News May 7, 2025

27న మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్

image

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి ఈ నెల 27న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 – 12 గంటల వరకు 6వ తరగతి, మధ్యాహ్నం 2 – 4గంటల వరకు 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఉంటుందని మోడల్ స్కూళ్ల డైరెక్టర్ శ్రీనివాసచారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 40,332 మంది దరఖాస్తు చేసుకున్నారని, హాల్ టికెట్లు ఇప్పటికే విడుదల అయ్యాయని ఆయన వివరించారు.

News May 7, 2025

ఏప్రిల్ 26: చరిత్రలో ఈరోజు

image

✒ 1762: కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్యామశాస్త్రి జననం
✒ 1920: భారతీయ గణితవేత్త శ్రీనివాస రామానుజన్ మరణం(ఫొటోలో)
✒ 1931: ప్రఖ్యాత వాస్తుశిల్పి గణపతి స్థపతి జననం
✒ 1942: ప్రముఖ కథా రచయిత కాకాని చక్రపాణి జననం
✒ 1973: నటుడు సముద్ర ఖని జననం
✒ 1986: చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం
✒ ఇవాళ ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం

News May 7, 2025

సివిల్స్ ర్యాంకర్ల మార్కులు ఇవే

image

ఇటీవల సివిల్స్-2024 అభ్యర్థుల ర్యాంకులను విడుదల చేసిన UPSC తాజాగా వారు సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచింది. సివిల్స్ మెయిన్స్‌కు 1,750, ఇంటర్వ్యూకు 275 మార్కులు(మొత్తం 2,025) ఉంటాయి. టాప్-5 ర్యాంకర్ల మార్కులు ఇలా.. 1. శక్తి దూబే- 1,043; 2. హర్షిత గోయల్- 1,038 3. డోంగ్రే అర్చిత్ పరాగ్- 1,038 4. షా మార్గి చిరాగ్- 1,035 5. ఆకాశ్ గార్గ్- 1,032

News May 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 7, 2025

2 నెలల ‘ఉర్సా’కు రూ.99 పైసలకే భూమి కేటాయింపా?: వైసీపీ

image

AP: కేవలం 2 నెలల కిందట పుట్టిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీఎం చంద్రబాబుకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని వైసీపీ ప్రశ్నించింది. ‘ఆ కంపెనీకి సరైన ఆఫీస్ లేదు. చెప్పుకోదగ్గ సిబ్బంది లేరు. కనీసం ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ కూడా లేదు. గతంలో పెద్ద పనులూ చేయలేదు. అలాంటి సంస్థకు విశాఖలో రూ.3వేల కోట్ల విలువైన 60 ఎకరాలను ఎలా ఇస్తారు? అది కూడా ఎకరం కేవలం రూ.99 పైసలకే’ అని Xలో నిలదీసింది.

News May 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 7, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 26, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.38 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.53 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.35 గంటలకు
✒ ఇష: రాత్రి 7.51 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 7, 2025

శుభ సమయం(26-04-2025) శనివారం

image

✒ తిథి: బహుళ త్రయోదశి ఉ.6.11 వరకు
✒ నక్షత్రం: రేవతి తె.జా.3.47 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేదు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: మ.3.33-సా.5.03 వరకు
✒ అమృత ఘడియలు: రా.12.32-2.02 వరకు

News May 7, 2025

ఈనాటి ముఖ్యాంశాలు

image

* మోదీజీ POKను హిందూస్థాన్‌లో కలిపేయండి: సీఎం రేవంత్
* రాయలసీమ అభివృద్ధిపై PMతో చంద్రబాబు ప్రత్యేక చర్చ
* మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేస్తున్నారు: KTR
* పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. అమిత్ షా
* అవును.. ఉగ్రవాదుల్ని పెంచి పోషించాం: పాక్ రక్షణ మంత్రి
* కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ
* ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్(84) కన్నుమూత
* ఐపీఎల్‌లో CSKపై SRH విజయం

News May 7, 2025

చెపాక్‌లో చెన్నైకి చెక్ పెట్టిన SRH

image

చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి SRH అదరగొట్టింది. చెపాక్ స్టేడియంలో CSKపై తొలిసారి గెలిచింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 0, హెడ్ 19, ఇషాన్ 44, క్లాసెన్ 7, అనికేత్ 19, కమిందు 32*, నితీశ్ 19* రన్స్ చేశారు. నూర్ అహ్మద్ 2, ఖలీల్, కాంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను ఆరెంజ్ ఆర్మీ సజీవంగా ఉంచుకోగా, చెన్నై దాదాపుగా ఔటైంది.