News March 30, 2025

నేడు పీ-4 కార్యక్రమం ప్రారంభం

image

AP: పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

News March 30, 2025

సౌతాఫ్రికాలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం

image

వాహన డ్రైవింగ్ విషయంలో సౌతాఫ్రికా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా నిలిచింది. అవినీతి అధికారుల వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. యూఎస్‌కు చెందిన జుటోబీ వార్షిక నివేదిక విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. అలాగే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షిత దేశంగా నార్వే నిలిచింది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య గతేడాది సగటున 8.9 ఉండగా, ఈ ఏడాది అది 6.3కి తగ్గిందని పేర్కొంది.

News March 30, 2025

నేడు IPLలో డబుల్ హెడర్

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో DC-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా తొలి మ్యాచులో RRపై గెలిచిన SRH రెండో మ్యాచులో LSGపై ఓటమిపాలైంది. ఈ మ్యాచులో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇవాళ రాత్రి 7.30 గంటలకు గువాహతిలో RR-CSK మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. బోణీ కొట్టాలని RR, విజయం సాధించాలని CSK యోచిస్తున్నాయి.

News March 30, 2025

పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణనే టాప్

image

TG: పట్టణ తలసరి వ్యయంలో దేశంలోనే TG అగ్రస్థానంలో నిలిచినట్లు కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 తెలిపింది. రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ వ్యయం రూ.4,122 ఉండగా, పట్టణాల్లో రూ.6,199గా ఉన్నట్లు వెల్లడించింది. కేరళలో గ్రామీణ నెలవారీ వ్యయం రూ.6,611గా ఉంది. పట్టణాల్లో విద్యకు నెలకు రూ.183, అద్దె-661, వైద్యం-రూ.426, మద్యం, పాన్-రూ.320, కూల్ డ్రింక్స్, చిప్స్ కోసం రూ.33 ఖర్చు చేస్తున్నట్లు వివరించింది.

News March 30, 2025

టాప్‌లో కొనసాగుతోన్న బెంగళూరు

image

ఐపీఎల్‌ 2025 ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు జట్లు తప్ప అన్ని టీమ్‌లు రెండేసి మ్యాచులు ఆడాయి. RCB ఆడిన రెండింట్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత LSG, GT, PBKS, DC, SRH, KKR, CSK, MI, RR ఉన్నాయి. ముంబై, రాజస్థాన్ ఆడిన రెండింట్లోనూ ఓడి టేబుల్‌లో అట్టడుగున నిలిచాయి. ఇవాళ రెండు మ్యాచులు ఉండటంతో పట్టికలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

News March 30, 2025

భారీ ఎన్‌కౌంటర్: 20కు చేరిన మృతుల సంఖ్య

image

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 20కు చేరుకుంది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మృతి చెందినట్లు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. గోగుండా కొండపై జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. భద్రత బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News March 30, 2025

బైక్ కొంటే రెండు హెల్మెట్లు ఇవ్వాల్సిందే: గడ్కరీ

image

దేశంలోని అన్ని టూవీలర్ వాహనాలను రెండు ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లతో విక్రయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. రహదారి భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘ప్రమాదాల్లో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ ఆదేశం ఇలాంటి నష్టాలను నివారిస్తుంది. ఈ రూల్ రెగ్యులేషన్ మాత్రమే. ఇది జాతీయ అవసరం కూడా’ అని టీహెచ్ఎంఏ ఛైర్మన్ వ్యాఖ్యానించారు.

News March 30, 2025

రాప్తాడు, కళ్యాణదుర్గం YCP ఇన్‌ఛార్జులపై కేసు

image

AP: రాప్తాడు, కళ్యాణదుర్గం వైసీపీ ఇన్‌ఛార్జులు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఉష శ్రీచరణ్‌లపై పెనుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 27న పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో వీరిద్దరూ పోలీసులను దూషించి, విధులకు ఆటంకం కలిగించారని, దౌర్జన్యం చేశారని చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు.

News March 30, 2025

మార్చి 30: చరిత్రలో ఈరోజు

image

1929: భారత్‌, ఇంగ్లండ్ మధ్య తొలిసారి విమాన సేవలు
1935: రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం
1943: గాయకుడు, నటుడు జిత్ మోహన్ మిత్ర జననం
1948: దివంగత నటుడు కన్నడ ప్రభాకర్ జననం
1983: నటుడు నితిన్ జననం
1971: తొలి తెలుగు నటి సురభి కమలాబాయి మరణం
2002: ఆనంద్ బక్షి, సంగీత దర్శకుడు మరణం
2011: నటుడు నూతన్ ప్రసాద్ మరణం
☞ ప్రపంచ ఇడ్లీ దినోత్సవం

News March 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.