India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పర్వదినాన చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి తినాలి. ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. కుటుంబసభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం వినాలి. సృష్టి ఆరంభం రోజు కాబట్టి ఇవాళ కొత్త పనులు మొదలుపెట్టొచ్చు. ఇంద్రధ్వజ, బ్రహ్మ ధ్వజ, రాజదర్శనం పూజలు చేస్తే శుభం కలుగుతుంది. బంగారం, వెండి వంటి వస్తువులు కొనుక్కోవచ్చు.
AP: రాష్ట్రంలోని 126 మండలాల్లో ఇవాళ వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం-20, విజయనగరం-23, మన్యం-13, అల్లూరి-7, విశాఖ-1, అనకాపల్లి-11, కాకినాడ-7, కోనసీమ-7, తూర్పుగోదావరి-19, పశ్చిమగోదావరి-2, ఏలూరు-7, ఎన్టీఆర్-5, గుంటూరు-2, పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే అల్లూరి జిల్లా చింతూరులో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది.
AP: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి రూ.701 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. జిల్లా ప్రధాన రహదారులకు రూ.200cr, రాష్ట్ర ప్రధాన రోడ్లకు రూ.400cr, సీఆర్ఎఫ్ కింద రూ.101cr కేటాయించారు. ఎండీఆర్ కింద ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు నియోజకవర్గాల్లో రహదారుల కోసం భారీగా పనులు మంజూరయ్యాయి. తాజాగా విడుదలైన రూ.400 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 896KM మేర రహదారులను నిర్మించనున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో AP నాలుగో స్థానంలో నిలిచినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి వెల్లడించారు. ఇక్కడ 60L మంది PMకిసాన్ లబ్ధిదారులుంటే 42L మందికి విశిష్ట నంబర్ జారీ చేసినట్లు తెలిపారు. మరో 3L మందికి పూర్తి చేసి ₹182Cr స్పెషల్ గ్రాంట్ సాధనకు కృషి చేస్తున్నామన్నారు. 80% లక్ష్యాన్ని అధిగమించి తూ.గో, శ్రీకాకుళం(78%) తొలి 2 స్థానాల్లో ఉండగా, నెల్లూరు, అల్లూరి జిల్లాలు చివరన ఉన్నాయని పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. APR 1 నుంచి 2నెలల్లోగా BCలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఒకవేళ కేంద్రం, కోర్టులు అడ్డుకుంటే.. నేరుగా రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోంది. లేకపోతే పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చి 30 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఉంటాయి. జూన్ 2న కళాశాలలు ఓపెన్ అవుతాయి. బోర్డు రూల్స్ ప్రకారం సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించడానికి వీలు లేదు. ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కాగా ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.
AP: రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో కరవు నెలకొన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రకాశం-17, కర్నూలు-10, వైఎస్సార్ కడప-10, అనంతపురం-7, నంద్యాల-5, శ్రీసత్యసాయి జిల్లాలోని 2 మండలాల్లో కరవు నెలకొన్నట్లు గుర్తించింది. వీటిలో 37 మండలాల్లో తీవ్ర, 14 మండలాల్లో మోస్తరు కరవు ఉన్నట్లు వివరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
TG: రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని CM రేవంత్ ప్రారంభిస్తారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం జనాభాలో 85 శాతం మందికి వీటిని అందిస్తారు. 3.10 కోట్ల మందికి నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,665 కోట్లు ఖర్చు చేయనుంది.
AP: పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.
వాహన డ్రైవింగ్ విషయంలో సౌతాఫ్రికా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా నిలిచింది. అవినీతి అధికారుల వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. యూఎస్‌కు చెందిన జుటోబీ వార్షిక నివేదిక విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. అలాగే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షిత దేశంగా నార్వే నిలిచింది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య గతేడాది సగటున 8.9 ఉండగా, ఈ ఏడాది అది 6.3కి తగ్గిందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.