక్కడైనా ఇంతకుమించి రేటుకు అమ్మితే చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

News March 30, 2025

చంద్రబాబు ఆరోసారీ సీఎం అవుతారు: నాగఫణి శర్మ

image

AP: చంద్రబాబు ఆరోసారి కూడా రాష్ట్రానికి సీఎం అవుతారని మాడుగుల నాగఫణి శర్మ జోస్యం చెప్పారు. AP ప్రభుత్వ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. అమరావతిని ఎవరూ కదిలించలేరని శర్మ ఈ సందర్భంగా తెలిపారు. ‘అమరావతి విశ్వనగరం అవుతుంది. ఎవరికైనా పదవులు రాకపోయినా కంగారుపడొద్దు. ఆలస్యమైనా అర్హత ఉన్నవారందరికీ పదవులు దక్కుతాయి’ అని పేర్కొన్నారు.