News March 30, 2025

ఆర్మీని తరలించడంతోనే జమ్మూలో ఉగ్రదాడులు: ఒమర్

image

జమ్మూలో ఉగ్రదాడులు పెరగడంపై J&K సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కఠువాలో చనిపోయిన నలుగురు పోలీసుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. చైనా చొరబాట్లను ఆపేందుకు జమ్మూ నుంచి సైన్యాన్ని లద్దాక్‌కు తరలించడాన్ని టెర్రరిస్టులు అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. క్రమంగా ఈ పరిస్థితిని అధిగమిస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతలను మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు అవసరమన్నారు.

News March 30, 2025

సంక్రాంతికి పొలిమేర-3: డైరెక్టర్

image

చిన్న సినిమాలుగా వచ్చి సంచలన విజయం సాధించిన ‘పొలిమేర’ 1&2లకు సీక్వెల్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. ‘ఇది పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తాం. ఇందులో ఓ ప్రముఖ నటుడు కీలక పాత్రలో నటిస్తారు’ అని చెప్పారు. కాగా ఆయన డైరెక్షన్ చేసిన 28 డిగ్రీస్ మూవీ ఏప్రిల్ 4న విడుదల కానుంది.

News March 30, 2025

కొలికపూడిపై సీఎం ఆగ్రహం?

image

AP: వరుసగా వివాదాలకు కారణమవుతున్న టీడీపీ ఎమ్మెల్యే <<15917608>>కొలికపూడి శ్రీనివాసరావు<<>> తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఎక్కడా లేని సమస్యలు తిరువూరులోనే ఎందుకు వస్తున్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, ఎంపీ కేశినేని చిన్నిలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరైనా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే పనిచేయాలని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

News March 30, 2025

పరీక్షల భయం.. అమ్మాయి ఆత్మహత్య

image

వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఒత్తిడి భరించలేక తమిళనాడు చెన్నైకి చెందిన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే మూడు సార్లు NEETలో ఫెయిల్ అయిన దేవదర్శిని.. మేలో మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ప్రిపేర్ అవుతోంది. తరచూ విఫలం అవుతుండటం, సమయం వృథా కావడం, కుటుంబ ఆర్థిక సమస్యలతో సతమతం అయిన ఆమె ఇవాళ ఉరేసుకుంది.

News March 29, 2025

IPL: రికార్డు సృష్టించారు

image

MIతో మ్యాచ్‌లో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ రికార్డులు సృష్టించారు. ఐపీఎల్‌లో తొలి 27 ఇన్నింగ్సుల్లో అత్యధిక రన్స్(1,171) చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచారు. ఓవరాల్‌గా షాన్ మార్ష్(1,254) టాప్‌లో ఉన్నారు. అలాగే ఒకే వేదిక(అహ్మదాబాద్)లో వేగంగా(20INNS) 1,000 రన్స్ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా గిల్ రికార్డు సాధించారు. బెంగళూరులో 19 INNSలోనే వెయ్యి రన్స్ చేసి క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నారు.

News March 29, 2025

గురుకుల ఫలితాలు విడుదల

image

TG: రాష్ట్రంలోని SC, ST, BC గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష(స్పెషల్ కేటగిరీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విభాగంలో 13,927 మంది విద్యార్థులు పరీక్ష రాయగా తొలి దశలో 1,944 మంది సీట్లు సాధించారని అధికారులు తెలిపారు. అలాగే ఐదు నుంచి 9వ తరగతి వరకు పరీక్ష రాసిన విద్యార్థుల మొదటి దశ మెరిట్ లిస్టును కూడా రిలీజ్ చేసినట్లు చెప్పారు.
వెబ్‌సైట్: https://www.tgswreis.telangana.gov.in/

News March 29, 2025

రేపు 126 మండలాల్లో వడగాలులు

image

AP: సూర్యుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. రేపు 126, ఎల్లుండి 15 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA వెల్లడించింది. అల్లూరి జిల్లా చింతూరులో అత్యధికంగా రేపు 43.7, ఎల్లుండి 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైన ఎండలు రికార్డవుతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటికెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News March 29, 2025

‘వైస్రాయ్’ ఘటనపై వైసీపీ Ghiblistyle ఫొటోలు

image

వైస్రాయ్ హోటల్ ఘటన APలో అతిపెద్ద రాజకీయ ద్రోహాలలో ఒకటని YCP విమర్శించింది. TDP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ NTRకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన రోజును మరోసారి చూడండి అంటూ <<15920586>>Ghiblistyle<<>> ఫొటోలను షేర్ చేసింది. ‘చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి HYD వైస్రాయ్ హోటల్‌లో కుట్ర చేశారు. పార్టీని హైజాక్ చేసి NTRను అధికారం నుంచి తొలగించారు. ఈ బాధతోనే ఆయన 1996 జనవరిలో మరణించారు’ అని రాసుకొచ్చింది.

News March 29, 2025

సౌదీలో కనిపించిన చంద్రుడు.. ఇండియాలో ఎల్లుండి రంజాన్

image

సౌదీ అరేబియాలో చంద్రుడు దర్శనమిచ్చాడు. దీంతో ఆ దేశంలో రేపు (మార్చి 30) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు. ఉ.6.30 గంటలకు అక్కడి మసీద్ అల్ హరామ్‌లో ఈద్ ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 31న ఇండియాలో రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు.

News March 29, 2025

ఏప్రిల్ 8న బన్నీ కొత్త సినిమా ప్రకటన?

image

అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో AA22 మూవీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన డబుల్ రోల్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్ మేడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పుష్ప-2 బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కే చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.