India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సూర్యుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. రేపు 126, ఎల్లుండి 15 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA వెల్లడించింది. అల్లూరి జిల్లా చింతూరులో అత్యధికంగా రేపు 43.7, ఎల్లుండి 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైన ఎండలు రికార్డవుతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటికెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం <
వైస్రాయ్ హోటల్ ఘటన APలో అతిపెద్ద రాజకీయ ద్రోహాలలో ఒకటని YCP విమర్శించింది. TDP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ NTRకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన రోజును మరోసారి చూడండి అంటూ <<15920586>>Ghiblistyle<<>> ఫొటోలను షేర్ చేసింది. ‘చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి HYD వైస్రాయ్ హోటల్‌లో కుట్ర చేశారు. పార్టీని హైజాక్ చేసి NTRను అధికారం నుంచి తొలగించారు. ఈ బాధతోనే ఆయన 1996 జనవరిలో మరణించారు’ అని రాసుకొచ్చింది.
సౌదీ అరేబియాలో చంద్రుడు దర్శనమిచ్చాడు. దీంతో ఆ దేశంలో రేపు (మార్చి 30) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు. ఉ.6.30 గంటలకు అక్కడి మసీద్ అల్ హరామ్‌లో ఈద్ ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 31న ఇండియాలో రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు.
అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో AA22 మూవీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన డబుల్ రోల్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్ మేడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పుష్ప-2 బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కే చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.
రాత్రిపూట అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి హానికరం అని ఏ సైంటిఫిక్ రిసెర్చూ తేల్చలేదు. అయితే ఆయుర్వేదం ప్రకారం రాత్రి అరటి పండు తింటే శ్లేష్మం ఉత్పత్తి అయి జలుబు చేస్తుంది. దగ్గు, గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అరటి పండును ఉదయం అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఎక్కువ లాభాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు.
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 10 రోజుల పాటు ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించనున్నారు. ఉగాది సందర్భంగా రేపు ఉ.9 గంటలకు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారని ఆలయ అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుందని తెలిపారు. రేపు పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
జూనియర్ NTRపై ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్నట్లు ఏఐని ఉపయోగించి ఈ ఫొటోలను ఎడిట్ చేశారు. నోట్లో సిగరెట్‌తో తారక్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో తీసే సినిమాలో ఈ లుక్ ట్రై చేస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి యంగ్ టైగర్ మాస్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
AP: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. ప్రాధాన్యతా క్రమంలో రాష్ట్ర, జిల్లా రోడ్లకు సంబంధించి 225 పనులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
41 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో అదరగొడుతున్న హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇవాళ ఆమె ఇన్‌స్టాలో నగలు, పట్టుచీరతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది’ అని రాసుకొచ్చారు. దీనికి సఖి చిత్రంలోని ‘స్నేహితుడా’ పాట BGMను యాడ్ చేశారు. దీంతో ఆమె ఫ్రెండ్‌ను ప్రేమ వివాహం చేసుకుంటున్నారా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి కోరారు. ఉగాదిని వివిధ పేర్లతో దేశంలోని పలు రాష్ట్రాలు జరుపుకుంటాయి.
Sorry, no posts matched your criteria.