News May 7, 2025

ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు పోనివ్వం: కేంద్రమంత్రి

image

సింధు నదీజలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్థాన్‌కు పోనివ్వమని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటిల్ స్పష్టం చేశారు. అమిత్‌షాతో జరిగిన భేటీలో రోడ్ మ్యాప్ తయారు చేసినట్లు తెలిపారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సింధు జలాలను మళ్లించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే సింధు, దాని ఉపనదులపై ఉన్న డ్యాం గేట్లను మూసివేశారు.

News May 7, 2025

రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు

image

AP: ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. అలాగే రాష్ట్రంలో 169 ప్రాంతాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా గాజులపల్లె, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేపు రాష్ట్రంలోని 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది.

News May 7, 2025

ఉగ్రమూక వేటలో భారత్‌కు మద్దతు: తులసీ గబ్బార్డ్

image

పహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఖండించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రధాని మోదీ, భారతీయులకు అమెరికా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 26 మంది హిందువులను చంపిన టెర్రరిస్టులను వేటాడేందుకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని వెల్లడించారు.

News May 7, 2025

రాయలసీమ అభివృద్ధిపై PMతో చంద్రబాబు ప్రత్యేక చర్చ

image

AP: PM మోదీతో ఢిల్లీలో గంటన్నర పాటు భేటీ అయిన CM చంద్రబాబు ప్రత్యేకంగా రాయలసీమ అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తోంది. సీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరినట్లు సమాచారం. అలాగే, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడర్ల ఏర్పాటుకూ సహకారం కోరినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇదే సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలనూ ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

News May 7, 2025

ఆర్మీ నర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్.. పాకిస్థానీల పనేనా?

image

పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ నర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య రెచ్చగొట్టే నినాదాలతో ఓ ఇమేజ్ పోస్ట్ చేశారు. హ్యాకర్ల బృందం తమను ‘టీమ్ ఇన్‌సేన్ పీకే’ అంటూ రాసుకుంది. దీనిని పరిష్కరించేందుకు భారత సైన్యం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను సంప్రదించింది.

News May 7, 2025

IPL: APR 25 అంటే CSKకు పండగే..!

image

ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో SRHతో CSK తలపడనుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ధోనీ సారథ్యంలో ఏప్రిల్ 25న జరిగిన మ్యాచుల్లో సీఎస్కే ఓటమే ఎరుగలేదు. ఇదే తేదీల్లో ఆ జట్టు 7 మ్యాచులాడి అన్నింట్లోనూ గెలిచింది. 2010-MI, 2011-PWI, 2013-SRH, 2014-MI, 2015-PBKS, 2018-RCB, 2021లో RCBపై గెలుపొందింది. ఇందులో ఓ ఫైనల్ మ్యాచ్ కూడా ఉండటం విశేషం. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News May 7, 2025

ఇంటర్‌లో తెలుగుకు బదులు సంస్కృతం?.. బోర్డు క్లారిటీ

image

TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజీగా తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం ప్రవేశపెడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. 10 సంస్కృత లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం వివరాలు తెలుసుకునేందుకే అంతర్గత మెమో జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తెలుగు పట్ల ఇంటర్మీడియట్ విద్యా శాఖకు గౌరవం, అభిమానం ఉన్నాయని స్పష్టం చేశారు.

News May 7, 2025

సమాజానికి సేవ చేస్తే ఆ ఆనందమే వేరు: తమన్

image

సమాజానికి సేవ చేస్తే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన తలసేమియా సెంటర్ ప్రారంభించారు. ‘నారా భువనేశ్వరి చేసే మంచి పనులకు నేనెప్పుడూ అండగా ఉంటా. తలసేమియా రోగుల కోసం బ్లడ్ డొనేట్ చేయాలని ప్రచారం చేస్తా. జనాలకు మనం ఎంతో కొంత తిరిగిస్తేనే సంతోషం’ అని ఆయన పేర్కొన్నారు.

News May 7, 2025

చైనా కాదు.. US iPhones భారత్ నుంచే?

image

US-చైనా వాణిజ్య సంబంధాలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. US తమకు సంబంధించిన అన్నీ iPhone మోడల్స్ అసెంబ్లీ యూనిట్స్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 2026 మొదటికల్లా ఈ పని పూర్తవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే INDలో తమిళనాడు శ్రీపెరుంబుదూర్, కర్ణాటక బెంగళూరులోని Foxconn ప్లాంట్లలో ఐఫోన్స్ తయారవుతున్నాయి.

News May 7, 2025

LoC అంటే ఏంటి?

image

LoC అంటే జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ ప్రాంతాల్లో ఇండియా- పాక్ ఆర్మీలను వేరు చేసే నియంత్రణ రేఖ. 1972 సిమ్లా ఒప్పందం తర్వాత ఇరు దేశాల సమ్మతితో LoC అమలులోకి వచ్చింది. మొదట 1947 యుద్ధం ముగిశాక 1949లో CeaseFire Line(CFL) అని ఉండేది. ఆ ఒప్పందాన్ని మీరి పాక్ 1965, 1971లో భారత్‌పై యుద్ధం చేసింది. ఆ తర్వాత జులై 2, 1972లో ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో సిమ్లాలో ఒప్పందం మీద సంతకం చేసి తీసుకొచ్చిందే ఈ LoC.