India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 40కి.మీ వేగంతో గాలులు వీయొచ్చని వెల్లడించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఇవాళ ట్రంప్ భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శిస్తూ ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. ‘నివాస ప్రాంతాలపై పుతిన్ మిస్సైల్ దాడులు చేయడంలో అర్థం లేదు. ఇదంతా చూస్తుంటే ఆయనకు యుద్ధం ఆపాలని లేదనిపిస్తోంది. ఇక చర్చలతో పనయ్యేలా లేదు. ఇతర పద్ధతుల్లో వ్యవహరించాల్సిందే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
AP: CM చంద్రబాబు నేటి శ్రీకాకుళం జిల్లా పర్యటన నిరుత్సాహానికి గురి చేసిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. 44 ఏళ్లలో TDP మత్స్యకారులకు ఏం చేయలేదని, భవిష్యత్తులో ఏం చేయబోతుందో ఇవాళ కూడా చెప్పలేదని ఎద్దేవా చేశారు. నేడు ఏ ఒక్క హార్బర్‌కైనా శంకుస్థాపన లేదా ప్రారంభం చేశారా? అని నిలదీశారు. ఓ స్థానిక మత్స్యకార మహిళ గుజరాత్‌లోని వీరావలికి వలస వెళ్తున్నానని చెప్పగానే CM ముఖం మాడిపోయిందని చెప్పారు.
PBKS, KKR మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వద్ద వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. 202 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన KKR వర్షం పడే సమయానికి ఒక ఓవర్ ఆడి 7 రన్స్ చేసింది. క్రీజులో ఓపెనర్లు గుర్బాజ్, నరైన్ ఉన్నారు.
AP: పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో SMలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DGP హరీశ్‌కుమార్ గుప్తా హెచ్చరించారు. కేంద్ర నిఘా సంస్థల పేరుతో కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను హైఅలర్ట్ జోన్స్‌గా ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రకటనలేవీ చేయలేదని స్పష్టం చేశారు.
AP: అన్నమయ్య(D)లో విషాదం నెలకొంది. ములకలచెరువులోని పెద్ద చెరువులో మునిగి నలుగురు మృతిచెందారు. ఈశ్వరమ్మ తన పిల్లలు లావణ్య(12), నందకిశోర్(10), పక్కింటి చిన్నారి నందిత(11)తో కలిసి దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. చిన్నారులు ఆడుకుంటూ నీటిలోకి దిగి గల్లంతయ్యారు. వారిని కాపాడే క్రమంలో ఈశ్వరమ్మ భర్త మల్లేశ్(36) కూడా నీటిలో మునిగి చనిపోయారు. నలుగురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ల విధ్వంసంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 201/4 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ (83), ప్రియాన్ష్ ఆర్య (69) కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించారు. కెప్టెన్ అయ్యర్ (25*) ఫరవాలేదనిపించారు. KKR బౌలర్లలో వైభవ్ 2, వరుణ్, రస్సెల్ తలో వికెట్ తీశారు.
IPL: పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య KKR బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ప్రియాన్ష్ 35 బంతుల్లోనే 69 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత సెంచరీ చేస్తాడని అనుకున్న ప్రభ్ సిమ్రాన్ 49 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 రన్స్ చేసి వెనుదిరిగారు. దీంతో పంజాబ్ జట్టు భారీ స్కోర్ వైపు దూసుకెళ్తోంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ మరణించారు. సరదా కంటెంట్, వ్యంగ్యమైన రీల్స్‌తో అభిమానులను సంపాదించుకున్న ఆమె ఈనెల 25న పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. అయితే అంతకు 2 రోజులు ముందే మిషా చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. మృతికి గల కారణాలు వెల్లడించలేదు. మిషాకు ఇన్‌స్టాలో 3.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘ది మిషా అగర్వాల్ షో’ ద్వారా యూట్యూబ్‌లోనూ ఆమె పాపులర్.
పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సొంత దేశస్థులే పాక్ సర్కారును SMలో ట్రోల్ చేస్తున్నారు. పాక్‌తో యుద్ధం 9లోపే చేయాలని, 9.15తర్వాత గ్యాస్ సరఫరా ఆగిపోతుందని ఒకరు, భారత ఫైటర్ జెట్లకు దీటుగా ఓ పాక్ వ్యక్తి ఫైటర్ జెట్ బైక్ నడుపుతున్న ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు. లాహోర్‌ను భారత్ తీసుకుంటే, అక్కడేం లేదని అరగంటలో తిరిగిస్తుందని సొంత దేశ పాలనపై విసిగిపోయి మీమ్స్‌లో ఎండగడుతున్నారు.
Sorry, no posts matched your criteria.