News April 25, 2025

ఆర్మీ కంటపడ్డాడు.. ఖతమయ్యాడు

image

లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భారత సైన్యం <<16209767>>మట్టుబెట్టిన<<>> విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి నిందితుల కోసం ఆర్మీ, J&K పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టగా అల్తాఫ్ వారి కంటపడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీ ఫైరింగ్‌లో అల్తాఫ్ హతమయ్యాడు. అటు కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఆర్మీ చీఫ్ ద్వివేది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News April 25, 2025

BREAKING: ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత

image

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్(84) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని నివాసంలో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో ఛైర్మన్‌గా కొనసాగారు. PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

News April 25, 2025

‘సారంగపాణి జాతకం’ రివ్యూ&రేటింగ్

image

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూప జంటగా తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ థియేటర్లలో విడుదలైంది. జాతకాలను నమ్మే హీరో పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది సినిమా స్టోరీ. ప్రియదర్శి సహజ నటన, వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ మెప్పిస్తాయి. హీరోయిన్ రూప యాక్టింగ్, ఇంద్రగంటి రచన ఆకట్టుకుంటాయి. కాస్త స్లోగా అనిపించడం, ఊహించేలా కథ సాగడం మైనస్.
WAY2NEWS RATING: 2.75/5.

News April 25, 2025

యుద్ధ భయం.. భారీగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్

image

ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతోంది. ఉదయం నుంచే మందకొడిగా సాగిన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 567 పాయింట్లు కోల్పోయి 79,234వద్ద సాగుతోంది, నిఫ్టీ 200పాయింట్ల నష్టంతో 24,045వద్ద ట్రేడవుతోంది. భారత్-పాకిస్థాన్ యుద్ధ భయం నేపథ్యంలో మార్కెట్ కుదేలవుతోంది.

News April 25, 2025

రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022, నవంబరు 17న భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్‌ను ‘బ్రిటిష్ ఏజెంట్’గా రాహుల్ అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. స్వాతంత్ర్య సమరయోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని తేల్చిచెప్పింది. ఇది మళ్లీ రిపీటైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News April 25, 2025

మొదటి సిక్స్ ప్యాక్‌ ఎవరిది?.. హీరోల మధ్య వివాదం

image

తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై తమిళనాట హీరోల మధ్య వివాదం నెలకొంది. ఇండస్ట్రీలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసింది సూర్య అని ఆయన తండ్రి శివకుమార్ ఓ కార్యక్రమంలో అన్నారు. అతడిలా ఎవరూ కష్టపడలేరని కామెంట్ చేశారు. దీనిపై విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘అందరికంటే ముందుగా సిక్స్ ప్యాక్ చేసింది ధనుష్. ఆ తర్వాత ‘సత్యం’ కోసం నేను చేశాను’ అని గుర్తుచేశారు. ఇది కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.

News April 25, 2025

యూట్యూబ్ నుంచి ‘అబిర్ గులాల్’ సాంగ్స్ తొలగింపు

image

భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమా విడుదలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని పాటలను యూట్యూబ్ నుంచి మేకర్స్ తొలగించారు. ‘సరిగమ’ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీటిని రిలీజ్ చేయగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రిమూవ్ చేసింది. కాగా ఈ మూవీలో భారతీయ నటి వాణీకపూర్ ఫవాద్‌కు జోడీగా నటించారు.

News April 25, 2025

IPL: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

image

IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచులు(16 పాయింట్లు) గెలవాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రకారం ఆయా జట్లు కింది సంఖ్యలో మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
* గుజరాత్ టైటాన్స్(GT)- 2, DC- 2, RCB-2,
* PBKS-3, LSG-3, MI-3
* KKR-5, SRH-6, CSK-6
* RR-అవకాశాలు లేనట్లే.

News April 25, 2025

హిందువులైతే ఇలా చేయరు.. ఉగ్రదాడిపై భాగవత్

image

పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులిస్తుందనే నమ్మకముందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు, అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికే ఎవరూ ధైర్యం చేయరు అని తేల్చిచెప్పారు. రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశమిచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు.

News April 25, 2025

ఉగ్రదాడి వెనుక సూత్రధారి ఇతడే?

image

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్‌కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.