India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిన్న RCB చేతిలో CSK ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. చెన్నై 6 వికెట్లు కోల్పోయి 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చారు. 16 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సీఎస్కే బ్యాటర్లలో ఆయనదే అత్యధిక స్ట్రైక్ రేట్. ఇలా ఆడే సామర్థ్యం ఉన్న ఆయన జడేజా, అశ్విన్ కంటే ముందు వచ్చి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం కదా అంటూ సీఎస్కే ఫ్యాన్స్ నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
AP: ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. 3 రోజులే అవకాశం ఉండడంతో ఈనెల 30, 31 తేదీల్లోనూ పన్ను వసూళ్ల కౌంటర్లు పనిచేసేలా మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉ.6 నుంచి రా.9 గంటల వరకు కౌంటర్ల వద్ద పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాన్ని మరువకముందే మరో దేశంలో భూమి కంపించింది. అఫ్గాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఇవాళ ఉ.5.16 గంటలకు భూమి కంపించినట్లు తెలిపింది. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్, భారత్, చైనా తదితర దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈవారం 4 సినిమాలు రిలీజవగా వీటి సీక్వెల్స్, ప్రీక్వెల్స్‌ను మేకర్స్ ప్రకటించారు. నిన్న రిలీజైన ‘మ్యాడ్ స్క్వేర్’కు సీక్వెల్ ‘మ్యాడ్ క్యూబ్’ ఉండనుంది. హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాకు సీక్వెల్ ‘బ్రదర్‌హుడ్ ఆఫ్ రాబిన్‌హుడ్’ ఉంటుందని హింట్ ఇచ్చారు. మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’కు కొనసాగింపుగా ‘L3: ది బిగినింగ్’, విక్రమ్ హీరోగా వచ్చిన ‘వీర ధీర శూర’కు ప్రీక్వెల్‌గా పార్ట్-1 రానుంది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి CBSE 12వ తరగతి పరీక్షలు రాయాలంటే 75% హాజరు తప్పనిసరి చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్యవిద్య కోసమే 12వ తరగతి ఎగ్జామ్స్ రాసేందుకు డబ్బులు చెల్లించి నకిలీ పాఠశాలల్లో చేరుతున్నట్లు గుర్తించింది. తనిఖీల సమయంలో స్కూళ్లలో విద్యార్థులు లేకున్నా వారిని పరీక్షకు అనుమతించరు. అలాంటివారు ఓపెన్ స్కూల్‌లో ఎగ్జామ్స్ రాసుకోవాలని CBSE సూచించింది.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. 33 ఇన్నింగ్స్‌లలో 1,084 రన్స్ చేసిన ఆయన, శిఖర్ ధవన్‌ను (1,057) అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (896), దినేశ్ కార్తీక్(727), డేవిడ్ వార్నర్ (696) ఉన్నారు. నిన్న CSKతో మ్యాచులో కోహ్లీ 30 బంతుల్లో 31 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
AP: బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్న నేపథ్యంలో పింఛన్ల డబ్బులను ప్రభుత్వం ఇవాళే బ్యాంకుల్లో జమ చేయనుంది. ఎలాంటి జాప్యం లేకుండా నేడే బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించింది. ఏప్రిల్ 1న సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేస్తారు. కాగా ఈనెల 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది.
భారీ <<15913182>>భూకంపంతో<<>> అతలాకుతలం అయిన మయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. ఆ దేశానికి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపనుంది. ఇందులో ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర సరకులు ఉండనున్నాయి. హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి IAF C-130J ఎయిర్‌క్రాఫ్ట్‌లో వీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
భారత్‌లో WWE లైవ్ ఈవెంట్స్ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ఆ కంపెనీ ప్రెసిడెంట్ నిక్ ఖాన్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా WWE ఎపిసోడ్స్ లైవ్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా నిక్ మాట్లాడుతూ ‘ఇండియాలో క్రికెట్ తర్వాత పాపులర్ స్పోర్ట్ WWE. అందుకే మాకు ఈ దేశ ప్రేక్షకులు ముఖ్యం. చాలా మంది ఒంటరిగా, ఫ్యామిలీతో కలిసి మా షోను చూస్తుంటారు’ అని పేర్కొన్నారు.
TG: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన 25% రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు రాయితీ గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు వరకు గడువును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై సర్కార్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.