News September 7, 2025

కాంగ్రెస్ పాలనలో దీనస్థితికి గురుకులాలు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ పాలనలో గురుకులాలు దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు Xలో రాసుకొచ్చారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఫుడ్ పాయిజన్‌ వంటి ఘటనలతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల జీతాలు ఇవ్వలేదని ఫైరయ్యారు. KCR హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ పాలనలో నరక కూపాలుగా మారాయని దుయ్యబట్టారు.

News September 7, 2025

ఎట్టకేలకు మణిపుర్‌కు ప్రధాని మోదీ?

image

ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెల 13 లేదా 14న ఆయన అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది. పీఎం పర్యటనకు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మణిపుర్ అల్లర్లు చెలరేగినప్పటి నుంచి మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. దీంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News September 7, 2025

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

image

AP: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. లాయర్ వృత్తిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 42 ఏళ్లకు మించకూడదు. జీతం రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి <>slprb.ap.gov.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 7, 2025

ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా: సెహ్వాగ్

image

టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఆసియా కప్‌కు ముందు పాక్‌తో తలపడిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ‘ఎప్పుడు పాక్‌పై మ్యాచ్ ఓడినా నేను నా టెంపర్‌మెంట్ కోల్పోతాను. 2008 కరాచీలో జరిగిన మ్యాచ్‌లో 300 రన్స్ ఛేజ్ చేయాలి. ఆరోజు నేను ఉపవాసంలో ఉన్నా. నా ఆకలి తీరాలంటే రన్స్ చేయాలనుకున్నా’ అని చెప్పుకొచ్చారు. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 95 బంతుల్లో 119 రన్స్ చేశారు. టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

News September 7, 2025

రాష్ట్రంలో మరో వారంపాటు వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో వారంపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 8 నుంచి 14 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది.

News September 7, 2025

భారత-A జట్టులో కోహ్లీ, రోహిత్?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత-ఏ జట్టులో ఆడతారని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే అనధికార మూడు వన్డేల సిరీస్‌లో వీరిని ఆడించాలని BCCI నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్. కాగా కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే దేశవాళీ మ్యాచులు ఆడాల్సిందేనని బీసీసీఐ రూల్ పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News September 7, 2025

జపాన్ పీఎం ఇషిబా రాజీనామా?

image

జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయనున్నారు. అధికార LDPలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK తెలిపింది. దీనిపై ఇవాళ సాయంత్రం 6 గంటలకు PM ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని పేర్కొంది. జులైలో జరిగిన హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ (అప్పర్ హౌస్) ఎన్నికల్లో LDP, మిత్రపక్షం కొమైటో మెజారిటీ కోల్పోయింది. దీంతో ఆయనపై వ్యతిరేకత పెరిగింది.

News September 7, 2025

హెల్త్ టిప్స్

image

*బీట్ రూట్ తింటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది
*జామ పండ్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*క్యారెట్లు కంటి చూపు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి
*కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ వెంట్రుకలకు మేలు చేస్తాయి
*పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది
*కరివేపాకుతో రక్తహీనత తగ్గుతుంది
*అల్లంతో కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి.
SHARE IT

News September 7, 2025

ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత: బొత్స

image

AP: యూరియా కొరతపై ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి వల్లే ఈ సమస్య వచ్చిందని ఫైరయ్యారు. అటు ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు నిధులు విడుదల కాకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదని ఆరోపించారు.

News September 7, 2025

తెలుగు అబ్బాయికి రూ.5 కోట్ల ప్యాకేజీ!

image

AP: అనంతపురం (D) గుంతకల్లుకు చెందిన సాయి సాకేత్ అమెరికాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం సాధించారు. తొలుత 10 వారాల పాటు ఇంటర్న్‌షిప్ కోసం రూ.కోటి ఆఫర్ చేసినట్లు అతడి పేరెంట్స్ రమేశ్, వాసవి తెలిపారు. అది పూర్తయ్యాక పెర్ఫార్మెన్స్‌ను బట్టి ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని చెప్పారు. వీరు పదేళ్ల క్రితం USకు వెళ్లి సెటిల్ అయ్యారు. సాకేత్ ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు.