India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
☛ లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మే 9న రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
☛ శర్వానంద్-సంపత్ నంది సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్
☛ కార్తీక్ దండు డైరెక్షన్‌లో నాగచైతన్య చేస్తున్న సినిమాకు ‘వృష కర్మ’ టైటిల్ ఖరారు?.. నేడు సా.4.05 గంటలకు మేకర్స్ నుంచి కొత్త అప్‌డేట్
☛ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి సినిమా షూట్ 60 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసిన మూవీ టీమ్
తన పిల్లల ఆపరేషన్ కోసం ఓ పాకిస్థానీ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. పుట్టుక నుంచి పిల్లలు గుండె సమస్యతో బాధ పడుతున్నారని మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు పాకిస్థానీలు భారత్ నుంచి వెళ్లాలని ఆదేశించడంతో ఆపరేషన్ కాకుండానే వెళ్లాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకూ చికిత్స కోసం ₹కోటి ఖర్చైందని, ఆపరేషన్ జరిగేలా చూసి పిల్లల ప్రాణాలు కాపాడాలని అభ్యర్థిస్తున్నాడు.
పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా లండన్‌లోని పాక్ హైకమిషన్ వద్ద భారతీయులు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సమాజం పాక్ విషయంలో స్పందించాలని, ఉగ్రవాదంపై నిలదీయాలని వారు డిమాండ్ చేశారు. ఆ ధర్నాను లండన్ పోలీసులు తాజాగా భగ్నం చేశారు. భారత సంతతి నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు.
కర్రెగుట్ట కాల్పులపై పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హనుమకొండలో అత్యవసరంగా భేటీ అయిన సంఘాలు.. వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశాయి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరాయి. కాగా పూజారికాంకేర్, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. 4 హెలికాప్టర్లతో గుట్టపై కాల్పులు జరుపుతున్నాయి. ఇందులో భారీగా మావోయిస్టులు హతమైనట్లు వార్తలొస్తున్నాయి.
SRH బౌలర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించారు. IPLలో అత్యధికసార్లు(4) ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. 2014లో ఢిల్లీ తరఫున ఆడిన అతను జాక్వెస్ కల్లిస్(KKR)ను, 2022లో గుజరాత్ తరఫున కేఎల్ రాహుల్(LSG)ను, 2023లో ఫిల్ సాల్ట్(DC)ను, నిన్న రషీద్(CSK)ను ఇలా ఔట్ చేశారు. ఉమేశ్, బౌల్ట్, ప్రవీణ్ కుమార్, మలింగ, భువనేశ్వర్, అశోక్ దిండా గతంలో మూడుసార్లు తొలి బంతికే వికెట్ తీశారు.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఆగిపోలేదని, వచ్చే ఏడాది దీని కోసం పవన్ డేట్స్ కేటాయిస్తారని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ఆయన రూ.170కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్మాతల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
KKR రూ.23.75 కోట్లు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ ఈ ఏడాది IPLలో 8 మ్యాచులాడి 135 పరుగులు చేశారు. ఆ వేలం ధరే అతడిపై ఒత్తిడిని పెంచుతుండొచ్చని మాజీ క్రికెటర్ RP సింగ్ అభిప్రాయపడ్డారు. ‘అంత ధర పెట్టి ఆటగాడిని కొన్నారంటే అతడే మెయిన్ ప్లేయర్ అనో లేక కాబోయే కెప్టెన్ అనో జట్టు నమ్ముతున్నట్లే. కానీ వెంకీ ఆ రెండూ కాలేకపోయారు. వేలంలో కేకేఆర్ ఘోరంగా విఫలమైందనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించారు. ఇటువంటి ఘటనలు ఏటా జరుగుతున్నాయి. ఇది జోక్ కాదు టెర్రరిజాన్ని సహించేది లేదని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా 2013లో చివరిసారిగా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడిన భారత్ ఐసీసీ టోర్నీల్లో హైబ్రిడ్ మోడల్‌లో తటస్థ వేదికలలో మ్యాచులు ఆడుతోంది.
భారత ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ కరాచీ సమీపంలోకి చేరుకున్న నేపథ్యంలో పాక్ పరోక్ష హెచ్చరికలు చేసింది. అరేబియా సముద్రంలో ఈరోజు, రేపు తమ నౌకాదళం విన్యాసాలు చేయనుందని, వీటిలో క్షిపణి పరీక్షలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ సమయంలో నౌకలు, విమానాలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని ఓ నోటిఫికేషన్లో తెలిపింది. అటు ఏ మిషన్‌కైనా నౌకలు సిద్ధంగా ఉన్నాయంటూ భారత నేవీ పోస్ట్ వేయడం గమనార్హం.
AP: వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా పోటెత్తారు. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి. దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు సమాచారం. నిన్న 64,536 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చింది.
Sorry, no posts matched your criteria.