News March 29, 2025

ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి వసంత నవరాత్రులు

image

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 10 రోజుల పాటు ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించనున్నారు. ఉగాది సందర్భంగా రేపు ఉ.9 గంటలకు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారని ఆలయ అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుందని తెలిపారు. రేపు పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 29, 2025

జూనియర్ NTR ఎడిటెడ్ ఫొటోలు అదిరిపోయాయిగా..

image

జూనియర్ NTRపై ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్నట్లు ఏఐని ఉపయోగించి ఈ ఫొటోలను ఎడిట్ చేశారు. నోట్లో సిగరెట్‌తో తారక్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో తీసే సినిమాలో ఈ లుక్ ట్రై చేస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి యంగ్ టైగర్ మాస్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 29, 2025

రోడ్ల మరమ్మతులకు రూ.600 కోట్లు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. ప్రాధాన్యతా క్రమంలో రాష్ట్ర, జిల్లా రోడ్లకు సంబంధించి 225 పనులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

News March 29, 2025

త్రిష ప్రేమ పెళ్లి చేసుకోనున్నారా?

image

41 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో అదరగొడుతున్న హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇవాళ ఆమె ఇన్‌స్టాలో నగలు, పట్టుచీరతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది’ అని రాసుకొచ్చారు. దీనికి సఖి చిత్రంలోని ‘స్నేహితుడా’ పాట BGMను యాడ్ చేశారు. దీంతో ఆమె ఫ్రెండ్‌ను ప్రేమ వివాహం చేసుకుంటున్నారా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 29, 2025

దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

image

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి కోరారు. ఉగాదిని వివిధ పేర్లతో దేశంలోని పలు రాష్ట్రాలు జరుపుకుంటాయి.

News March 29, 2025

భూకంపం.. 1644 మంది మృతి

image

మయన్మార్ భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1644 మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. వేలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

News March 29, 2025

రేపు, ఎల్లుండి పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

image

TG: రేపు, ఎల్లుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్టేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెలవులను రద్దు చేసింది.

News March 29, 2025

మేనేజర్‌గా పనిచేస్తున్న క్రేజీ హీరోయిన్

image

యువీతో డేటింగ్, ఖడ్గం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన క్రేజీ హీరోయిన్ కిమ్ శర్మ గుర్తుందా? ప్రస్తుతం ఆమె బాలీవుడ్ పార్టీల్లో తరచూ కనిపించే ఓర్రీకి చెందిన ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీకి మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీని ₹10Cr లాభాల్లోకి తీసుకొచ్చారు. షారుఖ్, అమితాబ్ లాంటి స్టార్లతో నటించిన ఆమె మేనేజర్‌గా చేస్తుండటంపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

News March 29, 2025

ఐదుగురు ఐటీ శాఖ ఆఫీసర్లపై సీబీఐ కేసు.. అరెస్ట్

image

TG: హైదరాబాద్‌లోని ఐదుగురు IT ఆఫీసర్లు సహా ఆరుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. పన్ను చెల్లింపుదారులను మోసం చేయడంతోపాటు ఐటీ శాఖ రహస్య డేటాను ప్రైవేటు వ్యక్తులకు చేరవేస్తున్నట్లు గుర్తించింది. పక్కా సమాచారంతో ఐటీ ఇన్‌స్పెక్టర్లు గుల్నాజ్ రవూఫ్, కుత్తాడి శ్రీనివాస్, సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్లు ఖుమర్ ఆలం, మనీష్, జావేద్, ఛార్టెడ్ అకౌంటెంట్‌(ప్రైవేట్) భగత్‌ను అరెస్ట్ చేసింది.

News March 29, 2025

విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

image

ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారు. పరిధికి మించి అప్పులు చేస్తే అప్పులూ పుట్టని స్థితికి వస్తారు. AP, TG నేతలు పరిస్థితులను గమనించాలి. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు’ అని సూచించారు.