News April 25, 2025

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే ఉంది: డానిష్ కనేరియా

image

పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. ‘టెర్రరిస్టులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడం దారుణం. ఆయన వ్యాఖ్యలు నిజంగానే పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఉన్నాయి’ అని ఎక్స్‌లో మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపైనా డానిష్ దాయాది దేశాన్ని విమర్శించారు. అతడు ప్రస్తుతం USలో నివాసముంటున్నారు.

News April 25, 2025

‘అమ్మా, నాన్నా.. నాకు బతకాలని లేదు’

image

అంటూ ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. TG జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. ఏడాది కిందట బాబు పుట్టడంతో ప్రసన్న ఉద్యోగం మానేసింది. దీంతో భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు. ఈక్రమంలోనే ఇటీవల పుట్టింటికి వచ్చిన ప్రసన్న అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

News April 25, 2025

పెళ్లి శుభలేఖపై మహేశ్ బాబు ఫొటో!

image

సినీ హీరోలపై అభిమానాన్ని వారి ఫ్యాన్స్ వివిధ రకాలుగా చూపిస్తుంటారు. కర్నూలుకు చెందిన ఓ మహేశ్ బాబు ఫ్యాన్ తన పెళ్లి శుభలేఖపై సూపర్ స్టార్ ఫొటోను ముద్రించి తన ఇష్టాన్ని చాటుకున్నారు. శుభలేఖ కవర్‌పై దేవుడి ఫొటోల కింద మహేశ్ ఫొటోను ముద్రించారు. అతడు దీన్ని నెట్టింట పంచుకోగా మహేశ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

News April 25, 2025

రేవంత్ అరాచకాలను ఎదిరించేందుకు కదిలిన గులాబీ దండు: హరీశ్

image

TG: నాడు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి రామ దండు కదిలితే, నేడు రేవంత్ అరాచకాలను ఎదిరించడానికి గులాబీ దండు కదిలిందని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. 25 ఏళ్ల పార్టీ ఆవిర్భావ సభకు కదం తొక్కుతూ యువత పాదయాత్ర చేపట్టారన్నారు. పురిటిగడ్డ సిద్దిపేటలో 25 మీటర్ల గులాబీ జెండాను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. BRS రజతోత్సవం.. తెలంగాణ ప్రజల విజయోత్సవమని రాసుకొచ్చారు.

News April 25, 2025

ఉగ్రదాడి: వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకర కామెంట్స్.. అరెస్ట్

image

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మరణించిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్‌ను చూసి భార్య రోదించిన తీరు కోట్లాది హృదయాలను కన్నీళ్లు పెట్టించాయి. అయితే ఈ ఘటనపై MPకి చెందిన ఒసాఫ్ ఖాన్ అభ్యంతకర కామెంట్స్ చేశాడు. ‘వినయ్‌ని చంపించడానికి ఆయన భార్య ఓ షూటర్‌ని నియమించి అవకాశం రావడంతో అతనిని అంతం చేసి ఉండవచ్చు. ముందు ఆమెను విచారించాలి’ అని SMలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

News April 25, 2025

యుద్ధ భయం.. ఒడిదొడుకుల్లో భారత మార్కెట్లు

image

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇవాళ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. యుద్ధ భయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ తొలుత గ్రీన్‌లోనే మొదలైనా క్రమంగా రెడ్‌లోకి పడిపోయాయి. ప్రస్తుతం బీఎస్ఈ 60 పాయింట్లు నష్టపోయి 79,742 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 24,213 వద్ద కొనసాగుతోంది.

News April 25, 2025

ఉగ్రదాడి: ఆలస్యమే వారిని రక్షించింది!

image

పహల్గామ్ ఉగ్రదాడిలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాణం ఆలస్యం కావడంతో 39 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గుర్రాలు అందుబాటులో లేక 28 మంది, ఓ రెస్టారెంట్‌లో ఫుడ్‌లో ఉప్పు ఎక్కువైందని కేరళ ఫ్యామిలీ ఆగిపోయింది. అదే సమయంలో ఉగ్ర దాడులు చోటు చేసుకోగా అనుకోని ఆలస్యం వీరిని మృత్యువు నుంచి తప్పించింది. మరోవైపు దాడి జరిగిన టైమ్‌లో భేల్‌పూరి తినేందుకు స్నాక్ బ్రేక్ తీసుకున్న ఓ జంట ప్రాణాలతో బయటపడింది.

News April 25, 2025

సంజూ లేని లోటు మాకు కనిపిస్తోంది: సందీప్

image

కెప్టెన్ సంజూ శాంసన్ లేని లోటు తమ జట్టుకు తెలుస్తోందని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ అన్నారు. ‘సంజూ చాలా అనుభవజ్ఞుడైన బ్యాటర్, కెప్టెన్. మా లైనప్‌లో తను లేని లోటు కనిపిస్తోంది. అతడి గాయం మాకు చాలా నష్టం చేసింది’ అని పేర్కొన్నారు. తొలి 3 మ్యాచులు బ్యాటర్‌గా ఆడిన సంజూ, ఆ తర్వాత పక్కటెముకల గాయంతో జట్టుకు దూరమయ్యారు. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచుల్లో గెలవాల్సిన స్థితి నుంచి RR ఓటమిపాలైంది.

News April 25, 2025

బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే: గౌతమ్ రావు

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన గౌతమ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు కాంగ్రెస్ సహకరించిందని ఆరోపించారు. కార్పోరేటర్లు ఓట్లు వేయకుండా అడ్డుకున్న BRSను ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మూడు పార్టీలు ఒక్కటేనని, MIM చెప్పినట్లుగా కాంగ్రెస్ చేస్తోందన్నారు.

News April 25, 2025

టెర్రరిస్ట్-మిలిటెంట్.. ఏంటి తేడా?

image

విశ్లేషకుల ప్రకారం.. హింసతో సమాజంలో భయం కల్గించి వ్యవస్థ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థికస్థితి తదితరాలు దెబ్బతీసేది ఉగ్రవాదం (టెర్రరిజం). దీనికి రాజకీయ, మత, ప్రాంత తదితర కారణాలుంటాయి. సామాజిక, రాజకీయ లక్ష్యాలతో హింసకు పాల్పడేవారు తీవ్రవాదులు (మిలిటెంట్స్). రెండూ హింస మార్గాలే, కానీ ఉద్దేశాలు వేరు. పహల్గాం దాడి ‘మిలిటెంట్ అటాక్’ అన్న <<16207620>>NYTపై<<>> USA ప్రభుత్వం ‘ఇది టెర్రరిస్ట్ అటాక్’ అని కౌంటరిచ్చింది.