News May 7, 2025

మద్యం కుంభకోణంలో సజ్జల బంధువు అరెస్ట్

image

AP: మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. కుంభకోణం కేసులో ఏ-6గా ఉన్న సజ్జల శ్రీధర్‌ రెడ్డిని ఈరోజు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించింది. నేడు ఏసీబీ కోర్టులో శ్రీధర్‌ను హాజరుపరచనుంది. వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువైన శ్రీధర్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కి యజమానిగా ఉన్నారు.

News May 7, 2025

ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలి: పాక్

image

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘అంతర్జాతీయ దర్యాప్తుకు సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంది. ఆ దాడిలో మా పాత్ర ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడిని భారత్ వాడుకుంటోంది. ఆధారాల్లేకుండా, దర్యాప్తు చేయకుండానే పాక్‌ను శిక్షించాలని చూస్తోంది’ అని ఆరోపించారు.

News May 7, 2025

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

image

TG: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తికాగా, తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం నుంచి బయటకు వచ్చాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా, ఇప్పటివరకు రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరగగా, 8 మంది అందులో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

News May 7, 2025

అమర్‌నాథ్ యాత్రను విజయవంతంగా నిర్వహిస్తాం: కేంద్రమంత్రి

image

జులైలో జరిగే అమర్‌నాథ్ యాత్రను విజయవంతంగా నిర్వహిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌‌ని అభివృద్ధి మార్గం నుంచి ఎవరూ దూరం చేయలేరని, అక్కడ పర్యాటక రంగాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. కాగా జులై 3న ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 9న రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. ఈ యాత్రకు భక్తులు పహల్గామ్, బల్తాల్ మార్గాల గుండా ప్రయాణిస్తారు.

News May 7, 2025

51 వేల మంది యువతకు నియామక పత్రాలు

image

కేంద్ర ప్రభుత్వ శాఖలలో నూతనంగా నియమితులైన 51వేల మంది యువతకు ప్రధానమంత్రి నేడు నియామక పత్రాలు అందజేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా నూతన ఉద్యోగులనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. 15వ ‘రోజ్ గార్ మేళా’ దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో జరగనుంది.

News May 7, 2025

CSK ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

image

IPL: ఓటములు(7), నెట్ రన్ రేటు(-1.302) ప్రకారం CSK ప్లేఆఫ్స్‌కు వెళ్లడం అసాధ్యం. ఏదైనా మిరాకిల్ జరిగితే గ్రూప్ స్టేజ్ దాటొచ్చు. చెన్నై తర్వాతి 5 మ్యాచ్‌లనూ(vsPBKS, RCB, KKR, RR, GT) భారీ మార్జిన్లతో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. 3 టీమ్‌లు మినహా మరే జట్టుకూ 14 పాయింట్లు రాకపోతే ఛాన్స్ ఉంటుంది. 2024లో 4 టీమ్స్‌‌(CSK, DC, LSG, RCB)కు 14 పాయింట్లు రాగా NRRను బట్టి RCB ప్లేఆఫ్స్‌‌కు వెళ్లింది.

News May 7, 2025

ఇరిగేషన్ మాజీ ENC ఇంటిపై ACB సోదాలు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో కీలకపాత్ర పోషించిన ఇరిగేషన్ మాజీ ENC హరి రామ్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఏకకాలంలో 14 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లో లోపాలు ఉన్నాయని నిన్న NDSA ఫైనల్ రిపోర్టులో వెల్లడించిన విషయం తెలిసిందే.

News May 7, 2025

సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు

image

భారత్- పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్‌ వెంబడి అన్నీ పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు సమాచారం. నిన్న రాత్రి సమయంలో పాక్ కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ దీటుగా సమాధానమిచ్చిందట. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

News May 7, 2025

ముందే విడుదల కానున్న ‘మిషన్ ఇంపాజిబుల్’!

image

‘మిషన్ ఇంపాజిబుల్- ది ఫైనల్ రెకనింగ్’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల 23న విడుదల కావాల్సిన మూవీని భారత్‌లో 17నే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. టామ్ క్రూజ్ గూఢచారి పాత్రలో కనిపించే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ సిరీస్‌లో ‘ది ఫైనల్ రెకనింగ్’ ఆఖరిది కావడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి.

News May 7, 2025

నాన్నకు ఏమైందని కొడుకు అడుగుతున్నాడు.. జవాన్ భార్య ఆవేదన

image

పొరపాటున <<16202708>>సరిహద్దు దాటిన BSF జవాన్<<>> పూర్ణం సాహును పాకిస్థాన్ బంధించింది. దీంతో అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నాన్నకు ఏమైందని ఏడేళ్ల కొడుకు అడుగుతున్నాడని, ఏం చెప్పాలో అర్థం కావట్లేదని భార్య రజని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియట్లేదని తండ్రి భోల్‌నాథ్ రోదిస్తున్నారు. బతికున్నాడా? లేదా? ఎప్పుడు తిరిగొస్తాడు? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.