India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కస్టమర్లకు LIC శుభవార్త చెప్పింది. హౌసింగ్ లోన్ రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో గృహ రుణ రేటు ఈ నెల 28 నుంచి 8 శాతం వద్ద ప్రారంభమవుతుంది. కొత్తగా రుణం తీసుకున్న, తీసుకోబోతున్న వారికీ ఈ లబ్ధి చేకూరుతుందని సంస్థ వెల్లడించింది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించడంతో ఆ మేర కుదించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి.
TG: ఇంటర్ ఫస్టియర్ పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలన్న ఇంటర్ బోర్డు ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వార్షిక పరీక్షను 80 మార్కులకు కుదించి, 20 ఇంటర్నల్ మార్కులను ఇవ్వాలని బోర్డు భావించింది. ఇందుకోసం పాఠ్యాంశాలనూ సవరించింది. దీనిని అమలు చేసేందుకు అనుమతి కోరగా ప్రభుత్వం రిజెక్ట్ చేసింది.
పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో బెంగాల్‌కు చెందిన స్కూల్ టీచర్ సబీర్ హుస్సేన్ ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ‘కశ్మీర్‌లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేను. మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోంది. అందుకే ఇస్లాంను త్యజిస్తున్నా. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో స్వేచ్ఛ ఉంటుంది’ అని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో 40-44 డిగ్రీల ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. TGలో 2 రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో <
* మధ్యాహ్నం వేళ్లలో బయటికి వెళ్లకపోవడం మంచిది.

పాక్ గగనతలం మీదుగా భారత విమానాలు ఎగరడం నిషేధించడంతో విమాన టికెట్ ధరలు 8-12 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి యూరప్, నార్త్ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలు ఇకపై అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో అదనపు ఇంధన ఖర్చుల దృష్ట్యా ప్రయాణికులపై ధరల భారం పడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయాణ సమయం 2 నుంచి 3గంటల వరకూ పెరగనుంది.

బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబోలో రూపొందుతోన్న అఖండ-2 షూటింగ్ త్వరలో జార్జియాలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం డైరెక్టర్ లొకేషన్లను పరిశీలిస్తున్నారు. జార్జియా షెడ్యూల్‌లో బాలయ్యతోపాటు ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావించగా అనివార్య కారణాలతో సంక్రాంతికి వాయిదా పడినట్లు సమాచారం.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో భద్రతాబలగాల ‘ఆపరేషన్ కగార్’ కొనసాగుతోంది. మావోయిస్టుల అగ్రనేతృత్వమంతా కర్రెగుట్టలోనే ఉందన్న వార్తల నేపథ్యంలో వేలాది బలగాలు కొండల్ని దిగ్బంధించాయి. ఈ ఆపరేషన్‌ను ఆపాలని మావోయిస్టులు లేఖ విడుదల చేసినా కేంద్రం స్పందించకపోవడం గమనార్హం. అటు మానవహక్కుల సంఘాలు కూడా ఆపరేషన్‌ను ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి నేటితో వందేళ్లు. ఎన్నో పోరాటాల కారణంగా 1926 ఏప్రిల్ 26న తొలుత విజయవాడలో ఇది ఏర్పాటైంది. 1930లో దీన్ని విశాఖకు తరలించారు. 450 ఎకరాల్లో కొనసాగుతోన్న వర్సిటీలో 59 దేశాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు సహా దాదాపు 20వేల మంది(అనుబంధ కాలేజీలతో కలిపి) విద్యనభ్యసిస్తున్నారు. సీవీ రామన్, సీఆర్ రావు, వెంకయ్య, చలమేశ్వర్, గ్రంథి మల్లికార్జునరావు తదితరులు ఇక్కడే చదివారు.
Sorry, no posts matched your criteria.