News May 7, 2025

ఇవాళ బంగారం ధరలు ఎంతంటే?

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధరలు రూ.30 చొప్పున తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.98,210 ఉండగా, 22 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.90,020గా ఉంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ.1,10,900గా ఉంది.

News May 7, 2025

న్యాయమూర్తిని అరెస్టు చేసిన FBI!

image

అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఏకంగా ఓ న్యాయమూర్తినే తాజాగా అరెస్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారుడికి మిల్‌వాకీలోని సీనియర్ సిటింగ్ జడ్జి హన్నా దుగన్ అండగా నిలిచినట్లు ఆరోపణలున్నాయి. స్వయంగా కోర్టులోనే అధికారుల్ని ఆమె తప్పుదోవ పట్టించి వలసదారుడు తప్పించుకునేందుకు సహకరించడంతో FBI ఆమెను, వలసదారుడిని అరెస్ట్ చేసింది.

News May 7, 2025

నోటిఫికేషన్ విడుదల

image

ఇండియన్ మిలిటరీ అకాడమీలో JAN 2026న ప్రారంభమయ్యే 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 30 నుంచి మే 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ పూర్తయిన వారు, ఫైనలియర్ చదువుతున్న వారు అర్హులు. అవివాహితులై, వయసు 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. 2 టెస్టులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

News May 7, 2025

ఎన్నికల గాంధీ దారితప్పి వస్తున్నారు: కవిత

image

HYDలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఇవాళ నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా BRS MLC కవిత ఆయనపై సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘దారితప్పి వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం. అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను ముంచారు. మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంటి? మీ సీఎం మానవ హక్కులను మంటకలుపుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? లాఠీ దెబ్బలు తిన్న HCU విద్యార్థులను పరామర్శించండి’ అని పేర్కొన్నారు.

News May 7, 2025

RCBలాగే మేమూ ప్లేఆఫ్స్ చేరుతాం: నితీశ్

image

IPL 2025: SRH ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందని ఆ జట్టు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘గతేడాది RCB వరుసగా 7 మ్యాచులు గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈసారి మేమూ అలాగే చేరుకుంటాం. ఇందుకోసం 100% ప్రయత్నిస్తాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నారు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో SRH ఎనిమిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగతా 5 మ్యాచులు గెలవడంతో పాటు మెరుగైన NRR కలిగి ఉండాలి.

News May 7, 2025

ఉత్తర కొరియా వద్ద 5 వేల టన్నుల ‘డెస్ట్రాయర్’ నౌక!

image

నౌకదళ సంపత్తి పరంగా ఉత్తర కొరియా మరింత బలోపేతమైంది. 5వేల టన్నుల బరువైన ‘మల్టీపర్పస్ డెస్ట్రాయర్’ నౌకను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా ప్రారంభించారు. దేశ అధికారిక మీడియా KNCA ప్రకారం.. అది చో హ్యోన్ క్లాస్‌కు చెందిన అత్యాధునిక నౌక. దాన్ని 400 రోజుల్లోనే ప్యాంగ్యాంగ్ నిర్మించింది. పలు రకాలైన క్షిపణుల్ని మోసుకెళ్లే సామర్థ్యం దానికి ఉంది.

News May 7, 2025

భారత్‌తో కయ్యం.. పాకిస్థాన్‌కు నష్టం ఎంతంటే?

image

పాకిస్థాన్ తమ గగనతలాన్ని మూసేసింది. ఈ చర్యతో పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది. పాక్ గగనతలాన్ని వాడుకున్నందుకు భారత్ డబ్బు చెల్లిస్తుంది. ఇలాగే 2019లో 140 రోజులు గగనతలాన్ని మూసేయడం వల్ల పాక్ 100 మిలియన్ డాలర్లు నష్టపోయిందట. ఇప్పుడూ అన్ని రోజులు మూసేస్తే.. 120-160 మి. డాలర్లు నష్టపోయే అవకాశం ఉంది. పంతానికి పోతే చావు దెబ్బ తగిలేది పాకిస్థాన్‌కే అని విశ్లేషకులు చెబుతున్నారు.

News May 7, 2025

నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షం!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఉత్తర, మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్న సమయంలో వర్షాలు పడతాయని, రాత్రిపూట ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే ఛాన్సుందని తెలిపారు. హైదరాబాద్‌లోనూ సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షం పడొచ్చని పేర్కొన్నారు.

News May 7, 2025

చెపాక్‌లో చెన్నై చెత్త రికార్డు

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో CSK ఓటముల పరంపర కొనసాగిస్తోంది. ఆఖరికి హోంగ్రౌండు చెపాక్‌లోనూ అదృష్టం కలిసిరావట్లేదు. IPL హిస్టరీలో తొలిసారి ఆ జట్టు వరుసగా నాలుగు హోం మ్యాచ్‌లలో ఓడింది. మార్చి 28న RCB, ఏప్రిల్ 5న డీసీ, 11న కేకేఆర్, నిన్న SRH చేతిలో పరాజయం పాలైంది. 2008, 2012లోనూ నాలుగు మ్యాచ్‌లు ఓడినప్పటికీ వరసగా కాదు. ఇక చెపాక్‌లో SRHకు ఇదే తొలి విజయం. గతంలో అక్కడ వరుసగా 5 మ్యాచ్‌లు ఓడింది.

News May 7, 2025

పాకిస్థాన్‌కు బిగుస్తున్న ఉచ్చు!

image

పహల్గామ్ ఉగ్రదాడిని UN సెక్యూరిటీ కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. దాడికి పాల్పడిన, దీన్ని వెనుక ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా కృషి చేయాలని కోరింది. ఉగ్రవాదం ప్రపంచ శాంతి, భద్రతలకు అడ్డంకి అని పునరుద్ఘాటించింది. ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా.. వారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నీ దేశాలను డిమాండ్ చేసింది.