India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వేళ యుద్ధం జరిగితే ముస్లిం దేశాలు ఎవరికి మద్దతిస్తాయనే చర్చ జరుగుతోంది. ముస్లింలు ఎక్కువగా ఉండే సౌదీ అరేబియా కచ్చితంగా భారత్ వైపే నిలుస్తుంది. UAE, ఇండోనేషియా, ఈజిప్టు కూడా భారత్‌కు నమ్మకమైన దేశాలు. బంగ్లాదేశ్, టర్కీ, ఖతర్ మాత్రం తటస్థంగా ఉండొచ్చు. ఇక అఫ్గానిస్థాన్ మాత్రం పాక్‌కు మద్దతు తెలిపే ఛాన్సే లేదు.
పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైసరన్ లోయకు టూరిస్టులను గుర్రాలపై తీసుకెళ్లే అయాజ్ అహ్మద్ అనే వ్యక్తిని జమ్మూకశ్మీర్‌లోని గందర్బాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఓ మహిళా టూరిస్టును మతం గురించి ఆరా తీసినట్లు పోలీసులకు తెలియడంతో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు, ఇతను టూరిస్టుల రాక గురించి ఉగ్రవాదులకు సమాచారం చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిని సూపర్ స్టార్ రజినీకాంత్ ఖండించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని శత్రువులు చూసి సహించలేకపోయారని వ్యాఖ్యానించారు. అందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడికి ఒడిగట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఉగ్రదాడి కారకులకు గుణపాఠం చెప్పాలని కోరారు.
IPL: SRHతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో CSK కెప్టెన్ ధోనీ అరుదైన మైలురాయికి చేరుకున్నారు. టీ20ల్లో 400 మ్యాచులు ఆడిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచారు. ఈ లిస్టులో ధోనీ కంటే ముందు రోహిత్(456), దినేశ్ కార్తీక్(412), కోహ్లీ(408) ఉన్నారు. ధోనీ తన టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 7572 పరుగులు చేయగా, అందులో 28 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 84*.
AP: రాష్ట్రంలో ఇంకా వైసీపీ అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా <<16215262>>పోలీస్<<>> అధికారి ఉన్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్నచూపా అని నిలదీశారు. అయినా క్రమశిక్షణతో భరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ పవన్ పిఠాపురం పర్యటనలో వర్మ ఎస్పీ బిందు మాధవ్ వద్ద అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఉద్దేశించే వర్మ ట్వీట్ చేసినట్లు సమాచారం.
స్టార్ హీరో ప్రభాస్ తన దృష్టిలో నార్మల్ యాక్టర్ అని, లెజెండ్ కాదని నటుడు మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేశారు. అతను లెజెండ్ కావడానికి టైం పడుతుందన్నారు. ఇదే సమయంలో మోహన్‌లాల్ లెజెండరీ యాక్టర్ అని, కాలం ఆయనకు ఆ హోదా తెచ్చిందన్నారు. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు ఆయన్ను తప్పకుండా లెజెండ్‌ను చేస్తాయనే నమ్మకం తనకుందని విష్ణు చెప్పారు. ‘కన్నప్ప’లో ప్రభాస్, విష్ణు నటించిన విషయం తెలిసిందే.
ఖాతాదారులు తమ PF అకౌంట్లను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలుగా EPFO కీలక నిర్ణయం తీసుకుంది. రివాంప్డ్ 13 సాఫ్ట్‌వేర్ ఫంక్షనాలిటీని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. అంటే గతంలో లాగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే రెండు కంపెనీలూ ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు. పాత కంపెనీ ఆమోదం తెలపగానే ఆటోమేటిక్‌గా ప్రస్తుత కంపెనీ ఖాతాకు బదిలీ అవుతుందని స్పష్టం చేసింది.
TG: సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్- రాహుల్ ట్యాక్స్ వసూలవుతోందని, ఢిల్లీకి డబ్బుల సంచులు వెళ్తున్నాయని ఆరోపించారు. 100 శాతం రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.40వేల కోట్లు అప్పు చేస్తే, రేవంత్ ఒక్క ఏడాదిలోనే రూ.1.60లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు.
TG: కాంగ్రెస్ హయాంలో ఆరోపణలు తప్ప ఆధారాలున్నాయా? అని KTR ప్రశ్నించారు. ‘17నెలల్లో కొత్తగా ఒక్క ప్రాజెక్టైనా కట్టారా? హామీలు అమలు చేయకుండా మాపై విమర్శలా? TGకు విఘాతం కల్గితే స్పందించే వ్యక్తి KCR. అవసరమైతే రాష్ట్రం కోసం ఆయన గర్జించేవారు. కేంద్రం పంపిన ఒక దూత <<16212293>>NDSA<<>>. NDSA నిపుణులు ఇప్పటి వరకూ ప్రాజెక్టును చూడలేదు. బిహార్‌లో బ్రిడ్జిలు కూలుతుంటే NDSA ఏమైంది’ అని KTR ప్రశ్నించారు.
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించనున్నారని, విలన్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అలాగే అతిథి పాత్రలో దగ్గుబాటి వెంకటేశ్ కూడా మెరుస్తారని టాక్. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
Sorry, no posts matched your criteria.