India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో అక్కడ సైనికులు ఎందుకు లేరు? అని ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ఏటా బైసరన్ ప్రాంతం అమర్‌నాథ్ యాత్రతో పాటే టూరిస్టుల కోసం ఓపెన్ అవుతుందని చెప్పింది. ఆ సమయంలో సైనికుల పహారా ఉంటుందని తెలిపింది. కానీ, ప్రస్తుతం APR 20 నుంచే టూరిస్ట్ ఆపరేటర్లు పర్యాటకులను తీసుకొచ్చారని పేర్కొంది. ఆ విషయాన్ని స్థానిక అధికారులు భద్రతా బలగాలకు చెప్పకపోవడమే కారణమని వివరించింది.
PAKతో ఉద్రిక్తతల నడుమ ఆ దేశస్థులంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే అక్రమంగా దేశంలోకి వచ్చి భారత పౌరుడిని పెళ్లి చేసుకున్న పాకిస్థానీ సీమా హైదర్ దేశం వీడే అవసరం లేదని ఆమె లాయర్ శివ సింగ్ వెల్లడించారు. గ్రేటర్ నోయిడా వాసి సచిన్‌ను ఆమె పెళ్లి చేసుకుందని, ఇటీవల కూతురుకు జన్మనిచ్చిందని తెలిపారు. ఆమె పౌరసత్వం భర్తతో ముడిపడి ఉందని, కేంద్రం ఆదేశాలు వర్తించవని పేర్కొన్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(DPIFF)కు నామినేట్ అయింది. ఢిల్లీలో ఈ నెలాఖరున జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ చిత్రాన్ని ప్రకటించనున్నారు. కాగా సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది అక్టోబర్‌లో విడుదలైంది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. నయన్ సారిక, తన్వీరామ్‌లు హీరోయిన్లుగా నటించారు.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. దాదాపు 10వేల మందితో భద్రత బలగాలు మావోయిస్టుల కోసం గుట్ట చుట్టూ వేట కొనసాగిస్తున్నాయి. మావో అగ్ర నేతలు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టారు. 3 రోజులుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుండటంతో కొందరు జవాన్లకు వడదెబ్బ తగలడంతో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తాము చర్చలకు సిద్ధమని మావోలు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.
వక్ఫ్ సవరణ చట్టాన్ని సమర్థించుకుంటూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వక్ఫ్ బోర్డులు పారదర్శకంగా పని చేయడం లేదని పేర్కొంది. ఈ చట్టంపై స్టే విధించవద్దని కోరింది. రాజ్యాంగానికి లోబడే చట్ట సవరణ చేశామని సుప్రీంకోర్టుకు తెలిపింది.
AP: ఒంగోలులో మూడు రోజుల క్రితం టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిందితులు వాడిన స్కూటీ లభ్యమైంది. చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాబా వద్ద స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా విచారణ వేగవంతం చేశారు. హత్య సమయంలో నిందితులు 2 స్కూటీలపై వచ్చి ఒకటి దాబా దగ్గర వదిలి వెళ్లగా, దానిపై రక్తం మరకలు ఉన్నట్లు తెలుస్తోంది.
TG: మేడిగడ్డ బ్యారేజ్‌పై NDSA రూపొందించిన <<16206712>>నివేదికపై<<>> మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని NDSA తేల్చిందన్నారు. రూ.లక్ష కోట్లతో BRS నాసిరకం ప్రాజెక్టు నిర్మించిందని మండిపడ్డారు. రూ.వేల కోట్లు దోచుకునేందుకు కాళేశ్వరం నిర్మించారని ఫైరయ్యారు. క్యాబినెట్‌లో NDSA నివేదికపై చర్చించాకే తర్వాతి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.
టీ20Iల నుంచి కోహ్లీ అనవసరంగా రిటైరయ్యారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. ‘కనీసం 2026 T20 వరల్డ్ కప్ వరకూ కోహ్లీ ఆడాల్సింది. IPLలో అతడి ఫిట్‌నెస్ స్థాయులు, ఆడే విధానం చూస్తుంటే తొందరపడ్డారనే అనిపిస్తోంది. ఆయనింకా తన అత్యుత్తమ దశలోనే ఉన్నారు. మరికొంత కాలం కొనసాగాల్సింది’ అని పేర్కొన్నారు. IPL-2025లో కోహ్లీ ఇప్పటి వరకు 392 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ మూవీకి నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేేపట్టారు.
Sorry, no posts matched your criteria.