India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాకిస్థానీలను వెనక్కి పంపాలన్న కేంద్ర హోంమంత్రి <<16211349>>అమిత్ షా<<>> ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే ఇండియాను వీడాలని స్పష్టం చేశారు. ఈ నెల 27న వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, HYDలో 200 మంది పాకిస్థానీలు ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొని, ఇరు దేశాలు ఆంక్షలు విధించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అట్టారీ- వాఘా బార్డర్ ద్వారా 188మంది పాకిస్థాన్ ప్రజలు ఆ దేశానికి వెళ్లారు. పాక్‌లోని 286 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారు. పహల్‌గామ్ ఉగ్రదాడి వేళ పాకిస్థాన్ దేశస్థులను భారత్ నుంచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా, ఆపై పాక్ కూడా ఇవే ఆంక్షలను భారతీయులపై విధించింది.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద మావోయిస్టులు దిగొచ్చినట్లు తెలుస్తోంది. సైనిక ఆపరేషన్ వెంటనే ఆపేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు రావాలని బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేశ్ పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. ఈ లేఖపై పోలీసులు ఇంకా స్పందించలేదు. ప్రభుత్వాలు సైతం శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు మావోయిస్టులు మరణించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మే 2న జరగబోయే అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అమరావతి నిర్మాణానికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్ర పరిస్థితులతో పాటు.. పహల్గామ్ ఉగ్రదాడి గురించి కూడా ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన అమ్మతనం అనుభవాలను ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ‘ఇజాన్ పుట్టిన తర్వాత 3 నెలలే పాలిచ్చా. కొడుక్కి పాలిచ్చే క్రమంలో శారీరకంగా, మానసికంగా కుంగిపోయా. ఆ సమయంలోనే ఆటపరంగా, ఇతర పనులు, నిద్రలేమి సమస్యలు ఎదురయ్యాయి. అప్పుడు నాకు బ్రెస్ట్ ఫీడింగ్ కష్టమనిపించింది. ఆ తర్వాత నా శరీరం ఆటకు సహకరించకపోవడంతో రిటైర్మెంట్ పలికా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
AP: విడదల రజినిపై ముందస్తు చర్యలు తీసుకోవద్దని, ఇదే సమయంలో 41A నోటీసులిచ్చి విచారించాలని ACBని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని, కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని రజినికి సూచించింది. శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారంటూ రజినిపై కేసు నమోదు కాగా, ఆమె A1గా ఉన్నారు. ఇదే కేసులో అరెస్టైన ఆమె మరిది గోపి(A3) ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ అయింది.
AP: అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో CM చంద్రబాబు చెప్పారని, కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులమయంగా మారుస్తున్నారని YCP నేత పేర్ని నాని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు, పవన్ ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే. ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? ఇంత బరితెగింపా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా ఈడీ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.
శరీరం నుంచి సువాసన వచ్చేందుకు చాలా మంది పర్‌ఫ్యూమ్ వాడుతుంటారు. దీనిని ఎక్కువగా వాడితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పర్‌ఫ్యూమ్స్‌లో ఉపయోగించే థాలేట్స్, సింథటిక్ సువాసనలు శరీరానికి హాని కలిగిస్తాయి. వీటి వల్ల చర్మంపై అలర్జీ, దద్దుర్లు వస్తాయి. పదేపదే వీటిని ఉపయోగిస్తే రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ కొత్త మేయర్‌గా బీజేపీ అభ్యర్థి రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నికయ్యారు. మొత్తం 142 ఓట్లకుగానూ 133 ఓట్లు సాధించి ఇక్బాల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్‌దీప్ సింగ్‌కు 8 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. దీంతో ఇక్బాల్ మేయర్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.