News March 29, 2025

తమన్నాతో బ్రేకప్ వార్తలు.. విజయ్ వర్మ కామెంట్స్ వైరల్

image

నటి తమన్నా, విజయ్ వర్మ విడిపోయారని కొన్ని రోజలుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో రిలేషన్‌షిప్‌ను ఓ ఐస్‌క్రీమ్‌లా ఆద్యంతం ఆస్వాదించాలని, అలా చేస్తే సంతోషంగా ఉండగలమని విజయ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. సంతోషం, బాధ, కోపం లాంటి ప్రతి అంశాన్ని స్వీకరించి ముందుకు సాగాలని చెప్పారు. మరోవైపు, ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడటం మొదలెడతామో అప్పుడే అసలు సమస్యలొస్తాయని తమన్నా ఇటీవల వ్యాఖ్యానించారు.

News March 29, 2025

మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

మయన్మార్‌లో మళ్లీ భూకంపం వచ్చింది. ఆ దేశ రాజధాని నేపిడా సమీపంలో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తెలిపాయి. 24గంటల వ్యవధిలో 15సార్లు ఆ దేశంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. నిన్న 7.7 తీవ్రతతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ భూకంపానికి 1000 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

News March 29, 2025

చెన్నై కెప్టెన్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ఆ టీమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘మేము 50 పరుగుల తేడాతోనే ఓడిపోయాం. ఇదేమీ భారీ మార్జిన్ కాదు’ అని నిన్న గైక్వాడ్ అన్నారు. టీ20లో 50 రన్స్ తేడాతో ఓడిపోవడం అంటే భారీ కాదా? అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ మైండ్‌సెటే ఇలా ఉంటే.. గెలవాలన్న కసి జట్టులోని మిగతా ప్లేయర్లకు ఎలా ఉంటుందని నిలదీస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 29, 2025

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లే వాట్సాప్‌లో స్టేటస్ ఫొటోలకు మ్యూజిక్ యాడ్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇందులో లైసెన్స్డ్ ట్రాక్స్ మాత్రమే వాడొచ్చు. సొంత పాటలను అప్డేట్ చేస్తామంటే అనుమతించదు. ఈ ఫీచర్ వాడేందుకు వాట్సాప్ ఓపెన్ చేయాలి> న్యూ స్టేటస్ క్లిక్ చేయాలి> ఫొటో/ వీడియో తీసుకోవాలి> పైన మ్యూజిక్ బటన్ నొక్కాలి> మ్యూజిక్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది> మీకు నచ్చిన పాట సెలక్ట్ చేసుకోవాలి.

News March 29, 2025

సానియా సోదరి ఎక్స్‌పోలో కాల్పుల కలకలం

image

TG: HYD గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా ఏర్పాటుచేసిన ఓ ఎక్స్‌పోలో ఇద్దరు షాపు యజమానుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎక్స్‌పోలో భద్రతను పెంచారు.

News March 29, 2025

వరుణ్ చక్రవర్తికి జాక్‌పాట్?

image

CTలో స్పిన్ మ్యాజిక్ చేసిన వరుణ్ చక్రవర్తికి BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. అలాగే గతంలో కాంట్రాక్టులు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పేర్లను చేర్చడం ఖాయంగా కన్పిస్తోంది. మరోవైపు పలువురు ప్లేయర్లకు పదోన్నతి లభించే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ కాంట్రాక్టుల అంశంతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి ఇవాళ BCCI సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

News March 29, 2025

యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌పై ఫిల్మ్ ఛాంబర్ సీరియస్?

image

యూట్యూబ్‌లో తప్పుడు థంబ్‌నెయిల్స్‌ పెడుతున్న ఘటనలపై ఫిల్మ్ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాలీవుడ్‌కు చెందిన పలు సంఘాలతో ఛాంబర్ తాజాగా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వాటి స్వార్థం కోసం సినిమా వారిని లక్ష్యంగా చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్‌ గురించి చర్చించినట్లు సమాచారం. అలాంటి యూట్యూబ్ ఛానల్స్‌పై వచ్చే నెల 1 నుంచి కఠిన చర్యల్ని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News March 29, 2025

బీటెక్ ఫెయిలైన వారికీ సర్టిఫికెట్

image

TG: నాలుగేళ్ల బీటెక్ కోర్సులో 50 శాతం సబ్జెక్టులు పాసైనా ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విధివిధానాలు రూపొందించేందుకు ఓ కమిటీని నియమించనుంది. ప్రస్తుతం బీటెక్‌లో 160 క్రెడిట్లు(ఒక్కో సెమిస్టర్‌కు 20) ఉంటాయి. ఒక్క సబ్జెక్ట్ ఫెయిలైనా పట్టా రాదు. కొత్త విధానంతో సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే విద్యార్థులకు సర్టిఫికెట్ వస్తుంది. దీంతో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.

News March 29, 2025

డేటింగ్ యాప్‌లో ప్రేమ.. రూ.6.5 కోట్లు పోగొట్టుకున్నాడు

image

డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను నమ్మి ఓ వ్యక్తి ₹6.5Cr పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్‌సింగ్ ఓ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో విడాకులు కావడంతో ప్రేమ కోసం యాప్‌లో ప్రయత్నించగా అనిత పరిచయమైంది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులతో డబ్బు సంపాదించొచ్చని నమ్మించింది. తొలుత ₹3.2Lకు గంటల్లోనే ₹24K లాభం చూపింది. దీంతో ₹6.5Cr ఇన్వెస్ట్ చేయగా ముంచేయడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.

News March 29, 2025

బుమ్రా ఎప్పుడొస్తారో చెప్పలేం: జయవర్ధనే

image

పేసర్ జస్ప్రీత్ బుమ్రా బాగా కోలుకున్నారని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. అయితే ఎంట్రీ ఎప్పుడన్నది చెప్పలేమని తెలిపారు. ‘బుమ్రాను ఫలానా మ్యాచ్‌లోపు తీసుకురావాలన్నదేమీ మేం పెట్టుకోలేదు. తన రోజూవారీ వర్కవుట్స్‌ను క్రమం తప్పకుండా ఏ సమస్యా లేకుండా పూర్తి చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఆడొచ్చనదానిపై NCA ఏ క్లారిటీ ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. BGT సమయంలో బుమ్రాకు వెన్నెముక గాయమైంది.