India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో కరవు నెలకొన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రకాశం-17, కర్నూలు-10, వైఎస్సార్ కడప-10, అనంతపురం-7, నంద్యాల-5, శ్రీసత్యసాయి జిల్లాలోని 2 మండలాల్లో కరవు నెలకొన్నట్లు గుర్తించింది. వీటిలో 37 మండలాల్లో తీవ్ర, 14 మండలాల్లో మోస్తరు కరవు ఉన్నట్లు వివరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
TG: రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని CM రేవంత్ ప్రారంభిస్తారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం జనాభాలో 85 శాతం మందికి వీటిని అందిస్తారు. 3.10 కోట్ల మందికి నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,665 కోట్లు ఖర్చు చేయనుంది.
AP: పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.
వాహన డ్రైవింగ్ విషయంలో సౌతాఫ్రికా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా నిలిచింది. అవినీతి అధికారుల వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. యూఎస్‌కు చెందిన జుటోబీ వార్షిక నివేదిక విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. అలాగే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షిత దేశంగా నార్వే నిలిచింది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య గతేడాది సగటున 8.9 ఉండగా, ఈ ఏడాది అది 6.3కి తగ్గిందని పేర్కొంది.
ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో DC-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా తొలి మ్యాచులో RRపై గెలిచిన SRH రెండో మ్యాచులో LSGపై ఓటమిపాలైంది. ఈ మ్యాచులో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇవాళ రాత్రి 7.30 గంటలకు గువాహతిలో RR-CSK మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. బోణీ కొట్టాలని RR, విజయం సాధించాలని CSK యోచిస్తున్నాయి.
TG: పట్టణ తలసరి వ్యయంలో దేశంలోనే TG అగ్రస్థానంలో నిలిచినట్లు కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 తెలిపింది. రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ వ్యయం రూ.4,122 ఉండగా, పట్టణాల్లో రూ.6,199గా ఉన్నట్లు వెల్లడించింది. కేరళలో గ్రామీణ నెలవారీ వ్యయం రూ.6,611గా ఉంది. పట్టణాల్లో విద్యకు నెలకు రూ.183, అద్దె-661, వైద్యం-రూ.426, మద్యం, పాన్-రూ.320, కూల్ డ్రింక్స్, చిప్స్ కోసం రూ.33 ఖర్చు చేస్తున్నట్లు వివరించింది.
ఐపీఎల్ 2025 ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు జట్లు తప్ప అన్ని టీమ్‌లు రెండేసి మ్యాచులు ఆడాయి. RCB ఆడిన రెండింట్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత LSG, GT, PBKS, DC, SRH, KKR, CSK, MI, RR ఉన్నాయి. ముంబై, రాజస్థాన్ ఆడిన రెండింట్లోనూ ఓడి టేబుల్‌లో అట్టడుగున నిలిచాయి. ఇవాళ రెండు మ్యాచులు ఉండటంతో పట్టికలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 20కు చేరుకుంది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మృతి చెందినట్లు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. గోగుండా కొండపై జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. భద్రత బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దేశంలోని అన్ని టూవీలర్ వాహనాలను రెండు ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లతో విక్రయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. రహదారి భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘ప్రమాదాల్లో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ ఆదేశం ఇలాంటి నష్టాలను నివారిస్తుంది. ఈ రూల్ రెగ్యులేషన్ మాత్రమే. ఇది జాతీయ అవసరం కూడా’ అని టీహెచ్ఎంఏ ఛైర్మన్ వ్యాఖ్యానించారు.
AP: రాప్తాడు, కళ్యాణదుర్గం వైసీపీ ఇన్‌ఛార్జులు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఉష శ్రీచరణ్‌లపై పెనుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 27న పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో వీరిద్దరూ పోలీసులను దూషించి, విధులకు ఆటంకం కలిగించారని, దౌర్జన్యం చేశారని చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.