India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్ని రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 11 వరకు అప్లై చేసుకునే వీలుంది. పదోతరగతితో పాటు ITI చేసుండాలి. లేదంటే సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన వాళ్లు అర్హులు. 18-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ప్రారంభ వేతనం నెలకు రూ.19,900 ఉంటుంది. రాత, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
కైలాస్ మానసరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్- ఆగస్టు మధ్య ఉంటుందని కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 50 మంది యాత్రికుల చొప్పున 5, 10 బ్యాచులు ఉంటాయని తెలిపారు. ఉత్తరాఖండ్ లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథులా పాస్ మీదుగా యాత్ర సాగుతుంది. Kmy.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గానే ఉంటుందని పేర్కొంది. కరోనా తర్వాత ఇదే తొలి కైలాస్ మానసరోవర్ యాత్ర.
IPL 2025లో చెన్నై వైఫల్యాలకు మొదటి బాధ్యుడిని తానే అని కోచ్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు. వేలం సమయంలో జట్టు చాలా బలంగా ఉందని.. ఇప్పటికీ అదే భావన కలుగుతోందన్నారు. కానీ గాయాలు, కొందరు ప్లేయర్ల ఫామ్ లేమి జట్టును దెబ్బ తీసిందన్నారు. సక్సెస్ కోసం చాలానే ప్రయోగాలు చేసినా.. ఏదీ వర్కౌట్ కాలేదన్నారు. ఆత్మపరిశీలన చేసుకుంటే ఈ వైఫల్యాలకు మొదటి బాధ్యుడిని తానే అని వ్యాఖ్యానించారు.
తనను పాకిస్థాన్ పంపించొద్దని సీమా హైదర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఆమె 2023లో ఓ భారతీయుడితో ప్రేమలో పడి భారత్‌కు వచ్చి అతడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘నేను పాక్‌కు తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. ప్రధాని మోదీ, సీఎం యోగికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు పాక్ కూతుర్నే అయినా నేడు మాత్రం భారత కోడలిని. నన్ను ఇండియాలోనే ఉండనివ్వండి’ అని ఆమె కోరారు.
AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏసీబీ కోర్టు మే 6 వరకు రిమాండ్ విధించింది. ఆయనతో సహా ఇప్పటివరకు ముగ్గురు నిందితులు ఈ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శ్రీధర్ ఏ6గా ఉన్నారు.
TG: హైదరాబాద్‌లో ఉంటున్న పాకిస్థానీయులపై పోలీసులు నిఘా ఉంచారు. నలుగురిని షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచివెళ్లాలని ఆదేశిస్తూ వారికి నోటీసులు జారీ చేశారు. నగరంలో మొత్తం 213 మంది పాక్ పౌరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హరియాణాలో దారుణం జరిగింది. రోడ్డును శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై ఓ వ్యాను దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై విధులు నిర్వహిస్తుండగా వ్యాను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
AP: జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణం అని TDP నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ‘ఈ లిక్కర్ స్కామ్‌లో ముందుగా బిగ్‌బాస్‌ను జైలుకు పంపాలి. అతడి దురాశ వల్లే నాసిరకం మద్యం తాగి ఎంతో మంది పేదలు మృతిచెందారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుని CBI, EDతో విచారణ జరిపించాలి. ఇది రూ.3,200 కోట్ల స్కామ్ కాదు.. రూ.10వేల కోట్లకు పైనే జరిగింది’ అని ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు.
CSKకి ఒకప్పుడు చెపాక్ స్టేడియం దుర్భేద్యమైన కోటలా ఉండేది. అక్కడికి వెళ్లి ఆ జట్టును కొట్టాలంటే దాదాపు అసాధ్యమేనని ఇతర జట్లు భావించేవి. కానీ ఈ సీజన్‌లో ఆ కోట బీటలు వారింది. ఆ స్టేడియంలో వరసగా 4 మ్యాచులు ఓడటమే కాక 17 ఏళ్లలో తొలిసారి RCB చేతిలో, 15 ఏళ్లలో తొలిసారి ఢిల్లీ చేతిలో, 12 ఏళ్లలో తొలిసారి SRH చేతిలో చెన్నై ఓడిపోయింది. ఇక చెపాక్‌లో అత్యంత తక్కువ స్కోరును KKRపై నమోదు చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి తమ పనేనని చెప్పిన ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF) ఇప్పుడు మాట మార్చింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో మాకు సంబంధం లేదు. భారత్ మా వ్యవస్థల్ని హ్యాక్ చేసి ఆ మెసేజ్ పోస్ట్ చేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు’ అని ఆరోపించింది.
Sorry, no posts matched your criteria.