News November 7, 2025

కుప్పకూలిన ATC వ్యవస్థ.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం

image

ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో ATC వ్యవస్థ కుప్పకూలింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో సుమారు 500, ముంబైలో 200 ఫ్లైట్స్‌పై ప్రభావం పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైబర్ అటాక్‌లో భాగమైన <<18227204>>జీపీఎస్ స్పూఫింగే<<>> దీనికి కారణమని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

News November 7, 2025

అప్పుడు ఢిల్లీలో, ఇప్పుడు బిహార్‌లో BJP నేతలు ఓట్లేశారు: రాహుల్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన BJP నేతలు బిహార్ ‌తొలి దశలోనూ ఓటు వేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హరియాణాలో ఓట్ చోరీకి సంబంధించిన ఆధారాలను సమర్పించామని తెలిపారు. ‘హరియాణాలో 2 కోట్ల ఓటర్లలో 29 లక్షల మంది ఫేక్. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణాలో BJP ఓట్ చోరీకి పాల్పడింది. దాన్ని బిహార్‌లో రిపీట్ చేయాలని వారు చూస్తున్నారు. ఇక్కడి ప్రజలు అలా జరగనివ్వరు’ అని అన్నారు.

News November 7, 2025

కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

image

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.

News November 7, 2025

నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్<<>> హౌసింగ్ బ్యాంక్‌ 16 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో 6 రెగ్యులర్, 10 కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 28వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎం, బీఈ, ఎంఈ, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhb.org.in

News November 7, 2025

బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

image

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.

News November 7, 2025

బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP

image

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి DPR కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు AP ప్రకటించింది. HYDలో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టును చేపడుతోందని తెలంగాణ తొలినుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై కేంద్రానికి, CWCకి ఫిర్యాదు చేసింది. న్యాయపోరాటానికీ సిద్ధమైంది. దీంతో AP ఈ ప్రకటన చేసింది.

News November 7, 2025

సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా రివ్యూ

image

లంకె బిందెలకు కాపలా ఉండే ధన పిశాచి, ఓ ఘోస్ట్ హంటర్ చుట్టూ జరిగే కథే ‘జటాధర’ మూవీ. ఆడియన్స్ పేషన్స్‌ను టెస్ట్ చేసే సినిమా ఇది. స్టోరీలో బలం, కొత్త ధనం లేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏమాత్రం మెప్పించదు. అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ అంశాలు, BGM ఫర్వాలేదనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ ఇబ్బందిపెడుతుంది. సాగదీత, ఊహకు అందే సీన్లు, రొటీన్ క్లైమాక్స్ నిరాశకు గురిచేస్తాయి. రేటింగ్: 1/5

News November 7, 2025

క్షమాపణలు చెప్పిన రిలయన్స్, స్కోడా.. ఎందుకంటే?

image

ఏదైనా భారీ తప్పిదం జరిగినప్పుడు కంపెనీలు తమ కస్టమర్లకు క్షమాపణలు చెప్పడం సహజమే. కానీ ఒకేసారి పలు కంపెనీలు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే సరికొత్త సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ సరదాగా ట్వీట్ చేశాయా కంపెనీలు. ‘నాణ్యమైనవి చౌకగా ఇస్తున్నందుకు’ రిలయన్స్, సేఫ్టీలో కాంప్రమైజ్ కానందుకు స్కోడా & ఫోక్స్ వాగన్ కంపెనీలు క్షమాపణలు చెప్పాయి.

News November 7, 2025

రేపు స్కూళ్లకు సెలవు లేదు: డీఈవోలు

image

AP: ఇటీవల ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటికి బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఏలూరు, బాపట్ల, విశాఖలో స్కూళ్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి. అలాగే DEC 13, FEB 14న కూడా పాఠశాలలు పనిచేయనున్నాయి. మీకూ రేపు స్కూల్ ఉందా? COMMENT

News November 7, 2025

₹4 లక్షలు పెద్ద అమౌంటే కదా: షమీ మాజీ భార్యకు సుప్రీం ప్రశ్న

image

భారత క్రికెటర్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ₹1.5లక్షలు, కూతురికి ₹2.5లక్షలు నెలవారీ భరణంగా ఇవ్వాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. షమీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని అమౌంట్‌ను పెంచాలని కోరారు. దీంతో షమీ, బెంగాల్ ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. ‘ఇప్పటికే ఇస్తున్న ₹4L పెద్ద అమౌంటే కదా’ అని జహాన్‌ను ప్రశ్నించింది. విచారణను DECకు వాయిదా వేసింది.